Tuesday, May 28, 2024

మాల జేఏసీ వర్కింగ్ చైర్మన్‌గా డా.మంచాల లింగస్వామి..

తప్పక చదవండి

ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడు, ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ (అంసా) వ్యవస్థాపకుల్లో ఒకడిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గత పదేళ్లుగా పని చేస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం జనగాం గ్రామానికి చెందిన డాక్టర్ మంచాల లింగస్వామి మాల జేఏసీ వర్కింగ్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లో వివిధ మాల సంఘాలు పాల్గొన్న సమావేశంలో మాల సంఘాల జేఏసీ చైర్మన్ జి.చెన్నయ్య డాక్టర్ మంచాల లింగస్వామిని వర్కింగ్ చైర్మన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.

అనంతరం డాక్టర్ మంచాల లింగస్వామి మీడియాతో మాట్లాడుతూ “అణగారిన వర్గాల హక్కుల కోసం గొంతెత్తి నినదించి అణిచివేతలకు, అసమానతలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన మాలలు నేడు తమ స్వంత కులం ప్రయోజనాల కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలకు ఊపిరి పోసిన మాలలు పోరాటాలకు దూరమవడంతో పాలక పక్షాలు మాలల్ని విస్మరిస్తున్నాయి. దళిత బంధు పథకంలో మాలలకు తీవ్ర అన్యాయం జరిగింది. దళిత బంధు రెండవ విడత మాలలకు 50 శాతం కేటాయించాలి. మాలలు రాజకీయాల్ని శాసించే శక్తిగా ఎదగాలి. మాలల అస్థిత్వం, ఆత్మగౌరవం, హక్కులు, అవకాశాల కోసం కోసం సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో అభ్యున్నతి కోసం నా వంతు కృషి చేస్తానని” అన్నారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు