Monday, June 17, 2024

తప్పుడు రిపోర్ట్స్ ఇవ్వడమే ఈ డాక్టర్ నైజం..

తప్పక చదవండి
 • తన రిపోర్ట్స్ తో జీవితాలను నాశనం చేస్తున్న వైనం..
 • డా. సుగుణాకర్ రాజుపై చర్యలకు వెనుకాడుతున్న ఉన్నతాధికారులు..
 • తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అతగాడి సర్టిఫికేట్ ను 6 నెలలు సస్పెండ్ చేసింది..
 • అర్హత లేకున్నా విధులు నిర్వహిస్తున్న డా. సుగుణాకర్ రాజును
  కాపాడుతోంది ఎవరు..?
 • ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నారో తెలంగాణ రాష్ట్ర
  హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ రిజ్వి, ఐఏఎస్.. సమాధానం చెప్పాలని
  డిమాండ్ చేసిన ఎస్.కె. ప్రసన్న..

ధన్వంతరి వారసులం అనే చెప్పుకునే వైద్యులు.. ఆ వారసత్వాన్ని పక్కనబెట్టి.. అవినీతి సామ్రాజ్యంలో మునిగితేలుస్తున్నారు.. తప్పుడు రిపోర్ట్స్ ఇవ్వడమే తన స్పెషాలిటీగా మార్చుకున్న డా. సుగుణాకర్ రాజు ఈ కోవలోకే వస్తాడు.. ఇతగాడి భాగోతాల గురించి ఇదివరకే ఆదాబ్ కథనాలు ప్రచురించింది.. తాజాగా ఈయన చేసిన ఘనకార్యం ఒకటి వెలుగు చూసింది.. వివరాలు చూద్దాం..

హైదరాబాద్, తాజాగా జనగామ జిల్లాలో జరిగిన రిటైర్డు ఎం.పీ.డీ.ఓ. హత్యలో పాల్గొన్న హంతకులు గతంలో సుభద్ర అనే మహిళను కూడ హత్య చేసినట్లు పోలీస్ ల ముందు ఒప్పుకున్నారు.. ఈ మహిళపై గాయాలు ఉన్నా.. ఇది సహజ మరణం అని పోస్టుమోర్టెమ్ రిపోర్ట్ ఇచ్చిన డా: సుగుణకర్ రాజు ఎవరి ఒత్తిళ్లకు గురై తప్పుడు రిపోర్ట్ ఇచ్చినాడు.. లేక ప్రలోభాలకు లొంగి రిపోర్ట్ ఇచ్చాడా..? హంతకులు స్వయంగా హత్య చేసినట్లు ఒప్పుకునే వరకు బయటి లోకానికి తెలువదు.. అత్యంత కీలక మైన పోస్టుమోర్టమ్ రిపోర్ట్ ఆధారంగా పోలీస్ లు కేసును మూసివేశారు.. డా: సుగుణకర్ రాజు.. పడుగుల దామోదర్ విషయంలో తప్పుడు రిపోర్ట్ ఇచ్చి మెడికల్ కౌన్సిల్ ద్వారా సస్పెండ్ అయినాడు.. ఇప్పుడు తప్పుడు పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చాడు.. ఈ కేసు లో ఎస్.ఐ. ని సస్పెండ్ చేశారు.. కానీ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఈయనపై చర్యలు లేవు.. కాగా ఇప్పటివరకు డా: సుగుణకర్ రాజు ఇచ్చిన పోస్టుమోర్టమ్ రిపోర్ట్ లపై దర్యాప్తు జరిపితే ఇంకా ఎన్ని ఘోరాలు జరిగాయో బయటకు వస్తాయి అని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ప్రశ్నిస్తున్నారు.. జనగామ వరుస సుపారీ హత్యలు చూస్తుంటే.. భారతీయుడు సినిమాలో మాదిరిగా ఒక డాక్టరు, ఒక లాయర్, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక రాజకీయ నాయకుడు కలసి ఎలా కేసులను తారుమారు చేస్తారో..? జనగామలో కూడా అదే విధంగా జరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. జనగామ మరో బీహార్ లాగా మారిపోయిందని.. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలపై సీబీఐ సమగ్ర విచారణ జరిపితే.. మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు..

- Advertisement -

సర్టిఫికెట్లు సస్పెండ్ అయినా వైద్యం ఎలా చేస్తాడు..?
ప్రశ్నిస్తున్న బీసీ మహిళా నాయకురాలు, రిటైర్డ్ పబ్లిక్ హెల్త్ నర్స్ ఎస్.కె. ప్రసన్న..

టికెట్ లేని ప్రయాణం నేరం అని రోడ్డు రవాణా సంస్థ, రైల్వే డిపార్ట్మెంట్ చెబుతున్నాయి.. అలాగే లైసెన్స్ లేకుండా వాహనం నడపటం నేరం అని రోడ్డు ట్రాఫిక్ అథారిటీ డిపార్ట్మెంట్ చెబుతోంది.. అలాగే మెడికల్ రిజిస్ట్రేషన్ లేకుండా వైద్యం చెయ్యడం నేరం అని నేషనల్ మెడికల్ కౌన్సిల్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చెబుతోంది.. 6నెలల పాటు తన మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ సస్పెండ్ చేసినా డా: సుగుణకర్ రాజు ఎలాంటి అర్హతతో ఇంకా ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్నాడు..? అతను ఇప్పుడు లైసెన్స్ లేని వైద్యుడు.. అతనికి ప్రభుత్వం జీతం ఎలా ఇస్తుంది..? వాస్తవానికి ఈ ఆరు నెలల పాటు ఆయన వైద్యం చెయ్యకూడదు.. ఇప్పుడు అతను కొనసాగుతున్న సూపరింటెండెంట్ పోస్ట్ కూడ ఇంచార్జి పోస్ట్.. అంటే తన రెగ్యులర్ విధులు నిర్వహించుకుంటూ.. అదనంగా సూపరింటెండెంట్ విధులు నిర్వర్తించాలి.. కానీ లైసెన్స్ రద్దు అయినా.. అతడిని ఇంకా ఎందుకు విధుల నుండి తొలగించడం లేదో.. తెలంగాణ రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ రిజ్వి, ఐఏఎస్ ప్రజల కు వివరించాలని ఎస్.కె. ప్రసన్న డిమాండ్ చేశారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు