Thursday, April 25, 2024

ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్..

తప్పక చదవండి

వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మందుస్తు బెయిల్ మంజూరు అయింది. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. వివేకా హ‌త్య కేసులో సీబీఐ త‌న‌ను అరెస్టు చేయొద్ద‌ని కోరుతూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. అరెస్టు చేసిన‌ట్లు అయితే రూ. 5 ల‌క్ష‌ల పూచీక‌త్తుతో బెయిల్‌పై విడుద‌ల‌కు సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ అనుమ‌తి లేకుండా దేశం విడిచి వెళ్ల‌రాద‌ని అవినాష్‌కు ష‌ర‌తు విధించింది కోర్టు. సాక్షుల‌ను ప్ర‌భావితం చేయొద్ద‌ని ఆదేశించింది. సీబీఐ ద‌ర్యాప్తున‌కు స‌హ‌క‌రించాల‌ని ఆదేశించింది. జూన్ నెలాఖ‌రు వ‌ర‌కు ప్ర‌తి శ‌నివారం ఉద‌యం 10 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు సీబీఐ ఎదుట హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. సీబీఐకి అవ‌స‌ర‌మైన‌ప్పుడు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది.

వైఎస్ వివేకా హ‌త్య కేసులో సీబీఐ విచార‌ణ నేప‌థ్యంలో త‌న‌కు ముంద‌స్తు బెయిల్ కావాలంటూ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై ఈ నెల 27న వాద‌న‌లు ముగించిన హైకోర్టు.. ఇవాళ తీర్పు వెల్ల‌డించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు