Tuesday, July 16, 2024

అనుమతులు లేకుండానే…అడ్డగోలుగా అడ్మిషన్లు…

Sri Vashishta and Agastya educational institutes illegal bagotam.

తప్పక చదవండి
 • శ్రీ వశిష్ట , అగస్త్య విద్యాసంస్థల అక్రమ బాగోతం.
 • గుర్తింపు రాకుండానే ప్రవేశాల ప్రక్రియ..
 • బ్రోచర్ పైన జూనియర్ కళాశాలుగా..
 • గోడలపైన అకాడమీల పేరుతో హంగామా..
 • జూనియర్ కళాశాలలుగా చలామణి అవుతున్న సంస్థలు..
 • అంటి ముట్టనట్టు ఉంటున్న ఇంటర్ అధికారులు..
 • ఉక్కిరి బిక్కిరి అవుతున్న తల్లిదండ్రులు..
 • విజిలెన్స్ దాడులు నిర్వహించాలి : మాసారం ప్రేమ్ కుమార్..

విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఇంటర్మీడియేట్ అన్నది ఎంతో ముఖ్యమైన మజిలీ.. ఈ మజిలీ దగ్గరే విద్యార్థుల ఉన్నతమైన భవిష్యత్తు నిర్మితం అవుతుంది.. ఇక్కడి నుంచే విద్యార్థుల భవిష్యత్ విద్యా ప్రణాళిక మొదలవుతుంది.. ఉన్నతమైన డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, ప్రొఫెషనల్స్ గా మారడానికి ఇంటర్మీడియేట్ విద్య ప్రామాణికంగా మారుతుంది.. ఇంటర్ ను బేస్ చేసుకునే ఎన్నెన్నో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహణ జరుగుతుంది.. ఏ విద్యార్థి అయినా ఈ మజిలీలో పొరబాటు చేస్తే భవిష్యత్తు అంధకారం అవుతుంది.. ఇంటెర్మీడియేట్ గా మారాలన్న, ఇంటర్ ఈడియేట్ గా మారాలన్న ఇక్కడే పునాది పడుతుంది.. అంతటి ప్రాముఖ్యత కల్గిన ఇంటర్ విద్యను కొందరు ముష్కరులు వ్యాపారంగా మార్చివేస్తూ.. స్వలాభం కోసం లక్షలు గడిస్తూ.. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు.. కొందరు ఇంటర్మీడియెట్ విద్యా సంస్థల యాజమాన్యం వారు చేస్తున్న దుర్మార్గపు పనులతో భావిభారత పౌరుల భవితవ్యాన్ని అంధకార బంధురం చేస్తున్నారు.. అలాంటి కోవకే చెందుతాయి రంగారెడ్డి జిల్లాలోని వశిష్ట, అగస్త్య జూనియర్ కళాశాలలు.. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్, 12 మే (ఆదాబ్ హైదరాబాద్) : నగరంలో కొన్ని ప్రైవేటు కళాశాలలు ప్రభుత్వం నుంచి గానీ, ఇంటర్ బోర్డు నుంచి గానీ అడ్మిషన్ల ప్రక్రియ గురించి ఎలాంటి ప్రకటన చేయక ముందే విచ్చలవిడిగా ప్రవేశ ప్రక్రియను నిర్వహిస్తున్నాయి. ఇక మరి కొన్ని కళాశాలలు 2023 -24 విద్య సంవత్సరానికి గుర్తింపు రాకుండానే నీట్, ఐఐటి, ఎంసెట్ ల పేర్లతో లక్షల రూపాయలను వసూలు చేస్తూ.. అడ్మిషన్లను ఇస్తున్నారు.

- Advertisement -

రంగారెడ్డి జిల్లాలోని శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల పేరుతో ఇంటర్ బోర్డు అనుమతి పొందకుండానే.. వనస్థలిపురం, దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్ బ్రాంచ్ లలో ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసింది. ఇదే జిల్లాలోని మరొక విద్యాసంస్థ అగస్త్య జూనియర్ కళాశాలగా వనస్థలిపురంలో అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయడం శోచనీయం.. కాగా రాబోవుకాలంలో ఈ రెండు కళాశాలలకు ఇంటర్ బోర్డు నుంచి గుర్తింపు రాకపోతే.. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనడంలో సందేహం లేదు.. ఈ రెండు సంస్థలు, తమ సంస్థ విడుదల చేసినటువంటి బ్రోచర్లలో అద్భుతంగా జూనియర్ కళాశాలలుగా ముద్రించుకొని విద్యార్థులను, వారి తల్లి దండ్రులను దారుణంగా మోసం చేస్తున్నారు.

ఒకసారి ఇంటర్ బోర్డు నిబంధనలు పరిశీలిద్దాం :

 • ఇంటర్ బోర్డు అకాడమిక్ క్యాలెండర్ నిబంధనల ప్రకారం.. అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల కాక ముందే ముందస్తు అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించకూడదు.
 • నిబంధనలు ఉల్లంగిస్తే రూల్ నెంబర్ 14(6) 7 ప్రకారం లక్ష రూపాయల జరిమానా కూడా విధిస్తారు..
 • గుర్తింపు రాకుండానే జూనియర్ కళాశాలగా పేరును ఎక్కడా ప్రచారం చేయకూడదు.. చేసుకోకూడదు..

ఈ నిబంధనలను గాలికి వదిలేసి, విద్యార్థుల బంగారు భవిష్యత్తుతో వికృత క్రీడలాడుతున్న శ్రీ వశిష్ట జూనియర్ కాలేజీ, అగస్త్య జూనియర్ కళాశాలల వ్యవహారంపై దృష్టిసారించి, పిల్లల భవిష్యత్తును కాపాడాలని, కళాశాలల యాజమాన్యాలను కఠినంగా శిక్షించాలని మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు