Thursday, May 2, 2024

హెరిటేజ్ బ్రాండ్ ప్రయాణంలో ఒక చారిత్రాత్మక క్షణం..

తప్పక చదవండి

  • 250 వ షోరూమ్ ప్రారంభం..
    హైదరాబాద్, 10 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
    ఇప్పుడు రామాజ్ కాటన్ ఒక మార్గదర్శక సంస్థగా, 40 సంవత్సరాలు తన ప్రయాణాన్ని బలంగా కొనసాగిస్తున్న విజయవంతమైన బ్రాండ్. రామాజ్ కాటన్ సంస్కృతి, నాణ్యత, విశ్వాసానికి చిహ్నం. ఈ బ్రాండ్ ధోతీల యొక్క అంగీకారాన్ని తారాస్థాయికి పెంచింది. ముఖ్యంగా యువత ఇష్టపడే ఒక స్టైల్ స్టేట్మెంట్ దక్షిణ భారతదేశంలో విస్తరించింది. రామాజ్ కాటన్ ఇటీవలే 40వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.

ఈ రోజు, దేశవ్యాప్తంగా 250 కంపెనీ-యాజమాన్య అవుట్లెట్లను కలిగి ఉన్న కొద్దిపాటి బ్రాండ్లలో ఒకటిగా ఎదిగింది. ఈ బ్రాండ్ చరిత్రను సృష్టించింది. రామాజ్ తమ 250వ షోరూమ్ ను నేడు ( జూన్ 11వ తేదీన ) విజయవాడలో ప్రారంభించనున్నది.. ప్రముఖ నటుడు వెంకటేష్ దగ్గుబాటి ఈ షోరూమ్ ను ప్రారంభించనున్నారు. 1983లో ప్రారంభమైన ఈ ‘స్వదేశీ’ బ్రాండ్ సంస్కృతి, సంప్రదాయం, ఆవిష్కరణలు, ఉత్పత్తుల సమ్మేళనంతో వస్త్ర పరిశ్రమలో కొత్త ఒరవడి తెచ్చింది. దక్షిణ భారతదేశంలో ధోతీలు, ఇన్నర్ వేర్, నిట్ వేర్, ఫ్యాబ్రిక్స్, కిడ్స్ అండ్ ఉమెన్స్ వేర్ యొక్క అతి పెద్ద తయారీ, సరఫరా, ఎగుమతిదారులలో ఒకరైన రామ్ రాజ్ వస్త్ర పరిశ్రమలో ఉన్నత ప్రమాణాలని నెలకొల్పుతున్నారు. సాంప్రదాయ ధోతీల తయారీలో అగ్రగామి, రామాజ్ కాటన్ సుమారుగా 2500 రకాల ధోతీలను ఉత్పత్తి చేసే దక్షిణ భారతదేశంలో ప్రామాణికమైన సంస్కృతి, జాతీయ దుస్తులను ప్రోత్సహించే అతి పెద్ద బ్రాండ్. ఎన్నో సంవత్సరాలుగా, రామాజ్ కాటన్ అనేక పురస్కారాలు, కోట్ల హృదయాలను గెలుచుకుంది. గత కొన్నేళ్లుగా, ఈ సంస్థ అత్యంత ప్రాధాన్యత కలిగిన బ్రాండ్ గా ఎదిగింది. సాంప్రదాయ ధోతీల తయారీలో అగ్రగామిగా స్థిరపడి, అనేక ఉత్పత్తులతో విస్తరించింది. రామాజ్ కాటన్ రోజు ధరించే కాటన్ ధోతీల నుండి అత్యుత్తమమైన ప్రీమియం పట్టు ధోతీలు, కాటన్, లినెన్, స్వచ్చమైన పట్టు షర్టులు, అన్ని వయసుల వారికి కుర్తాలు, పురుషులు, మహిళల కోసం ఇన్నర్వేర్, బాత్రూమ్ ఉపకరణాలు వంటి 20కు పైగా ఉత్పత్తులకు నిలయంగా ఉంది. విజయవంతంగా ప్రారంభించబడి, రామాజ్ కాటన్ ఇప్పటి పోటీ పర్యావరణ వ్యవస్థలో ఒక ఎదురులేని, దృఢమైన సామ్రాజ్యంగా పరిణామం చెందింది. కే. ఆర్. నాగరాజన్ యొక్క గొప్ప కలలు, ఆశయాలు, ఆకాంక్షలపై నిర్మించబదిండి ఈ సంస్థ. అయన ఒక విజయవంతమైన వ్యవస్థాపకుడు మాత్రమే కాక, దార్శనికత కలిగిన నాయకుడు, భారతదేశపు మొట్టమొదటి కల్చర్-ప్రేంయూర్.

- Advertisement -

ఇతర బ్రాండ్లవలె కాకుండా, రామ్ రాజ్ కాటన్ తన ప్రయాణాన్ని గొప్ప ఆశయాలతో ప్రారంభించి, ఈ నాడు కీర్తి ప్రతిష్టలు, వ్యాపారాన్ని మించి ఎన్నో మహత్తరమైన ప్రయత్నాలతో, విశ్వాసంతో ముందుకు దూసుకుపోతుంది. ఈ సంస్థ నేత కార్మికులు, వారి కుటుంబాల శ్రేయస్సు, అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఈ 4-దశాబ్దాల ప్రయాణంలో, 50,000కు పైగా నేత కార్మికుల ఆకాంక్షలను పరిరక్షిస్తుంది. ఇంకా దక్షిణ భారతదేశంలోని 15,000 కుటుంబాలకు ఉపాధి అవకాశాలను కూడా కలిపించింది. ఈ గౌరవమైన బ్రాండ్ కు కీలకమైన అంశాలు.. నమ్మకం, వృద్ధి యొక్క బలమైన నెట్వర్క్. దక్షిణ భారత మార్కెట్లలో బలమైన పట్టుతో, ఈ బ్రాండ్ నేరుగా, విస్తృతమైన పంపిణీ వ్యవస్థ ద్వారా సుమారు 15000 ఎం.బీ.ఓ. లకు పైగా సేవలను అందిస్తోంది. అలాగే, ఈ సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లోని ఎన్నో నగరాలు, శివారు ప్రాంతాల్లో 250 బ్రాండ్ రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తోంది. రామ్ రాజ్ కాటన్ సంప్రదాయ వస్త్రాలు తయారుచేస్తూ, మన సంస్కృతిని ప్రోత్సహిస్తూ,
పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, దక్షిణ భారతదేశం అంతటా వేలాది మందికి ఉపాధి కలిపించే ఒక మహెూన్నతమైన సంస్థ… అసమానమైన నిబద్ధత, అచంచలమైన అంకితభావం కలిగిన దార్శనిక వ్యవస్థాపకులైన, ఛైర్మన్, కె. ఆర్. నాగరాజన్, ఇంకా వారి తరువాతి తరం వారి ఆధ్వర్యంలో, ఈ బ్రాండ్ తో అనుబంధం కలిగిన వ్యక్తుల ఆదరాభిమానములతో, ఇప్పుడు విజయవాడలో తమ 250వ షోరూమ్ ప్రారంభంతో చరిత్రను సృష్టిస్తోంది. తమ ఉత్పత్తులలో ప్రామాణికమైన సంస్కృతిని, సంప్రదాయం చొప్పించే ఈ సంస్థ ప్రయాణంలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. విజయోత్సవానికి ఉత్సాహాన్ని జోడిస్తూ, ఈ 250వ షోరూమ్ను తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన బహుముఖ నటనకి ప్రసిద్ధి చెందిన, మనందరి ప్రియతమ అభినేత, ప్రముఖ నటులు వెంకటేష్ దగ్గుబాటి ప్రారంభిస్తున్నారు. వీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల రామ్రాజ్ ధోతీలు, షర్ట్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఈ స్వదేశీ సంస్థ, దక్షిణ భారతదేశంలో మార్కెట్ లీడర్గా ఎదిగి, ఆకర్షణీయమైన ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా విస్తరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సంస్థ తమ ఉత్పత్తులను పెంచడంతోబాటు, సాంకేతికత, మార్కెటింగ్ ఇంకా ప్రకటనలను నిరంతరం మెరుగుపరుస్తూ, అమ్మకాలను మెరుగుపరచడం, నేటి మార్కెట్ అవసరాలకు బాగా సరిపోయే దృక్పథంతో దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఉత్పత్తులను అందించడానికి నిరంతరం కృషి చేస్తూ, భవిష్యత్తులో కొత్త విజయాలతో చరిత్రలను సృష్టించడానికి సిద్ధంగా ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు