Wednesday, April 24, 2024

సమగ్ర కులగణన చేయకపోతే.. బీజేపీకి అధికారం దూరమే

తప్పక చదవండి

కులగణన విషయంలో భారతీయ జనతా పార్టీ తన వైఖరి మార్చుకోకపోతే తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకోకత ప్పదని జాతీయ బీసీ దళ్‌ అధ్యక్షులు దుండ్రకుమారస్వామి హెచ్చరించారు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి ఓటర్లు ఎలాగైతే బుద్ధి చెప్పారో.. ఇతర రాష్ట్రాలలోనూ, సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయని జోస్యం చెప్పారు. అన్ని వర్గాల వారినీ కలుపుకుని వెళ్లడం కారణంగానే కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిందని.. ప్రతి సామాజిక వర్గం భారతీయ జనతా పార్టీకి దూరమయ్యే అవకాశం అతి త్వరలో ఉందని దుండ్ర కుమారస్వామి అన్నారు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ సమగ్ర కులగణన చేపట్టకపోతే బీజేపీకి అధికారం దూరమవ్వడమే తరువాయి అని చెప్పుకొచ్చారు. బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాల్సిందే: బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. బీసీలకు జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు లేకపోవడంతో, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో సంవత్సరాల నుంచి తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ దళ్‌ ఎప్పటి నుండో డిమాండ్‌ చేస్తోందని దుండ్ర కుమారస్వామి చెప్పుకొచ్చారు. బీసీల సంక్షేమం, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, మండల్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని కోరుతున్నామన్నారు. బీజేపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని, రానున్న ఎన్నికలలో బీసీలు తగిన గుణపాఠం చెప్పబోతున్నారని అన్నారు.
బీసీ ప్రధానినని చెప్పుకునే మోదీ బీసీలకు ఏమి చేశారు: 56శాతం జనాభా ఉన్న బీసీలకు మంత్రిత్వ శాఖ లేకపోవడం తో బీసీ కులాల అభివృద్థి కుంటుపడుతోందని కుమారస్వామి చెప్పుకొచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమని అన్నారు. మండల్‌ కమిషన్‌ సిఫా ర్సులు గత ప్రభుత్వాలు అమలు చేసి ఉండి ఉంటే ఈపాటికి దేశంలో బీసీల స్థితిగతులు ఎంతో బాగుపడి ఉండేవని తెలిపారు. బీసీ ప్రధానినని చెప్పుకునే మోదీ గత తొమ్మిది సంవత్సరాల పాలనలో బీసీలకు చేసింది ఏమీ లేదని అన్నా రు. చట్టసభలలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించా లని పలు ప్రభుత్వాలు తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే, నేటి వరకు వాటిని పట్టించుకోలేదని అన్నారు.
కులగణన చేపట్టాల్సిందే: కులగణన విషయంలో కేంద్ర ప్రభు త్వం నాన్చుడు ధోరణి ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదు. దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతీయ పార్టీలు జనాభా లెక్కల్లో కులగణన చేయాలని ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నా కేంద్రం పట్టించుకుంటున్న దాఖలాలు ఏ మాత్రం లేవు. కుల జనగణన నిర్వహించి జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో సీట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసీ చేసీ అలసిపోతున్నాం తప్పితే కేంద్రం తీరులో ఏ మాత్రం మార్పు లేదు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు పదవులు ఇచ్చి అధికార పగ్గాలు వారి చేతుల్లోనే పెట్టుకుంటున్నారు. అందరూ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఉండిపోరు.. బీసీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై తమ పోరాటం మాత్రం ఆగదని.. జాతీయ బీసీ దళ్‌ తరపున పోరాడుతూనే ఉంటామని జాతీయ బీసీ దళ్‌ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి చెప్పుకొచ్చారు.
త్వరలో జాతీయ స్థాయి ఉద్యమం: త్వరలో జాతీయస్థాయిలో ఉద్యమం చేస్తామని దుండ్ర కుమారస్వామి చెప్పారు. పార్ల మెంట్‌ లో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి,కులగణన చేసే విధంగా బీజేపీ మంత్రు లు, సీనియర్‌ నాయకులు ప్రధానిపై ఒత్తిడి తేవాలన్నారు. కాంగ్రెస్‌ హయాంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని, బీసీ ప్రధాని అయితే బీసీలకు న్యాయం జరుగుతుందని గంపె డు ఆశాలతో మోదీని ప్రధానిగా చేస్తే.. నేటికీ మోదీ పాలన లో బీసీలకు అన్యాయం కొనసాగుతూ ఉందని ఆరోపించారు. కర్ణాటక రాష్ట్రంలో బీసీలను, ఓబీసీలను నమ్ముకుంది కాబట్టే కాంగ్రెస్‌ పార్టీ విజయం దక్కించుకుందని.. త్వరలో దేశ వ్యాప్తంగా ఉన్న బీసీల సత్తా ఏమిటో మోదీ చూస్తారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి బీసీలతో త్వరలో ఢల్లీిలో ధర్నా చేపట్టనున్నట్లు జాతీయ బీసీ దళ్‌ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి చెప్పారు.

  • దుండ్ర కుమారస్వామి 9959912341
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు