Tuesday, May 14, 2024

హీరో రాజశేఖర్‌ దంపతులకు ఏడాది జైలు..

తప్పక చదవండి
  • చిరు బ్లడ్‌ బ్యాంక్‌ పరువు నష్టం కేసు వ్యవహారం..
  • ఫ్రీగా రక్తం తెచ్చుకుంటూ అమ్ముకుంటున్నారని తీవ్ర ఆరోపణలు..
  • వీరిద్దరిపై కేసు వేసిన నిర్మాత అల్లు అరవింద్..
  • 2011 లో జరిగిన వ్యవహారానికి ఇప్పుడు కోర్టు తీర్పు..

పరువు నష్టం కేసులో, ప్రముఖ టాలీవుడ్‌ దంపతులు జీవిత ఆమె భర్త రాజశేఖర్‌ లకు నాంపల్లి లోని, 17వ అదనపు చీఫ్‌ మెట్రో పోలిటన్‌ మేజిస్టేట్ర్‌ ఒక ఏడాది జైలు శిక్ష, అయిదు వేల రూపాయలు జరిమానా విధించింది. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ పై గతంలో రాజశేఖర్‌ దంపతులు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఫ్రీ గా రక్తం తెచ్చుకుంటూ, మార్కెట్‌ లో అమ్ముకుంటున్నారని అప్పట్లో రాజశేఖర్‌ దంపతులు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ విూద వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ జరిగింది 2011 సంవత్సరంలో. ఇటువంటి ఆరోపణలు చెయ్యగానే అప్పట్లో వెంటనే ప్రముఖ నిర్మాత, చిరంజీవి బావమరిది అయిన అల్లు అరవింద్‌ వెంటనే వీరిద్దరిపై పరువునష్టం దావా వెయ్యటం జరిగింది. చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ చేస్తున్న మంచి పనుల విూద వీరిద్దరూ చేసిన ఆరోపణలు అవాస్తవమని అప్పట్లో అల్లు అరవింద్‌ కోర్టులో పరువు నష్టం దావా వేయటం జరిగింది. అప్పటి నుండి ఆ కేసు సాగుతూ నాంపల్లి కోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది. వీరిద్దరికీ ఏడాది పాటు జైలు శిక్ష, 5,000 రూపాయలు జరిమానా విధించటం జరిగింది. దంపతులు వెంటనే జరిమానా చెల్లించటంతో వీరికి జిల్లా కోర్టులో వెంటనే బెయిల్‌ మంజూరు అయినట్టుగా తెలిసింది. అలాగే వీరు పై కోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకోవచ్చని కూడా చెప్పింది

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు