- బదిలీలు లేకపోవడంతో హవా చెలాయిస్తున్న చైన్ మెన్లు..
- చూసీ చూడనట్లు వదిలేస్తున్న ఉన్నతాధికారులు..
- జీ.హెచ్.ఎం.సి. ఖజానాకు భారీ గండి..
- ఉన్నతాధికారులు చొరవ చూపకపోతే అంతే సంగతులు..
- కాప్రా, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
- కాప్రా సర్కిల్ అక్రమ నిర్మాణాలకు ఆలవాలంగా మారింది.. ఉన్నతాధికారులు దృష్టి పెట్టకుండా.. చూసీ చూడనట్లు వదిలేస్తుండటంతో ఇక్కడి చైన్ మెన్లు తమ హవాను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.. కాప్రా సర్కిల్ పరిధి నాగార్జున నగర్ కాలనీ మెయిన్ రోడ్డులో అక్రమ నిర్మాణాలు ఇబ్బడి ముబ్బడిగా కొనసాగుతున్నాయి.. వీరికి అండగా జిహెచ్‌ఎంసి అధికారులు తమవంతు పాత్రను పోషిస్తున్నారు.. ఇక్కడ మెయిన్ రోడ్డులో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణానికి, ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న నిర్మాణాలను కూల్చవలసింది పోయి చోద్యం చూస్తున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు. టౌన్ ప్లానింగ్ విభాగంలో చైన్ మెన్లు అధికారుల కన్ను కప్పి సొమ్ము చేసుకుంటున్నారు.. కాప్రా టౌన్ ప్లానింగ్ విభాగంలో చైన్ మెన్లు ముఖ్య పాత్ర పోషిస్తూ జిహెచ్‌ఎంసి ఖజానాకు గండి కొడుతున్నారు. చైన్ మెన్లు బదిలీలు లేకుండా ఇక్కడే తిష్ట వేసి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. అధికారుల కన్ను కప్పి భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చూపి, జిహెచ్‌ఎంసి టౌన్ ప్లానింగ్ విభాగంలో బదిలీలు చేసి, జిహెచ్‌ఎంసి ఖజానాకు గండి పడకుండా చూసుకోవాలని నాయకులు, ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు..
తప్పక చదవండి
- Advertisement -