Friday, November 1, 2024
spot_img

అవార్డుల పరంపర..

తప్పక చదవండి
  • తెలంగాణకు జాతీయ స్థాయిలో మూడు పురస్కారాలు
  • జలశక్తి అవార్డుల్లో రాష్ట్రానికి దక్కిన మూడు అవార్డులు
  • ఈ నెల 17న ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం..

హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి అవార్డుల పరంపర కొనసాగుతోంది.. ఇటీవలే దేశంలో తొలిసారిగా తెలంగాణకు ఐదు అంతర్జాతీయ అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు మరో మూడు జాతీయ పురస్కారాలు తెలంగాణను వరించాయి. ఇప్పటికే.. రాష్ట్రంలోని పలు గ్రామపంచాయతీలకు జాతీయ అవార్డులు రాగా.. ఇప్పుడు తాజాగా కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన నాలుగో జాతీయ జల అవార్డుల్లో తెలంగాణను మూడు అవార్డులు వరించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జగన్నాథపురం గ్రామ పంచాయతీకి జాతీయ ఉత్తమ పురస్కారం లభించటం విశేషం. ఇదిలా ఉంటే.. ఉత్తమ జిల్లా కేటగిరీలో ఆదిలాబాద్‌కు మూడో స్థానం దక్కింది. కాగా.. ఉత్తమ సంస్థల విభాగంలో ఉర్దూ వర్సిటీ రెండో స్థానంలో నిలిచింది. ఈ నెల 17న ఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రదానం జరుగనుంది. అయితే.. రాష్ట్రంలో ఓవైపు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహిస్తున్న రోజునే.. ఈ అవార్డులు ప్రకటించటం విశేషం.

ఇదిలా ఉంటే.. తెలంగాణకు జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ అవార్డులు వస్తున్నాయి. రాష్ట్రంలోని 5 నిర్మాణాలకు గానూ.. అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. లండన్‌లోని గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ అనే సంస్థ ప్రకటించిన గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు.. రాష్ట్రంలోని ప్రముఖ కట్టడాలకు దక్కాయి. అవార్డులు దక్కిన వాటిలో.. కొత్త సచివాలయం, యాదాద్రి పుణ్యక్షేత్రం, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, దుర్గం చెరువు, మొజంజాహీ మార్కెట్‌ నిర్మాణాలకు ఈ అవార్డులు వరించాయి. అయితే.. గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు భారతదేశానికి దక్కటం ఇదే తొలిసారి అని గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ తెలిపింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు