Sunday, April 28, 2024

బోధిధర్మ ఆయుర్వేద పీఠంపై విచారణ షురూ..

తప్పక చదవండి
  • కమిషనర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ వారికి ఫిర్యాదుచేసిన ఆదాబ్..
  • బోడుప్పల్ లో వెలుగుచూసిన నకిలీ వైద్య లీలలు..
  • ఆయుర్వేద వైద్యపీఠం ద్వారా అమాయకులకు గాలం..
  • ఏ అర్హత లేకుండా డాక్టర్ నని చెప్పుకుంటున్న పండిట్ శ్రీనివాస్ గురూజీ..
  • ఎలాంటి అనుమతులు, అర్హత లేకుండా వైద్యం నిర్వహణ..
  • నిజా నిజాలు తేలితే చర్యలు తీసుకుంటామన్న అధికారులు..

హైదరాబాద్, బోడుప్పల్ లో బోధిధర్మ ఆయుర్వేద పీఠంలో ఎలాంటి అర్హతలు లేకుండా, ఆయుర్వేద వైద్య నిపుణుడిని అని చెప్పుకుంటూ.. ఏవిధమైన ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆయుర్వేద వైద్యంతో అమాయకులను మోసం చేస్తూ వేలరూపాయలు వసూలు చేస్తున్న డా. పండిట్ శ్రీనివాస్ గురూజీ వ్యవహారంపై బోధిధర్మ పేరుతో బోడిగుండు.. అనే శీర్షికతో.. 10 జులై 2023 నాడు ఒక వార్తా కథనం ప్రచురితమైన సంగతి విదితమే.. కాగా బోధి ధర్మ ఆయుర్వేద పీఠం నిర్వహణపై, వారు చేస్తున్న మోసాలపై, అక్రమ వసూళ్లపై పూర్తి ఆధారాలతో ఆదాబ్ ప్రతినిధి హైదరాబాద్ లోని కమిషనర్ ఆయుష్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది.. దీనిపై ఆయుష్ అధికారులు సానుకూలంగా స్పందించారు..

గ్రామీణ ఖర్చులకే కార్పోరేట్ వైద్యం అంటూ..బోధి ధర్మ ఆయుర్వేద వైద్య పీఠం ద్వారా.. 12 రాష్ట్రాలలోని అనువంశిక ఆయుర్వేద వైద్యులచే తయారు చేయబడిన అద్భుత ఔషదాలు అంటూ.. మాయ మాటలతో మభ్య పెడుతూ జనాలను మోసం చేస్తూ లక్షల రూపాయలు దోచుకుంటున్నారు ఆయుర్వేద రత్న, ఆయుర్వేద సామ్రాట్ , ఆయుర్వేద విభూషణ్ అవార్డుల గ్రహీత డాక్టర్. పండిట్ శ్రీనివాస్ గురూజీ .. ఆయన పర్యవేక్షణలో సేవా దృక్పథంతో నిర్వహిస్తున తమ వైద్య పీఠం సేవలు అందరూ వినియోగించు కోవాల్సిందిగా కోరుతూ రంగురంగుల బ్రోచర్లతో.. ప్రజలకు మోసం చేస్తున్న ఈ ప్రముఖ దొంగ డాక్టర్.. బోధి ధర్మ ఆయుర్వేద వైద్య పీఠం, హెడ్ ఆఫీస్: పిల్లర్ నెం. 81. బండి కన్వెన్షన్ ఎదురుగా, బోడుప్పల్, ఉప్పల్, హైదరాబాద్ లో తమ ఆయుర్వేద పీఠాన్ని స్థాపించి అమాయకులను నిలువునా ముంచుతున్నాడు..

- Advertisement -

ఈ నకిలీ డాక్టర్ వ్యవహారంపై ‘ఆదాబ్’ హైదరాబాద్ ఆయుష్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.. కాగా దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించారు.. ఆయుష్ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా.. వైద్యం నిర్వహించడానికి అర్హత నిర్ణయించే సర్టిఫికేట్స్ లేకుండా అమాయకులకు వైద్యం అందిస్తున్నట్లు విచారణలో తేలితే.. వారిపై క్రిమినల్ చర్యలు చేపడతామని తెలియజేశారు.. కాగా ఇలాంటి నకిలీ వైద్య పీఠాల పట్ల, నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. సరైన సమాచారం సేకరించిన మీదటే ఇలాటి వైద్య పీఠాలను ఆశ్రయించాలని ఆయుష్ అధికారులు తెలియజేశారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు