Monday, July 22, 2024

రాజభోగాలు మీకు.. కడుపు మంటలు నిరుద్యోగులకా.. ?

KCR government was there for 5 months..

తప్పక చదవండి
  • ఉద్యమ సమయంలో తిండికి లేని మీకు వేల కోట్లు ఎట్లా వచ్చాయి..?
  • బీఆర్ఎస్ పేరుతో తెలంగాణ నుండి పారిపోయిన పిరికిపంద కేసీఆర్
  • కేసీఆర్ కొడుకు రోజుకో శాఖకు మంత్రిగా అవతారమెత్తుతున్నడు
  • జేపీఎస్ లను కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగించేందుకు కేసీఆర్ కుట్ర
  • కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా వదిలిపెట్టేది లేదు.
  • కేసీఆర్ సర్కార్ ఉండేది మరో 5 నెలలే..
  • కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగిన బండి సంజయ్ కుమార్..

హైదరాబాద్, 11 మే (ఆదాబ్ హైదరాబాద్) : 14 వందల మంది యువకుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో రాజభోగాలు మీకు….కడుపు మంటలు, కడుపు కోతలు నిరుద్యోగుల కుటుంబాలకా? తెలంగాణ ఉద్యమ సమయంలో తిండికి లేక ముతక చొక్కాలేసుకుని తిరిగిన మీ కుటుంబానికి వేల కోట్లు ఎట్లా వచ్చినయ్. నీ దుర్మార్గపు పాలనలో తెలంగాణ ప్రజలు బిచ్చగాళ్లెట్లా అయ్యారు.. ’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనేందుకు గురువారం రోజు సంగారెడ్డి పట్టణానికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్ కు బీజేపీ నేతలు అపూర్వ స్వాగతం పలికారు. తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన బండి సంజయ్ కుమార్ నిరుద్యోగ మార్చ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలాది మంది నిరుద్యోగులు, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చి బండి సంజయ్ తో కలిసి ఐబీ గెస్ట్ హౌజ్ నుండి పోతిరెడ్డిపల్లె చౌరస్తా వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్లు నడిచారు. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు.

ఇది కేసీఆర్ జిల్లా అట కదా… కేసీఆర్ అల్లుడి జిల్లా అట కదా… అగ్గిపెట్టె మంత్రి పేరు అబద్దాల మంత్రి. ఆయనకు తెలంగాణ ఉద్యమంలో ఎందుకు అగ్గిపెట్టె దొరలేదో ఇంతవరకు సమాధానం లేదు.. ఈ జిల్లాకు ఒక్క కొత్త ఫ్యాక్టరీ అయినా వచ్చిందా? హామీలిచ్చిన నేతలంతా ఎటుపోయారు? తెలంగాణలో కేసీఆర్ నియంత పాలనను తరిమికొట్టి రామరాజ్యం స్థాపించేందుకే బీజేపీ మిలియన్ మార్చ్ నిర్వహిస్తొంది. నిరుద్యోగులను మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే. కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా వదిలిపెట్టేది లేదు. నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం అందించేదాకా పోరాడతాం. కేసీఆర్ ప్రభుత్వం ఉండేది 5 నెలలే… ఆ తరువాత అధికారంలోకి వచ్చేది బీజేపీయే. అధికారంలోకి రాగానే బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తాం. కేసీఆర్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. ఉద్యోగులకు జీతాలివ్వకుండా, 317 జీవో పేరుతో చెట్టుకొకరిని పుట్టకొకరిని చేసి అరిగోస పెట్టిండు… రుణమాఫీ ఇవ్వకుండా, ఫ్రీ యూరియా ఇవ్వకుండా పంట నష్టపోయినా పరిహారం ఇవ్వకుండా రైతుల ఉసురు పోసుకుంటున్నడు. రక్షణ లేక మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ కు పుట్టగతుల్లేవని తెలిసి బీఆర్ఎస్ పేరుతో తెలంగాణ నుండి పారిపోయిన పిరికిపంద కేసీఆర్.. ఇక్కడ టీఆర్ఎస్ గెలిచేదుంటే బీఆర్ఎస్ ఎందుకు పెడతడు? బీఆర్ఎస్ పాలనలో రాజభోగాలు కేసీఆర్ కుటుంబానికా? కడుపు మంటలు నిరుద్యోగులకా? అమెరికాలో చిప్పలు కడిగిన కేసీఆర్ కొడుకు అహంకారంతో మదమెక్కి ప్రధానిపై విమర్శలు చేస్తున్నడు. తెలంగాణ రాకముందు తిండికి లేక ముడతలు పడ్డ షర్ట్ వేసుకుని మొక్క జొన్న కంకులు తింటూ బతికిన కేసీఆర్ కుటుంబం ఇయాళ వేల కోట్లు దోచుకుతిన్నడు.
చీమల పుట్టలో పాములు చొరపడ్డట్లు తెలంగాణ ఉద్యమ కారుల త్యాగాల పునాదులపై కేసీఆర్ కుటుంబం అధికారంలోకి వచ్చింది. నరేంద్రమోదీ ప్రభుత్వం 10 లక్షలు ఉద్యోగాలివ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే 2 లక్షలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసింది. కేంద్రం నిర్వహించే ఏ పరీక్షలోనూ తప్పిదాల్లేకుండా క్రమం తప్పకుండా భర్తీ చేస్తుంటే రాష్ట్రంలో మాత్రం ఉద్యోగాలను నింపడం లేదు. పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. అందుకే నిరుద్యోగులకు భరోసా ఇచ్చేందుకు, కేసీఆర్ గడీలు బద్దలు కొట్టేందుకు నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నాం. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నిరుద్యోగ మార్చ్ తో గండ్రించారు. ఈ మధ్య కేసీఆర్ రోజూ సచివాలయానికి వస్తున్నడు. అందుకే కాలం కాని కాలంలో వర్షాలు పడుతున్నయు. కొత్త సచివాలయం ఎట్లుందో చూశారా? ఒక్కసారి చూడండి మీకే తెలుస్తుంది. సంగారెడ్డి కాషాయ అడ్డా… 5 నెలల్లో ఎన్నికలు రాబోతున్నయ్. నిరుద్యోగులారా… ప్రజలారా మాతో కలిసి రండి. బీజేపీకి సమయమివ్వండి. ఇప్పుడే పంచాయతీ సెక్రటరీలు కలిసి వాళ్ల బాధ చెప్పుకున్నరు. పోటీ పరీక్షలు రాసి అర్హత సాధించి ఉద్యోగాలు సాధించి నాలుగేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి చేసినా రెగ్యులరైజ్ చేయకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మార్చే కుట్ర చేస్తున్నడు.

- Advertisement -

నేను పంచాయతీ ఉద్యోగులకు చెబుతున్నా… మీరు ఉద్యమం ఆపకండి. మిమ్ముల్ని తొలగించినా భయపడకండి. మేమున్నా. మరో 5 నెలల్లోల బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. మేం అధికారంలోకి రాగానే మిమ్ముల్ని ఉద్యోగంలోకి తీసుకుని రెగ్యులరైజ్ చేసి పే స్కేలు అమలు చేస్తాం…. ప్రభుత్వం బెదిరించినా అదరకుండా సమ్మె చేస్తున్న మీ అందరికీ హ్యాట్సాఫ్ చెబుతున్నా.. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులంతా కలిసి సకల జనుల సమ్మె చేస్తేనే తెలంగాణ వచ్చిందనే సోయి కేసీఆర్ కు లేదు. ఇయాళ ఆ ఉద్యోగులందరినీ వేధిస్తున్నారు. సీఎం కొడుకు రోజుకో మంత్రి అవతారమెత్తుతున్నడు. ఒకరోజు హోంమంత్రి.. మరొకరోజు ఫైనాన్స్.. ఇంకో రోజు హెల్త్ మినిస్టర్ అవుతున్నడు. ఆదివారం మందు, డ్రగ్స్ తాగి ఇంట్లో పడుకుంటున్నడు. అన్ని శాఖల మంత్రులు ఎంత దోచుకున్నారో తెలుసుకుని… అవన్నీ తానే దోచుకోవాలని కేసీఆర్ కొడుకు ఇదంతా చేస్తున్నడు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ కూడా ఇవ్వని దుర్మార్గులు బీఆర్ఎస్ నేతలు… ఈ జిల్లాకు చెందిన అగ్గిపెట్టె మంత్రి బీజేపీ అధికారంలోకి వస్తే ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వరని చెబుతున్నడట. నేను చెబుతున్నా… బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులన్ని చెల్లిస్తాం. ఇకపై ప్రతి ఏటా ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులను చెల్లిస్తాం…

తెలంగాణ ప్రజలారా… అన్ని పార్టీలకు అవకాశమిచ్చారు. ఈసారి బీజేపీకి పాలించే అవకాశమివ్వండి. పొరపాటున కేసీఆర్ అధికారంలోకి వస్తే మరో 5 లక్షల కోట్ల అప్పు చేస్తారు. కేసీఆర్ ఎన్నడూ అభివ్రుద్ధి గురించి మాట్లాడరు. తెలంగాణలో జరిగే అభివ్రుద్ధి, సంక్షేమానికి నిధులిస్తోంది కేంద్రమే. అయినా కేంద్రంపై బురద చల్లి తెలంగాణ సెంటిమెంట్ రగిలించి అధికారంలోకి రావాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నడు. ఉమ్మడి మెదక్ జిల్లా పవర్ ఫుల్ జిల్లా…. తెలంగాణ కోసం ఇషాంత్ రెడ్డి బలిదానమైన గడ్డ ఇది…. దురద్రుష్టమేమిటంటే.. తెలంగాణ వచ్చినంక కూడా ఏమీ మారలే. కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు రావనే బాధతో ఉస్మానియా వర్శిటీలో ఉరేసుకుని చనిపోయిన మురళీ ముదిరాజ్ ఈ జిల్లాలోని గజ్వేల్ కు చెందిన వ్యక్తే.. కేసీఆర్ కుటుంబం వేల కోట్లు సంపాదిస్తే…. తెలంగాణ ప్రజలు మాత్రం బికారీలుగా మారిపోతున్నరు. అందుకే బీజేపీ 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం, పేదల కోసం మీ ముందుకొస్తోంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టిగ్ జడ్జితో విచారణ జరిపించేదాకా, కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా, నిరుద్యోగులకు పరిహారం ఇచ్చేదాకా ఉద్యమిస్తాం… అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తాం. వచ్చే నెలలో హైదరాబాద్ లో లక్షలాది మందితో నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహించి తీరుతాం… మా సమస్యలు కేసీఆర్ పట్టించుకోవడం లేదంటూ ఆర్టీసీ ఉద్యోగులు మొరపెట్టుకోవడంతో….ఆర్టీసీని కేసీఆర్ అమ్మేస్తాడు.. కార్మికులను పట్టించుకోడు. సమస్యలు చెబితే బెదిరిస్తున్నడు. సింగరేణి, ఆర్టీసీ, వీఆర్వో, వీఆర్ఏ, వీఏవో, పంచాయతీ కార్యదర్శులందరికీ బీజేపీ అండగా ఉంటుంది. భయపడే ప్రసక్తే లేదు. తెలంగాణలో రాబోయేది రామరాజ్యమే. తెలంగాణ గడ్డపై కాషాయ జెండా తప్ప రంగు రంగుల పార్టీలకు చోటు లేదు. ఈనెల 14న హనుమాన్ జయంతి. కుహానా లౌకిక పార్టీలు హిందువులను హేళన చేస్తున్నారు. హిందూ శక్తిని చాటేందుకు రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ లో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ నిర్వహించబోతున్నాం.. రాష్ట్రంలోని హిందువులంతా హిందూ ఏక్తా యాత్రకు హాజరై గర్జించాలని కోరుతున్నా అన్నారు బండి సంజయ్..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు