Thursday, April 25, 2024

గొల్ల కురుమలను అవమానిస్తే తాటతీస్తాం..

తప్పక చదవండి
  • రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకుంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం
  • హెచ్చరించిన పోచబోయిన శ్రీహరి యాదవ్, జెఎసి రాష్ట్ర చైర్మన్..

హైదరాబాద్ : గొల్ల, కురుమల వృత్తిని కించపరుస్తూ తమ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బేషరతుగా తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల రేవంత్ రెడ్డి గొల్ల, కురుమల వృత్తిని, యాదవుల ముద్దుబిడ్డ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను అవమానించే విధంగా వ్యాఖ్యానించారని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ యాదవ, కురుమ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చిన యాదవులు, కురుమలు ఇందిరాపార్క్ వద్దకు చేరుకొని దున్నపోతులు, సాంప్రదాయ డోలు చప్పుళ్ళ తో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేయడం జరిగింది. ఇప్పటికే అన్ని జిల్లాల లో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను దగ్ధం చేయడం, రాస్తారోకో లను నిర్వహించడం జరిగింది. ఈ నెల 25 వ తేదీ లోగా భేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే గాంధీ భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించడం జరిగింది. అందులో భాగంగా గురువారం రోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నా, నిరసన నిర్వహించడం జరిగింది. వెనుకబడిన వర్గాలకు చెందిన గొల్ల, కురుమలు, మంత్రిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్రకుల అహంకారానికి నిదర్శనం. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ కి చెందిన నాయకులు … టే కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ వ్యాఖ్యలను చేసినట్లుగా భావించాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి బేషరతుగా యాదవులు, కురుమలకు క్షమాపణలు చెప్పే వరకు తమ ఆందోళనలను కొనసాగిస్తాం. యాదవ కురుమ సంఘాల జేఏసీ చైర్మన్, పోచబోయిన శ్రీహరి యాదవ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాజారామ్ యాదవ్, బైకం శ్రీనివాస్ యాదవ్, మారం తిరుపతి యాదవ్, కడారి అంజయ్య యాదవ్, గోసుల శ్రీనివాస్ యాదవ్, అయోధ్య యాదవ్, గోవర్ధన్ యాదవ్, రమేష్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు