ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు. ఇప్పటివరకు తొలి స్థానంలో ఉన్న ఎల్‌ఎంవీహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్ బుధవారం 2.6 శాతం సంపదను కోల్పోయారు. దీంతో బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ లో మస్క్ అగ్ర స్థానానికి చేరుకున్నారు. ట్విటర్ కొనుగోలు తర్వాత మస్క్ వ్యక్తిగత సంపద భారీగా తగ్గిపోయింది. ఇదే సమయంలో లగ్జరీ ఉత్పత్తుల కొనుగోళ్లు విపరీతంగా పెరిగిపోవడంతో బెర్నార్డ్ ఆర్నాల్డ్ గత డిసెంబరులో మొదటి స్థానానికి చేరుకున్నారు. ఇప్పుడు ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో లగ్జరీ వస్తువల సంస్థల షేర్లు ఒడిదొడుకులకు గురవుతున్నాయి. ఫలితంగా బెర్నార్డ్ సంపద 2.6 శాతం తగ్గిపోయింది. ప్రస్తుతంగా బెర్నార్డ్ సంపద 186.6 బిలియన్ డాలర్లు కాగా, మస్క్ సంపద 192.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2023 ప్రారంభం నుంచి టెస్లా షేర్లు దాదాపు 66 శాతం పుంజుకోవడంతో మస్క్ సంపద 55.3 బిలియన్ డాలర్లు పెరిగింది.