Monday, July 22, 2024

అసంపూర్తి పనులతో ప్రజలకు అవస్థలు

తప్పక చదవండి

జల్‌పల్లి: జల్‌పల్లి పురపాలక సంఘంలోని పలు వార్డులలో డ్రైనేజి సమస్య పెద్ద సవాలుగా మారింది. మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం కొరకు స్థానిక ఎమ్మేల్యే విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌.ఎం.డి.ఎ) ద్వారా రూ. 22 కోట్ల 40 లక్షల నిధులు మంజూరు చేసినప్పటికీ జల్‌పల్లి మున్సిపాలిటీలోని కొన్ని వార్డులలో ఇప్పటి వరకు అంతర్గత డ్రైనేజి పనులు పూర్తీ కాకపోవడంతో పాటు నిధులు విడుదలై ప్రారంభించిన పనులు పలుచోట్ల అసంపూర్తిగ నిలిచిపోయాయి. దీనికి ఉదాహరణ 10వ వార్డు వాదే సాలెహిన్‌ బస్తిలోని జంఢా ఎదురుగా ఉన్న గల్లీలో అంతర్గత డ్రైనేజి నిర్మాణం కోసం తవ్విన గుంతల వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బంది ఎదురుకొంటున్నారు. సుమారు నెల రోజుల క్రితం ప్రారంభించిన డ్రైనేజి నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దింతో సుమారు 30 ఇండ్ల వరకు ఉన్న రోడ్డుపై వృదులు, మహిళలు, చిన్నారులు నడవలేక అవస్థలు పడుతున్నారు. వాహననాలు తిరగలేని పరిష్టితి నెలకొంది. అసంపూర్తిగ నిలిచిపోయిన పనులను వెంటనే ప్రారంభించి త్వరగా పూర్తీ అయ్యేలా చర్యలు చేపట్టాలని 10వ వార్డు కౌన్సిలర్‌, జల్‌పల్లి పురపాలక కమిషనర్‌ కు స్థానిక ప్రజాప్రతినిధులకు బస్తీవాసులు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు