Friday, March 29, 2024

డెహ్రాడూన్‌ ఢిల్లీ మధ్య వందే భారత్‌

తప్పక చదవండి
  • వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ రాజధాని డెహ్రాడూన్‌ నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీతో కలుపుతున్న తొలి సెమీ`హై స్పీడ్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని నరేంద్ర మోడీగురువారం జెండా ఊపి ప్రారంభించారు. వివిధ మార్గాల నుంచి ఢల్లీిని కలుపుతున్న ఆరవ వందే భారత్‌ రైలు ఇది. ఇప్పటివరకు దేశ రాజధాని ఢిల్లీకి అజ్మీర్‌, వారణాసి, కత్రా, భోపాల్‌, అంబ్‌ అందౌరాల ప్రాంతాలను కలుపుతూ వందేభారత్‌ రైళ్లతో అనుసంధానించారు. కాగా ఉత్తరాఖండ్‌ మొదటి వందే భారత్‌ సెమీహైస్పీడ్‌ రైలు భారతదేశంలో 18వది.ఉత్తరాఖండ్‌ తొలి వందేభారత్‌ రైలు డెహ్రాడూన్‌ నుంచి ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ టెర్మినల్‌ వరకు మొదటి పరుగును ప్రారంభించింది. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు స్వదేశీయంగా తయారు చేయబడిరది. ఇందులో ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఉత్తరాఖండ్‌కు ప్రయాణించే పర్యాటకులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాల కొత్త శకాన్ని తెలియజేస్తాయి. కవాచ్‌ టెక్నాలజీతో సహా అధునాతన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ఈనెల 29 నుంచి ఢిల్లీ – డెహ్రాడూన్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు సాధారణ కార్యకలాపాలు ప్రారంభ మవుతాయి. కేవలం 4 గంటల 45 నిమిషాల ప్రయాణ సమయంతో 302 కి.మీ. ప్రయాణించవచ్చు. బుధవారం మినహా వారంలోని అన్ని రోజులలో నడుస్తుంది.

ఢిల్లీ – డెహ్రాడూన్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ టిక్కెట్‌ ధర ఏసీ చైర్‌ కార్‌:
గత వారం ఒడిశా నుంచి తొలి వందే భారత్‌ ప్రారంభమైంది. పూరీహౌరా మధ్య నడుస్తుంది. హౌరాపూరీ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను మే 18న ప్రధాని నరేంద్ర మోడీ పూరీ నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. మే 20న వాణిజ్య సేవలను ప్రారంభించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు