- బీ.ఆర్.ఎస్. రాష్ట్ర సీనియర్ నాయకురాలు గుండ్రాతి శారదా గౌడ్..
వాస్తవం ఇదే.. అంబర్పేట మూసినది.. ముసరాంబాగ్ బ్రిడ్జ్ మునిగి పొంగి పొర్లుతుంది.. రాకపోకలు బంద్ కాబోతుంది అనే వార్తలు నమ్మొద్దు అన్నారు గుండ్రాతి శారదాగౌడ్ బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు, రాష్ట్ర అధ్యక్షులు బీసీ మహిళా సంక్షేమ సంఘం.. కాకపోతే ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.. మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు 24/7 రక్షణ వలయంగా బ్రిడ్జ్ వద్ద ఉండి గమనిస్తున్నారు.. బ్రిడ్జ్ మీద రాకపోకలు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయి.. వదంతులు విని ఎవరు కూడా భయపడొద్దు.. కొన్ని రోజులు ఆ వార్తా చానెల్స్ చూడకుంటే బెటర్.. రేటింగ్ కోసం కొన్ని క్షణాల్లో బ్రిడ్జ్ మునిగి పోబోతుంది అని చెబుతున్నారు.. ఇలాంటివి అసలు నమ్మొద్దు.. జర భద్రంగా ఉండండి అన్నారు శారదాగౌడ్.