దాదాభాయి నౌరోజీ కాంగ్రెస్ పార్టీకి వాస్తవానికి ప్రాతః స్మరణీయులు. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఆయన ఒకరు. మూడు పర్యాయాలు జాతీయ కాంగ్రెస్ వార్షిక సభలకు అధ్యక్షత వహించిన నాయకులు. నౌరోజీ జీవిత చరిత్ర 19 వ శతాబ్దంలో భారతీయ జాతీయవాదుల పోరాటాలను స్పష్టంగా తెలుపు తుంది. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించక ముందు నుంచే స్వాతంత్ర్యం కోసం గళమెత్తారు. నౌరోజీ, ఎ. ఓ. హ్యూమ్, దిన్షా ఎదుల్జీ వాచాతో కలిసి భారత జాతీయ కాంగ్రెస్ ను స్థాపించారు.1892 నుండి 1895 వరకు ఇంగ్లాండ్ చట్టసభ అయిన యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో కొనసాగారు. ఆయన ఆ పదవి పొందిన మొదటి ఆసియా వ్యక్తి. దాదాభాయ్ నౌరోజీ (సెప్టెంబర్ 4, 1825 – జూన్ 30, 1917) పార్సీ మతానికి చెందిన విద్యావేత్త, మేధావి, పత్తి వ్యాపారి, తొలితరం రాజకీయ, సామాజిక నాయకులు, బ్రిటీష్ చట్టసభ సభ్యుడైన తొలి ఆసియా ఖండ వాసి అయిన దాదాభాయ్ నౌరోజీ 1825 సెప్టెంబరు 4 న, బొంబాయిలో నవసారిలో ఒక పార్శీ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి పలన్ జీదోరోజి జొరాష్ట్రియన్ మత పురోహి తులు. బరోడా మహారాజు మూడవ శాయాజీరావు గైక్వాడ్ సహాయంతో కళాశాల ఎలిఫెన్‌స్టోన్ ఇనిస్టిట్యూట్‌లో చదివారు. తరువాత అక్కడే ఆచార్య పదవిని పొందారు. మహిళలకు విద్యను ప్రోత్స హించ డానికి జరిగిన ప్రత్యేక తరగతులలో ఆయన బోధిం చారు. తన జొరాస్ట్రియన్ మతంలో సంస్కరణల కోసం ఆయన పాటు పడ్డారు. నౌరోజీ ఆలోచనలు, ఆర్థికశాస్త్రంపై ఆధారపడినవి. కామా అండ్ కో’ అనే కంపెనీలో భాగస్వామి కావడానికి 1855 సంవత్సరంలో ఆయన లండన్ వెళ్లారు. ఆ కంపెనీ లివర్‌పూల్ లో బ్రిటన్‌లో స్థాపించబడిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది. భారత స్థితి గతులను ఆంగ్లేయులకు విడమరిచి చెప్పారు. నౌరోజీ ఇంగ్లాండ్‌లో లిబరల్ పార్టీలో చేరారు. మూడేళ్లలో దాదా భాయ్ రాజీనామా చేసి, తన సొంత వ్యాపార సంస్థ ‘దాదాభాయ్ నౌరోజీ & కో.’ ప్రాంభించారు. ఇంగ్లండ్‌లో భారతీయుడు స్థాపించిన తొలి వాణిజ్య సంస్థ అదే. 1865 నుండి 1866 వరకు, లండన్ విశ్వ విద్యాలయ కళాశాలలో గుజరాతీ భాషా ఉపాధ్యా యులుగా కూడా పనిచేశారు. 1865 లోనే, భారతీయ రాజకీయ, సామాజిక మరియు సాహిత్య సమస్యలు మరియు విషయాలను చర్చించి, ఇంగ్లాండ్ ఓటర్లకు అనుకూ లంగా మార్చడం ఉద్దేశ్యంతో దాదాభాయ్ నౌరోజీ ‘లండన్ ఇండియన్ సొసైటీ’ని స్థాపించారు. ఆయన ‘ఈస్ట్ ఇండియా అసోసియేషన్’ ఏర్పాటులో కీలక పాత్ర పోషిం చారు. అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ప్రధాన సంస్థ, స్థాపన ప్రధాన ఉద్దేశం బ్రిటిష్ వారి ముందు భారతీయుల శక్తిని బలోపేతం చేయడం. 1874 లో బరోడా ఇన్స్టిట్యూట్ యొక్క మున్షి పోస్ట్ బాధ్యతను స్వీకరిం చారు.1875 లో, అతను బొంబాయి మునిసిపల్ కార్పొరేషన్ సభ్యుడు అయ్యా రు. నౌరోజీ 1886 లో మొదటిసారిగా బ్రిటిష్ పార్లమెంట్ పదవి కోసం పోటీ చేసి, ఓటమి పాలు కాగా, 1892 లో తన రెండవ ప్రయ త్నంలో విజయం సాధించి, హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికైనారు. బ్రిటిష్ పార్లమెంటులో ఎన్నికైన మొదటి ఆసియా వ్యక్తిగా 1892 నుండి 1895 వరకూ పార్లమెంట్ సభ్యుడిగా యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో కొన సాగారు. బ్రిటిష్ పార్లమెంట్ లో భారత ఉప ఖండంలో వలస రాజ్యాల దోపిడీ సమస్యను మొదట లేవనెత్తారు. 1895 సంవత్స రానికి భారత వ్యయం పై రాయల్ కమిషన్ సభ్యులుగా కూడా నియమించ బడ్డారు. బరోడా మహారాజు శయాజీ రావు గైక్వాడ్ కాలంలో సంస్థాన దివానుగా పని చేసారు.1874 లో, ఆయన బరోడా ప్రధాన మంత్రి, 1885 నుండి 1888 వరకు ముంబై శాసన మండలి సభ్యుడయ్యారు. అలా ప్రజా జీవితంలో ప్రవేశించిన ఆయన “గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా” గా ప్రసిద్ధి గాంచారు. భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకులు సురేంద్రనాథ్ బెనర్జీతో పాటు వ్యవస్థాపకుల్లో ఒకరు. 1886 లో నౌరోజీ దాని అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 1893 లో లాహోరులో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి రెండోసారి అధ్యక్షత వహించారు. 1906 లో జరిగిన కలకత్తా సమావేశానికి కూడా అధ్యక్షత వహించి మూడు సార్లు ఈ పదవి పొందిన తొలి నాయకులుగా అవతరించారు. దాదాబాయి నౌరోజీ పలు గ్రంథాలు రచించారు. ఆయన రాసిన పుస్తకం “పావర్టీ మరియు అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా” అనే పుస్తకం భారతదేశం నుండి బ్రిటన్ తరలిస్తున్న నిధుల గురించి వివరించిన మొదటి పుస్తకం. అలాగే పార్సీల మర్యాదలు మరియు ఆచారాలు, యూరోపియన్ మరియు ఆసియటిక్ జాతులు, భారత దేశానికి కావలసినవి మరియు సాధనాలు, భారత దేశంలో పేదరికం మరియు బ్రిటిష్ రహిత నియమం, పార్సీ మతం తదితర రచనలు చేశారు. ఆయన 30 జూన్ 1917 న మరణించారు. బ్రిటిష్ పార్లమెంటులో భారతీయుల కోసం వాదించిన, బ్రిటిష్ విధానాలను విమర్శించిన నిజమైన జాతీయ వాది దాదా భాయిని ప్రతి భారతీయుడు గుర్తెరగాల్సిన అవసరం ఉంది.