సాధారణంగా పెంపుడు కుక్కల కోసం ఇంటి ఆవరణలో చిన్నపాటి డాగ్ హౌస్ ఏర్పాటు చేయడం చూస్తుంటాం. అయితే ఓ వ్యక్తి మాత్రం తన పెంపుడు శునకం కోసం రూ.లక్షలు పెట్టి లగ్జరీ ఇంటిని నిర్మించాడు. అమెరికా కాలిఫోర్నియాకు చెందిన 25 ఏళ్ల బ్రెంట్ రివెరా ఓ యూట్యూబర్. ఆ యువకుడు చార్లీ అనే కుక్కను పెంచుకుంటున్నాడు. చార్లీ అంటే అతడికి చాలా ఇష్టం. దాని మొదటి పుట్టినరోజున ఏదైనా మంచి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. ఇందులో భాగంగానే 20 వేల డాలర్లు ఖర్చు పెట్టి లగ్జరీ హౌస్ ను నిర్మించాడు. ఇండియన్ కరెన్సీలో రూ.16.5 లక్షలన్నమాట.
ఈ ఖరీదైన లగ్జరీ హౌస్‌లో చార్లీ కోసం ప్రత్యేకమైన బెడ్, కుర్చీ లు, సోఫాలు, మినీ ఫ్రిడ్జ్, టీవీ వంటివి ఏర్పాటు చేశాడు. ఆ హౌస్‌ను చార్లీ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీన్నంతా వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. చార్లీ కోసం యువకుడు నిర్మించిన ఆ ఖరీదైన లగ్జరీ డాగ్ హౌస్‌ను మీరూ చూసేయండి.