- 2018లోనే రాహుల్ లేఖ రాశాడన్న జైరామ్ రమేశ్
న్యూఢిల్లీ : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఈ బిల్లు చరిత్రను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖను కూడా ఆయన షేర్ చేశారు. 2018లో రాసిన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ విూడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే..మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించాల్సిన సమయం వచ్చింది. ఈ విషయంలో ప్రధానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. ఆనాడు భాజపా మద్దతుతో ఎగువసభలో బిల్లుకు ఆమోదం లభించింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న అరుణ్ జైట్లీ దీనిని ఒక చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. మహిళలకు సాధికారత కల్పించే ఈ అంశంపై మనం కలిసి నిలబడదాం. రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగుదాం. ఈ ముఖ్యమైన సందేశాన్ని యావత్‌దేశానికి చాటి చెబుదాం అని రాహుల్ లేఖలో పేర్కొన్నారు. భారత్`కెనడా మధ్య ముదిరిన ఖలిస్థానీ చిచ్చు.. మన రాయబారిపై ట్రూడో బహిష్కరణ వేటు ‘మహిళలకు రిజర్వేషన్లను అమలు చేయాలనేది కాంగ్రెస్ చిరకాల డిమాండ్. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని పార్టీ స్వాగతిస్తోంది. దీనికి సంబంధించి మిగిలిన వివరాల కోసం ఎదురుచూస్తున్నాం. రహస్యంగా కాకుండా అఖిలపక్ష సమావేశంలో దీనిపై చర్చలు జరిపి ఏకాభిప్రాయం సాధించి ఉంటే బాగుండేది‘ అని జైరాం రమేశ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. బిల్లుకు ఆమోదం లభించడంపై కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ (ªూనీనితిజీ ఉజీనిటఠతి)ని విలేకరులు అడిగిన ప్రశ్నకు ’ఇది మాది’ అని సమాధానమిస్తూ.. పార్లమెంట్‌లోకి వెళ్లిపోయారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇప్పటిది కాదు. ఈ బిల్లును 1996లో హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్‌పేయీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు సభ ఆమోదానికి నోచుకోలేదు. చివరకు ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండిరగులోనే ఉండిపోయిన విషయం తెలిసిందే.