Monday, May 20, 2024

ఉస్మానియా యూనివర్సిటీ లో గిరిజన మహిళా ప్రొఫెసర్ నియామకం..

తప్పక చదవండి
  • అరుదైన ఘనత సాధించిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కుమార్తె..

ఒక గిరిజన అమ్మాయి 100 ఏళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో న్యాయ కళాశాలలో ఒక మహిళా ప్రొఫసర్ గా నియమాకావటం ఇదే తొలిసారి. ఇది ఎలా సాధ్యమయ్యింది? ఎన్నో అవరోధాలను అధిగమించింది, ఎన్నో అవమానాలను గుండెల్లో దాచుకుంది. తన మూలలను మరవని కారణంగానే ఈ రోజు ఉన్నత శిఖరాలను అధిరోహించింది. ఏ గిరిజన జాతి నుంచి వచ్చిందో.. అదే గిరిజనల ఆస్థి హక్కుల పరిరక్షణపై పిహెచ్డి చేసింది. ఇంతకీ తాను ఎవరో కాదు ఖమ్మం జిల్లా ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య కుమార్తె.. అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఒక్క అవినీతి ఆరోపణలేని, తన జీతం కూడా ప్రజాసంక్షేమానికి ఖర్చుపెట్టే మహోన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి. తండ్రి నేర్పిన విలువలే లక్ష్యంగా జీవితం ప్రారంభిన గుమ్మడి అనురాధ మనకి ఆదర్శం… ఆడపిల్లలు ఇలా ఉన్నతస్థాయిలో ఉండటం ఆనందదాయకం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు