Friday, April 19, 2024

ఐకేపీ వీవోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి

తప్పక చదవండి
  • ఐకేపీ వీవోఏ(సీఐటీయు) ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి.
  • చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సిబ్బందికి వినతిపత్రం..
  • వివరాలు తెలిపిన దాసరి రాజేశ్వరి సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు, కుంటాల కుమార్ ఐకేపీ వీవోఏ జిల్లా అధ్యక్షులు

హైదరాబాద్, 12 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : తెలంగాణ ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో.. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చెన్నూరు బస్టాండ్ నుండి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వరకు ర్యాలీ అనంతరం ఏమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడి, క్యాంపు సిబ్బందికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా కుంటాల కుమార్ ఐకేపీ వీవోఏ జిల్లా అధ్యక్షులు (సీఐటియు ) మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐకేపీ వీవోఏల సమస్యలు పరిష్కరం అవుతాయి అనుకుంటే.. గ్రేడింగ్ విధానంతో పని భారం మోపుతూ.. ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ రోజు గ్రామాల్లో మహిళలందరిని ముందుకు నడిపించడం, వారికి బ్యాంకుల నుండి అప్పులు, లోన్లు ఇప్పించి వారికి స్వయం ఉపాధి కల్పిస్తూ వారిని ఆర్థికంగా, సామజికంగా అభివృద్ధికి తొడ్పాడే వీవోఏలు అందరు నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబలకు చెందిన వారే ఉన్నారు. అందులో మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ విధానాలు విడనాడాలి.. ఐకేపీ వీవోఏలు గత 26 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వీవోఏలను పట్టించుకొకపోవడం చాలా దారుణం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలవాలి. వీవోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి. అర్హులైన వీవోఏలను సీసీలుగా ప్రమోట్ చేయాలని.. తదితర సమస్యలు పరిష్కరించే విదంగా, ప్రభుత్వం సమ్మె విరామింప చేయాలని.. లేని యెడల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం ఈ పోరాటం ద్వారా చెప్తామని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో రవి సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులు, మద్దతుగా బోడేంకి చందు మత్స కారుల సంఘం జిల్లా కార్యదర్శి, చెన్నూరు, కోటపల్లి, జైపూర్, భీమారం మండలాల ఐకేపీ వీవోఏ మండల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు