Sunday, October 13, 2024
spot_img

నిప్పుల కుంపటిగా మారిన తెలంగాణ…

తప్పక చదవండి

వామ్మో ఎండలు,బాబోయ్‌ ఎండలు..ఉక్క పోత,చెమట,చిరాకు, రాత్రిళ్ళు నిద్రా భంగం…తో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతూ వున్నారు.అసలే పెళ్లిళ్ల సీజన్‌. పెళ్లిళ్ల తో కళ్యాణ మంటపం లు కల కల లాడుతో వున్నాయి.యే మండపం ఖాళీగా లేదు.మంచి ఘడియలు వుండడం తో నిత్యం భాజా భజంత్రీలు మోగుతూ వున్నాయి. పెళ్లి కి వచ్చే బంధు మిత్రులు పెరిగిన ఎండలు,వడ గాలుల తో బేజారు అవుతూ వున్నారు. ఏ.సి ఫంక్షన్‌ హాల్లో పెళ్ళిళ్ళు అయితే ఎండ తగ్గే వరకు అక్కడే కూర్చుని కబుర్లు చెప్పు కుంటూ వుంటున్నారు.నాన్‌ ఏ .సి అయితే వారి బాధలు వర్ణనతీతం. తెలంగాణలో ఎండల తీవ్ర రోజురోజుకు పెరిగిపోతోంది. ఉదయం 8 నుంచే సూరీడు భగభగమంటున్నాడు. ఇక మధ్యాహ్నం పూట సెగలు కక్కుతున్న సూర్యుడిని చూసి బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. ఈ క్రమంలో రాబోయే రెండ్రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.రాబోయే వారం రోజుల లో పలు ప్రాంతాల్లో పగలు 46 డిగ్రీల వరకూ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో వేడి పెరుగుతోంది. ఆదివారం అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో, కాసిపెట్‌ లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిపూట కూడా వేడి ఎక్కువగా ఉంటుండటంతో ప్రజలు ఉక్కపోతతో నానా ఇబ్బందులు పడుతున్నారు.పిల్లల బాధలు వర్ణనాతీతం. శనివారం రాత్రి ఖమ్మంలో 30 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు పెరగనుండటంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.బయటకు అవసరం వుంటేనే వెళ్ళండి.ఇంటిలో ఇప్పటికే మజ్జిగ,కొబ్బరి నీళ్లు,నిమ్మ రసం తాగుతూ వుండాలి.తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.మసాలాలు ఎక్కువగా వాడొద్దు. మాంసా హారం తీసుకోక పోవడం బెస్ట్‌.గంటకు ఒక సారి గ్లాస్‌ చొప్పున నీరు తాగాలి. ఒక వేళ వడ దెబ్బ కొడితే తగు జాగ్రత్తలు తీసుకోవాలి.నీరు, పళ్ళ రసాలు ఇవ్వాలి.కాటన్‌ దుస్తులు ధరించాలి.నీరు ఎప్పుడు గొంతు ఎండకుం డా తాగాలి. ఎండలో వెళ్ళే వారు గొడుగు, లేదా టోపీ పెట్టుకొని వెళ్ళాలి. చల్లని శీతల పానీయాలు తాగరాదూ.నల్ల దుస్తులు ధరించ కూడదు. సో ఎండకు బయటకు రాకుండా ఉందాం,వడ దెబ్బ నుండి రక్షణ పొందుదాం.

  • కామిడి సతీష్‌ రెడ్డి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు