హైదరాబాద్, 11 మే (ఆదాబ్ హైదరాబాద్) : కుత్బుల్లాపూర్ మండలం రెవిన్యూ ఇన్ స్పెక్టర్ (ఆర్ఐ) పరమేశ్వర్ రెడ్డిని.. మేడ్చల్ జిల్లా కలెక్టర్ గురువారం సస్పెండ్ చేశారు. కుత్బుల్లాపూర్ మండలంలోని ప్రభుత్వ భూముల రక్షణలో విఫలం అయ్యారనే కారణంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్.. ఆర్ఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలుస్తోంది. కుత్బుల్లాపూర్ మండలం ఆర్ఐ సస్పెండ్ కావడంతో.. రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే అధికారులకు, సిబ్బందికి వణుకు మొదలైంది. రెవిన్యూ ఇన్ స్పెక్టర్ (ఆర్ఐ) పరమేశ్వ ర్ రెడ్డి వ్యవహారంతో.. గాజుల రామారం భూ కబ్జాదారుల్లో భయం మొదలయిందని సమాచారం. సస్పెండ్ ఒక్కరితో ఆగుతుందా..? మరికొన్ని సస్పెండ్ లు ఉంటాయా..? అన్నది మరి కొన్ని రోజులు వేచి చూడాలని ఓ అధికారి చెప్పడం కోసం మెరుపు.. కలెక్టర్ అమోయ్ కుమార్ అవినీతి పరులైన అధికారిపై సస్పెండ్ వేటు వేయడంతో స్థానికులు ఆయనకు ప్రశంసలు కురిపిస్తున్నారు..
కుత్బుల్లాపూర్ మండల ఆర్ఐ పరమేశ్వర్ రెడ్డి సస్పెండ్
quthbullapur mandal RI Parameshwar Reddy suspended