Friday, April 26, 2024

గుజరాత్ మ్యాచ్ సరికొత్త రికార్డు..

తప్పక చదవండి

ఐపీఎల్‌లో ఎన్ని జట్లు ఉన్నా, ఎంత మంది స్టార్ ప్లేయర్స్ ఆడుతున్నా.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకున్న క్రేజే వేరు. అదే నిర్వాహకులకు కాసులు కురిపిస్తోంది. ధోని నాయకత్వంలోని చెన్నై మ్యాచ్ ఆడుతోంది అంటే చాలు అభిమానులు ఎగబడి పోతున్నారు. ఈ క్రమంలో మే 23న మంగళవారం చెన్నై, గుజరాత్‌ జట్ల మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఛేదనలో చివరి ఓవర్లను అభిమానులు భారీ సంఖ్యలో వీక్షించారు. దీంతో వ్యూవర్‌షిప్‌ 2.5 కోట్ల మార్క్‌ను తాకింది. గతంలో ఏప్రిల్ 17న చెన్నై – ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచును 2.4 కోట్ల మంది వీక్షించగా, తాజాగా ఆ రికార్డు బద్దలైంది.

చెన్నై అందునా ధోని బరిలో ఉన్నాడంటే.. మైదానంలోనే కాదు వెలుపలా రికార్డుల మోత మోగుతోంది. చెపాక్‌ వేదికగా జరిగిన గుజరాత్ – చెన్నై మ్యాచ్‌ అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. స్టేడియం పసుపు మాయం అయిపోయింది. అభిమానులు ధోని.. ధోని.. అంటూ స్టేడియాన్ని దద్దరిల్లేలా చేశారు. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అంటూ వార్తలు వస్తుండడంతో అతని ఆటను చూడటానికి అభిమానులు పోటెత్తుతున్నారు. ఇక మొబైళ్లలో వీక్షించే వారి సంఖ్య కోట్లలో ఉంటోంది. ఇక గుజరాత్ తో జరిగిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో విజయం సాధించిన చెన్నై ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 172/7 స్కోరు చేయగా.. అనంతరం గుజరాత్ 157 పరుగులకే ఆలౌటైంది. దీంతో టైటాన్స్‌ 15 పరుగుల తేడాతో ఓటమి పాలైంది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు