Saturday, July 27, 2024

ఆసియా గేమ్స్ కు సెలెక్ట్ అయిన ఇషా..

తప్పక చదవండి

ఇటీవల జరిగిన జాతీయ షూటింగ్‌ టోర్నీలో సత్తాచాటిన రాష్ట్ర యువ షూటర్‌ ఇషా సింగ్‌ ఆసియా గేమ్స్‌కు ఎంపికైంది. ఒలింపియన్లు మనూ బాకర్‌, రాహి సర్ణోబత్‌ను వెనక్కి నెట్టి ట్రయల్స్‌లో అగ్రస్థానం దక్కించుకున్న ఇషాకు ఆసియా క్రీడలతో పాటు ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ బెర్త్‌ ఖరారైంది. జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆదివారం ఈ వివరాలు వెల్లడించింది. ఇషా మహిళల ఎయిర్‌ పిస్టల్‌ 10 మీటర్ల విభాగంతో పాటు 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో బరిలోకి దిగనుంది. ఈ రెండు విభాగాలకు ఎంపికైన ఏకైక షూటర్‌గానూ ఇషా నిలిచింది. మిక్స్‌ ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో శివ నర్వాల్‌తో కలిసి ఇషా బరిలోకి దిగనుంది. పురుషుల విభాగంలో దివ్యాన్ష్‌, ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌, రుద్రాంక్ష్‌, స్వప్నిల్‌, అఖిల్‌, సరబజ్యోత్‌ సింగ్‌, శివ్‌ నర్వాల్‌, అరుణ్‌ సింగ్‌, అనీశ్‌, విజయ్‌వీర్‌, ఆదర్శ్‌ బరిలోకి దిగనున్నారు. మహిళల విభాగంలో మెహులీ ఘోష్‌, పాలక్‌, మనూబాకర్‌తో కలిసి ఇషా సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నది.

దేశం తరఫున బరిలోకి దిగడం ఎప్పుడూ ఉత్సాహాన్నిస్తుంది. ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలకు ఎంపికవడం చాలా ఆనందంగా ఉంది. మెగాటోర్నీలో సత్తాచాటేందుకు ప్రయత్నిస్తా. అభిమానుల సమక్షంలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలనే లక్ష్యంతో కష్టపడుతున్నా. ఆసియా గేమ్స్‌, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటుతా. వచ్చే ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా పెట్టుకున్నా. దాని కోసం కఠోర సాధన చేస్తున్నా. ఆసియా గేమ్స్‌లో పతకంతో నాపై ఉన్న అంచనాలను నిజం చేస్తా అన్నారు ఈషా..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు