Thursday, April 25, 2024

విద్యా ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం..

తప్పక చదవండి

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పేద వర్గాలకు విద్యని దూరంచేసే ప్రయాత్నాలను ముమ్మరంగా చేస్తుందని అందులో భాగంగానే నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చిందని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. శుక్రవారం రోజున భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) అధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విద్యా, ఉపాధి, పర్యావరణం అంశంపై రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ అధ్యక్షతన సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సెమినార్ కి ముఖ్య అతిధిగా హజరైన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తూ పేద విద్యార్థులకు విద్యను దూరం చేసేందుకు అనేక మార్పులు చేస్తూ నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చిందన్నారు‌. పాఠ్య పుస్తకాలలో సైన్స్ పాఠాలు లేకుండా చేస్తుందన్నారు. భవిష్యత్ తరాలకు స్వాతంత్ర్య ఉద్యమ నాయకుల పోరాట చరిత్ర తెలియకుండా పాఠ్యపుస్తకాల నుండి తొలగిస్తుందన్నారు‌. కులం పేర, మతం పేర విద్వేషాలు రెచ్చగోడుతుందన్నారు. అదే విధంగా దేశ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం దేశ జనాభాని నిరుద్యోగ సమస్యగా చూపెడుతూ మోడీ సర్కార్ తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తుందన్నారు‌. దేశంలో రోజురోజుకు నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్న ప్రభుత్వాలు పట్టించుకోకుండా యువతని పూర్తిగా విస్మరిస్తున్నారని అన్నారు‌. అందరికీ విద్య, ఉపాధికై డివైఎఫ్ఐ అధ్వర్యంలో పోరాటాలు నిర్వహించాలన్నారు.

డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం యురేనియం నిక్షేపాల తవ్వకాల పేరుతో పచ్చని నల్లమల అడవులను ధ్వంసం చేసేందుకు పూనుకుందన్నారు. పర్యావరణపరిరక్షణకు డివైఎఫ్ఐ అధ్వర్యంలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. మే 27, 28 తేదిల్లో రెండు రోజుల పాటు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డివైఎఫ్ఐ కేంద్ర కమిటి సమావేశాలు నిర్వహిస్తున్నామని ఈ సమావేశాల్లో దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి భవిష్యత్ పోరాట కార్యాచరణని రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జావెద్, బషీరుద్దీన్, తిరుపతి, పఠాన్ రోషనిన్ ఖాన్, తిరుపతి నాయక్, సహయ కార్యదర్శులు క్రిష్ణానాయక్, జగన్, కిరణ్, మహేష్, నాయకులు అశోక్ రెడ్డి, లెనిన్, శృతి, మౌనిక, శ్రీకాంత్, సాగర్, రమేష్, స్వాతి, నరేష్ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు