Sunday, July 21, 2024

రబ్బర్ చెప్పులతో వచ్చిన హరీష్ కు వేలకోట్ల ఎక్కడివి

తప్పక చదవండి
  • తిరుమల వెంకన్న మీద ఒట్టు మంత్రి హరీష్ ను వదిలేది లేదు..
  • మెదక్ టికెట్ నీ కీప్ కు ఇప్పించుకున్నావని రాష్ట్రమంతా తెలుసు
  • వెలమ హాస్టల్ కు ట్రంకు డబ్బాతో వచ్చిన నీకు వేల కోట్ల భూములెక్కడివి
  • వెంకన్న సాక్షిగా మంత్రి హరీష్ రావు పై విమర్శలు చేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యేమైనంపల్లి
    హైదరాబాద్ :- తిరుమల తిరుపతి దేవస్థానం లో తిరుమల వెంకన్న దర్శనం చేసుకున్న అనంతరం దేవాలయం ఆవరణలో మీడియా ముఖంగా సిద్దిపేట ఎమ్మెల్యే ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఘాటు వాక్యాలు చేశారు. హరీష్ రావు మెదక్ ను ఒక కీప్ గా ఉంచి సిద్దిపేటలో అభివృద్ధి చేసుకుంటున్నాడని ఆరోపించారు. కమిషన్ల రావు గా రాష్ట్రం లో పేరుతెచ్చుకున్న నువ్వు అందరి ఎమ్మెల్యే ల వద్ద లక్షల కోట్లు సంపాదించి కాళేశ్వరం ప్రాజెక్ట్ , మల్లన్న సాగర్ , కొండపొచమ్మ , రంగనాయక సాగర్ పనుల్లో చేశావని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడ్డ నీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.. మెదక్ టికెట్ కూడా పద్మ దేవేందర్ రెడ్డి కి కావాలని ఇచ్చారని వారిద్దరి మధ్య ఉన్న సంబంధం రాష్ట్రమంతా తెలుసునని సంచలన కామెంట్స్ చేశారు. ఒక్కప్పుడు చదువుకోడానికి వెలమ హాస్టల్ కు రబ్బరు చెప్పులతో ఒక్క ట్రంకు డబ్బాతో వచ్చిన హరీష్ రావు ఈరోజు వేలకోట్ల అక్రమ భూములు, లక్షల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నిచారు.. రాష్ట్రం లో ఎక్కడ చూసినా అవినీతి మయం చేసిన హరీష్ రావుకి సిద్దిపేటలో తన దుకాణాన్ని బంద్ చేయిస్తానని విరుచుకుపడ్డారు . ఆస్తుల్లో మామను మించిన అల్లుడు అని ఎద్దేవా చేశారు మెదక్ నియోజకవర్గ ప్రజలను నాయకులను మోసం చేసిన హరీష్ రావు నీకు నువ్వు టికెట్ ఇచ్చిన పద్మాదేవేందర్ రెడ్డి కి ఓటమి ఖాయం అని స్పష్టం చేశారు. నేను ఏది చెప్పను చెప్పానంటే తప్పకుండా చేసి చూపిస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యానించారు . ప్రజల ముందు నటన అంతా బయట పెడతానని మెదక్ నుండి మైనంపల్లి రోహిత్ ని పోటీ చేయిస్తున్నానని తాను కూడా మల్కాజిగిరిలో ఎమ్మెల్యేగా పోటీలో ఉంటున్నారని ఇక సిద్దిపేటలో పాగా వేసి హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని మైనంపల్లి సవాల్ విసిరారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు