Tuesday, April 23, 2024

జపాన్‌లో భారీ భూకంపం..

తప్పక చదవండి

జపాన్‌లో ఇవాళ మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.1 గా నమోదైంది. జపాన్‌ రాజధాని టోక్యోకు ఆగ్నేయం వైపున 107 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం చోటుచేసుకుందని ఆ దేశానికి చెందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ వెల్లడించింది. భూకంపం ధాటికి భూ ఉపరితలం నుంచి 65 కిలోమీటర్ల లోతువరకు ప్రకంపనలు చోటుచేసుకున్నాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ తెలిపింది. సరిగ్గా ఇవాళ మధ్యాహ్నం 3.33 గంటలకు ఈ భూకంపం సంభవించిందని పేర్కొంది. అయితే, ఈ భూకంపంవల్ల ఏదైనా ఆస్తినష్టం గానీ, ప్రాణ నష్టంగానీ జరిగిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు