Tuesday, July 16, 2024

కర్నాటక ఎన్నిక ఫలితాలు

తప్పక చదవండి

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకుగాను ఈ నెల 10వ తేదీన ఎన్నికలు జరిగితే, ఏకంగా 1036 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ప్రధాన మోడీ విస్తృతంగా ప్రచారం చేసినా, ఏకంగా 19 బహిరంగ సభలు, 6 రోడ్‌ షోలు నిర్వహించినా, ‘‘జై భజరంగ్‌ బలీ’’ అని మత పరమైన నినాదాలు మోది స్వయంగా చేసి, ప్రజలతో అనిపించినా బిజేపీకి పరాభవం మాత్రం తప్పలేదు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌ పార్టీకి ఈసారి 50 సీట్లు అదనంగా రావటం విశేషం. రాహుల్గాంధీ చేపట్టిన కాంగ్రెస్‌ విజయ యాత్రతో బిజెపీ, జెడీఎస్‌,కంచుకోటలు బద్ధలయ్యాయి. ఈ విజయంతో దక్షిణాదిలో కాంగ్రేస్‌ పార్టీ మళ్లీ ఖాతా తెరచినట్లు అయింది. అధికార బీజేపీ 65 స్థానాలకే పరిమితమైంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 39 సీట్లు కోల్పోయింది. అంతే కాకుండా దక్షిణాదిలో ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక ప్రభుత్వ ము కాస్తా చేజారి పోయింది. ఒక విధంగా దక్షిణ భారతదేశంలో కాంగ్రేస్‌ ‘‘బిజెపి విముక్త భారత్‌గా ఆవతరించింది. ఇక ఓటర్ల విస్పష్ట తీర్పుతో ‘‘కింగ్‌ మేకర్‌’’ అవుదామనుకొని ఆశలు పెట్టుకు న్న జెడీఎస్‌ అంచనాలు కూడా తప్పాయి. ఆ పార్టీ కేవలం 19 స్థానాల్లోనే తన ఉనికిని చాటింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 18 స్థానాలు గల్లంతయ్యాయి. ఆ పార్టీకి గట్టిగా పట్టున్న టువంటి మైసూర్‌ ప్రాంతంలో కూడా కాంగ్రెస్‌ పార్టీకి విజయం వరించింది. చివరికి తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల లోనూ జేడీఎస్‌ గెలిచిన సీట్లు కేవలం మూడు మాత్రమే. విచిత్రం గా ఓట్ల శాతం లో కాంగ్రెస్‌ భారీగా లాభపడిరది. కానీ బీజేపీ ఓట్ల శాతంపై పెద్దగా ప్రభావం పడలేదు. ఎందు కంటే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి 36.5% ఓట్ల వస్తే, ఇప్పుడు 35.9% సాధించింది. అప్పటికీ ఇప్పటికీ తేడా కేవలం 0.6% మాత్రమే. అయినా 39 సీట్లు తగ్గిపోయాయి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 38.4 శాతం ఓట్లు వస్తే, ఈసారి అది 43 శాతానికి పెరిగింది. ఓట్లు భారీగా గండి పడిరది మాత్రం జెడీఎస్‌ కే.ఆ పార్టీకి గత ఎన్నికల్లో 18.3 శాతం ఓట్లు వస్తే ఇప్పుడు కేవలం 13.3% శాతానికే పరిమితం అయింది. 36 ఏళ్ల తర్వాత ,కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ భారీగా సీట్లను సాధించి చరిత్రను సృష్టించింది.1989లో జరిగిన ఎన్నికల్లో 224 నియోజక వర్గాలకు గాను 178 స్థానాల్లో ఘనవిజయం సాధించింది.ఆ తరు వాత, 1999లో 132స్థానాలు గెలుపొందింది. మళ్ళీ ఈ సారి 2023 ఎన్నికల్లో 136 స్థానాలు దక్కటం ఘన విజయం క్రిందే లెక్కించాలి.ఎగ్జిట్స్‌ పోల్స్‌ అంచనాలకు మించి కాంగ్రేస్‌ ఈ విజ యాన్ని సాధించింది. ఒక్క ఇండియా టుడే ఎగ్జిట్స్‌ పోల్స్‌ అంచ నాలు, ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలను ప్రతిబింభించాయి. బిజెపి ఓటమికి కారణాలు: కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకులు తీసుకున్న నిర్ణయాలు ఆ పార్టీకి శాపంగా మారాయి. ఐదేళ్ల కిందట హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితే, అతి పెద్ద పార్టీగా బిజెపి అవతరించింది.దాని తరఫున యడియూ ర్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. కానీ అసెంబ్లీ లో బల నిరూపణ చేసుకో లేక చతికిల పడ్డాడు. ఆ తర్వాత కాంగ్రెస్‌, జెడీఎస్‌ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జీడీఎస్‌ నేత కుమార స్వామి సీఎం పదవి చేపట్టాడు. ఆ సమయంలోనే 17 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఆకర్షించి సంకీర్ణ ప్రభుత్వాన్ని కుట్రతో కూల్చివేసి బిజెపి మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టింది. ఎడ్యూరప్ప మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. లింగా యత్‌లలో బలమైన నేత అయన నేతను కేంద్రం లోని బిజెపి నేతలు రెండేళ్ళు కూడా పదవిలో కొనసాగని వ్వలేదు. పైగా లిగా యత్‌లలో అంతగా పట్టు లేని అదే వర్గానికి చెందిన బొమ్మైకు పదవిని కట్టబెట్టారు. ఎన్నికల సమయంలో లింగాయత్‌ లలో బలమైనటువంటి నేతలైయిన జగదీష్‌ శట్టర్‌, సవది వంటి వారికి టికెట్లు నిరాకరించారు. దీంతో వారంతా కాంగ్రెస్‌కు జై కొట్టారు. లింగాయత్‌ల ప్రబల్యానికి అడ్డుకట్ట వేసి, మోదీ ‘మేని యాతో’ నే గెలవాలని బిజేపి భావించింది. ఇతర రాష్ట్రంలో మాది రిగానే ‘‘అంతా నేనే ‘‘అన్నట్టుగా దక్షిణాది రాష్ట్రా ల్లో కూడా ‘‘నేనే ‘‘ అనే అహంకారంతో బిజెపి పౌవులు కదిపింది. దాదాపు 70 సీట్లలో ప్రభావం చూపగలిగిన లింగాయత్‌లకు ఈ పరిణామా లన్నీ తీవ్రంగా ఆగ్రహాన్ని కలిగించాయి.దానిని గమనించే ముస్లిం లకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్‌ తొల గించి, జనాభాలో అత్యధి కంగా ఉన్న లింగాయత్‌ లకు వక్కళిం గలకు రెండేసి శాతం చొప్పున కట్టబెట్టారు. రిజర్వేషన్‌ తేనె తుట్టెను బిజేపి కది పింది, దానితో ముస్లింలు, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్సీలు అందరికీ బిజేపి దూరమ యింది. అదే సమయంలో లింగా యత్‌ లు వక్క ళింగలు బిజెపిని ఆదరించలేదు. దీని ఫలితంగానే ఎన్నికల్లో బిజేపి ఘోర మైన ఓటమిని చవిచూసింది. అప్పటివరకు బిజెపికి కొండం త అండగా ఉన్న లింగాయత్‌ లు ఓట్‌ బ్యాంకు కాంగ్రెస్‌ వైపు మళ్ళింది. వారు నిర్ణాయక సంఖ్యలో ఉన్న 70 నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ ఏకపక్షంగా 46 స్థానాలను గెలుచుకో గలిగింది. ఒకళిం గ ప్రాబల్యం అధికంగా ఉన్న 51 నియోజక వర్గాలకు గాను 27 స్థానాలను, తన ఖాతాలో వేసుకుంది. ఎస్సీల ప్రాభల్యం అధికంగా ఉన్న 37 నియోజకవర్గాల్లో కాంగ్రేస్‌ 22 స్థానాలను గెలుచుకుంది. అలాగే ఎస్టీల ప్రాబల్యం అధికంగా ఉన్న 15 నియోజకవర్గాల్లో నూ 14 స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. మరొక వైపు, ‘‘హలాల్‌’’, ‘‘అజాన్‌’’ ‘‘గోవద నిషేధం, టిప్పు సుల్తాన్‌ వంటి వివా దాల నుంచి రిజర్వేషన్‌ల వరకూ వివిధ అంశాలలో రాష్ట్రంలో విద్వేష రాజకీయాలు పెచ్చరిల్లాయి. తటస్థ ఓటర్లతో పాటు ముస్లింలు కూడా బిజెపికి దూరమయ్యారు. వీటన్నిటికీ తోడు పాలనలో బసవరాజు బొమ్మై ఘోరంగా విఫలమ య్యాడు. అవి నీతి వీరవిహారం చేసింది. మంత్రులపైనే ‘‘మిస్టర్‌ 40%’’ అంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ, అవినీతి పై కర్ణాటక కాంట్రాక్టర్లు అసోసియేషన్‌ సాక్షాత్తు ప్రధాన మంత్రి మోడీకి లేఖ కూడా రాసింది. ప్రభుత్వంలో చేపట్టిన ప్రతి ప్రాజెక్టు ల్లో 40% కమిషన్‌ తప్పనిసరిగా, బహిరంగంగా తీసుకుంటున్నా రని ఫిర్యా దు కూడా చేసింది. అయినా కేంద్ర ప్రభుత్వం వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇటువంటి అంశాలన్నీ కలిసి బిజెపిని ఘోరంగా ఓడిరచడానికి ప్రధానమైన కారణాలు అయ్యాయి.

విజయం సాధించిన కాంగ్రేస్‌ నెరవేర్చవలసినబాధ్యతలు:
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచిత పథకా లు కూడా కాంగ్రెస్‌ గెలుపు బాటలో కీలకమైన పాత్రను పోషిం చాయి. ముఖ్యంగా 200యూనిట్లు వరకు ఉచిత విద్యుత్తు, కుటు ంబంలో ఒక మహిళకు నెలకు రూ.2,000, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గ్రాడ్యుయేట్లకు నెలకు రూ. 3000, డిప్లమొ చేసిన వారికి రూ.1500 నిరుద్యోగభృతి ఇస్తామని హామీ లు ఇచ్చారు.దీనితో పాటు రాష్ట్రంలో బిజేపి పాలనా కాలంలో జరిగిన అవినీతి కార్యకలాపాలపై నిష్పాక్షిక జుడీషియల్‌ విచారణ జరిపి దోషులను చట్ట ప్రకారం శిక్షించాలి.ప్రజాస్వామిక ఉద్యమ కారులపై, మైనార్టీల పై బిజేపి ప్రభుత్వం పెట్టినఅక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలి. లౌకిక వాద వ్యయవస్థను పునరుద్ధరణ చేయాలి. ఈహామీలు కాంగ్రెస్‌పార్టీకి ఓట్లు రావడానికి తోడ్ప డ్డాయి. అదే సమయంలో సోనియా గాంధీతో సహా కాంగ్రెస్‌ శ్రేణు లన్నీ ఒక్కొమ్మడిగా వ్యూహాత్మకంగా ప్రచారం సాగించడం వల్ల కూడా కాంగ్రెస్‌ ఘన విజయాన్ని సాధించింది. ఈఎన్నికల హామీ లను నెరవేర్చినట్లు అయితే భవిష్యత్తులో కాంగ్రెస్‌కు దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తర భారత దేశంలో కూడా భవిష్యత్తు ఉంటుంది.

  • డా.కోలాహలం రామ్‌ కిశోర్‌ 9849328496
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు