స్టార్టప్ ఎలక్ట్రిక్ మొబిలిటి సొల్యూషన్స్ ప్రొవైడర్ మొబెక్ ఇన్నోవేషన్స్.. విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్ సదుపాయ సేవలను వినియోగదారుల ఇండ్ల వద్దనే అందించనున్నది. తొలుత ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని వినియోగదారులకు ఈ సేవల్ని అందుబాటులోకి తెస్తామన్న సంస్థ.. వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి హైదరాబాద్‌సహా ఇతర నగరాలకు విస్తరిస్తామని తెలిపింది. ఫాస్ట్ చార్జ్ టెక్నాలజీ కలిగిన తమ మొబైల్ చార్జింగ్ వ్యాన్లు.. తక్కువ సమయంలోనే ఈవీని 80 శాతం వరకు చార్జింగ్ చేయగలవని మొబెక్ ఇన్నోవేషన్స్ వ్యవస్థాపక సీఈవో హ్యారీ బజాజ్ తెలిపారు