Monday, April 29, 2024

అరుణ్ పిళ్ళై ఎమ్మెల్సీ కవిత ప్రతినిధి..

తప్పక చదవండి

  • స్వయంగా ఒప్పుకున్న అరుణ్ పిళ్ళై..
  • రోస్ ఎవెన్యూ కోర్టుకు తెలిపిన ఈడీ తరఫు న్యాయవాది..
  • అరుణ్ బెయిల్ పిటిషన్ పై మంగళవారం విచారణ..
  • జూన్ 2 కు తదుపరి విచారణ వాయిదా..

న్యూ ఢిల్లీ, 30 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే కవితకు ప్రతినిధిగా ఉన్నారని, ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకొన్నారని ఈడీ తరఫు న్యాయవాది రౌస్ ఎవెన్యూ కోర్టుకు విన్నవించారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన అరుణ్ పిళ్లయ్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. అరుణ్ పిళ్లయ్ స్టేట్ మెంట్ ఆధారంగానే కవితను విచారించామని కోర్టుకు విన్నవించారు.

- Advertisement -

లిక్కర్ లో వచ్చిన లాభాలతో ప్రాపర్టీస్ కొనుగోలు చేశారని తెలిపారు. లిక్కర్ వ్యాపారానికి సంబంధించి ఎమ్మెల్సీ కవితతో సమావేశాలు జరిగాయని, ఫీనిక్స్ శ్రీహరితో కలిసి కవిత భర్త అనిల్, బుచ్చిబాబు హైదరాబాద్ లో ఆస్తులు కొనుగోలు చేశారని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. అందుకే లిక్కర్ కేసులో కవిత పాత్రపై నోలీసులు ఇచ్చి విచారణ జరిపామన్నారు. తమ వాదనలు వినేందుకు సమయం ఇవ్వాలంటూ పిళ్లయ్ తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. దీనికి స్పందించిన జడ్జి నాగ్ పాల్ రొటీన్ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. లిఖిత పూర్వకంగా వాదనలు అందించాలని సూచించింది. తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు