Saturday, July 27, 2024

హైదరాబాద్ పై వరుణుడి ప్రతాపం..

తప్పక చదవండి
  • తీవ్ర ఇబ్బందుల పాలైన నగర వాసులు..
  • ఒక్క సారిగా మారిన వాతావరణం..

దాదాపు మూడు రోజులపాటు తెరపిచ్చిన వరుణ దేవుడు.. ఉన్నట్టుండి హైదరాబాద్ మహానగరంపై మరోసారి ఉరిమాడు. నేడు సాయంత్రం భారీ వర్షం పడింది. దాదాపు 30 నిమిషాలపాటు జోరుగా పడిన ఈ వానతో నగరం మరోసారి తడిసి ముద్దయ్యింది. లింగంపల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అశోక్‌నగర్, లక్డీకపూల్‌తోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీళ్లు నిలిచి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో నగరవాసులకు మరోసారి ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యాయి.

రామంతపూర్, అంబర్ పేట్, మలక్‌పేట్‌, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. అంతేకాకుండా అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. ఇక ఉద్యోగులు, విద్యార్థులు ఇళ్లకు చేరుకునే సమయం కావడంతో మరోసారి ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది. సచివాలయం ప్రాంతంలో భారీ వర్షం పడడంతో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. దీంతో మరోసారి సెక్రెటరియేట్ ముందు వర్షపు నీరు నిలిచింది. ఆఫీసులు ముగించుకుని ఇంటికెళ్లే సమయంలో వర్షం పడడంతో ఉద్యోగులు, వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. నెమ్మదిగా వాహనాలు కదలడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు