Saturday, December 2, 2023

ఓటు ఓ వజ్రాయుధం`మేలుకో ఓటరు మహాశయా

తప్పక చదవండి

నవంబర్‌30న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగను న్నాయి. రాజకీయ పార్టీల ఎన్నికల్లో గెలవడానికి ప్రచారములో తీవ్రంగా పోటీ పడుతున్నాయి. అమలుకు నోచుకోని హామీలు ఉచితాలు’ ఆర్థిక ప్రలోభాలు ప్రకటిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఓటర్లు తమ కున్న ఓటు హక్కును ఉత్తమ అభ్యర్థుని ఎన్నుకోవడంలో విజ్ఞత ప్రదర్శించాలి. ఎన్ని కలపై నిర్లక్ష్యం తగదు.. ఎన్నికలు అంటే అవి నాయకులకే పరి మితమైనవని సాధారణ పౌరసమాజం ఎన్నికల పట్ల ఆసక్తి చూపకపోవడం వల్ల అవినీతి పరులు చట్ట సభలకు ఎన్నికై రాజకీయ అవినీతికి పాల్పడి కోట్లాది సంపాదనకు రాజకీయాలు మార్గమైనాయి. ప్రాజెక్టుల పేరు మీద ప్రజల సొమ్మును దోపిడి చేస్తూ దోసుకో’ దాసుకో అనే నినాదాన్ని తమ పాలన విధానంగా మార్చి వేసి పేద’ మధ్య తరగతి బి ‘సి బడుగు బలహీనర్గాలను చట్ట సభల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునే వికృత రాజకీయ క్రీడ కొనసాగడంశోచనీయం. బ్రిటిష్‌ పాలన నుండి దేశ ప్రజల విముక్తి కొరకు జరిగిన పోరాటాల్లో ప్రాణాలకు తెగించి పోరాడిన భారత దేశ ప్రజలు స్వాతంత్య్ర అనంతరం చట్టసభలకు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఉదాసీన వైఖరి అవలంభించడం వల్ల చట్టసభలు నేరచరితుల రౌడీల ‘’మాఫియాల’ ధన స్వాముల పరమైనాయి. ఎన్నికలు గెలుపు గుర్రాలు ఎన్నికలు అంటే గెలుపు గుర్రాలకు మాత్రమే రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇస్తు పార్టీ కొరకు ప్రజా ఉద్యమాలు చేసిన త్యాగశీలురు అంకిత బావం ‘ సిద్ధాంత నిబద్ధత కలిగిన సీనియర్‌ కార్యర్తలకు టికెట్లు ఇవ్వక పోవడం వల్ల చట్టసభలకు జరిగే ఎన్నికలు ధనికులకు ‘మాఫియా ‘డాన్‌ కార్పొరేట్‌ శక్తులకు రిజర్వ్‌ చేయబడ్డాయన్న మానసిక భావన సమాజంలో స్థిరపడి పోయింది. మన తల రాతను మార్చేది ఎన్నికలే.. మనం ఎన్నికల ఓటింగ్‌ గురించి పట్టించు కోక పోయిన మన సమాజంలో ఆర్థిక ‘సామాజిక సాంస్కృతిక ‘సాంఘిక ఉద్యోగ’ ఉపాధి ‘పెట్టుబడి ఉత్పత్తి’ ఉత్పాదకత ‘స్వదేశీ విదేశీ వర్తకం’ వ్యారం ‘విధ్య వైద్యం ‘ఆరోగ్యం ‘విదేశీ విధానాల రూపకల్పనలో మౌలిక మార్పులు తెచ్చి మన జీవితాలను భవిష్యత్తును మన పిల్లల భవిష్యత్తును మార్చ గలిగేది చట్ట సభలకు జరిగే ఎన్నికలు మాత్రమేనన్నది చారిత్రిక వాస్తవం .ఎన్నికలు అంటే సమాజములో అందరివి కొందరివి కాదు లేదా కొన్ని సామాజిక వర్గాల ఏకస్వామ్యంకాదు. కుటుంభాలగుత్తాధి పత్యంకాదు.ఓటర్లు పోలింగులో సంపూర్ణ భాగస్వాములై ‘‘తమ స్థిత గతులను ‘‘మార్చుకునే పరిస్థితిగా గుర్తించాలి. ఓటు మన జన్మ హక్కు.. నిజమైన సార్వభౌమా ధికారం ఓటరు చేతిలోనే వుంటుంది .ఐదేళ్లకు ఒక సారి మన సేవకులను చట్ట సభలకు అభ్యర్థులుగా ఎన్నుకుంటాం.పరిపాలన దక్షున్ని రాజ్యాంగ చట్టాల పట్ల ప్రజా సంక్షేమ పథకాలు చట్టాల పట్ల అవగాహన పరిజ్ఞానం వున్న అభ్యర్థిని ఎన్నుకొని సుపరిపాలనకు దిశ దశ నిర్ణయించడం లో ఓటే కీలకం.నోటుకు ఓటును అమ్ముకోవద్దు.ఓటు ద్వారా తమ తల రాతను మార్చే శక్తి వుంది.ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించే శక్తి సామర్థ్యాలు ఉన్న అభ్యర్థిని ఎన్నుకొని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే ఉత్తమ అభ్యర్థులకు ఓటువెయ్యాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు ప్రజలు తమకున్న ఓటు హక్కుతో ఐదు సంవత్సరాల పదవీ కాలానికి ప్రజా ప్రతి నిధులను ఎన్నుకొని ప్రభుత్వాల ఏర్పాటులో క్రియా శీలకంగ పాల్గొనాలి. ఓటుమార్పుకు ఆయుధం.. ఓటు అనే ఆయుధంతో ఓటరు తమ ఆకాంక్షలు అవసరాలు తీర్చే ప్రభుత్వాలకు అధికారం ఇస్తాడు. అభివృధ్ది సాధకులకు ఎన్నుకోవాలి.. జాతి తల రాతలు మార్చే సమాజ సేవకులను సామర్థ్యం’ సత్తాగల అభివృద్ధి సాథకులను చట్ట సభలకు అభ్యర్థులుగా ఎన్నుకోవాలి. ఓటు వేసే ముందు గత ఎన్నికల్లో పార్టీలు ఇచ్చిన వాగ్దానాల అమలునుఎన్నికల మేనిఫెస్టో పట్ల ఆలోచించాలి. తల రాతను మార్చేది ఓటు.. బాధ్యత గల పౌరుడిగా మన జీవితాన్ని తద్వారా జాతి తల రాతను మార్చేది మన ఓటుతోనే వీలవుతుందనే వాస్తవాన్ని మరువరాదు. ఎవరికి ఓటు వెయ్యాలి ? ఎందుకు ఓటు వేయాలి? జాతి భవిష్యత్తు ‘దేశఐక్యతా సమగ్రత’ దేశ సార్వభౌమా ధికార రక్షణ భద్రత దేశ రక్షణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం ‘పారిశ్రామిక అభివృధి ‘సేవా రంగాల విస్తరణ స్వయంసమృది సుస్తిరాభివృద్ది ‘ఉపాధి ఉత్పాదక’ సామర్థ్యం ప్రజల జీవన ప్రమాణాల స్థాయిని మెరుగు పరిచే పార్టీ అభ్యర్థులను చట్ట సభ సభ్యులుగా ఎన్నుకోవాలి. ఓటు వేసే ముందు రాజకీయ పార్టీల విదానాలు సిద్ధాంతాలు కట్టుబాట్లు నిబద్ధత నిజాయితీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవలంబించే సామర్థ్యం ఉన్నవారినిఎన్నుకోవాలి . ఓటర్లుఎన్నికల మేనిఫెస్టో పరిశీలించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వాటి అమలు ప్రాజెక్టుల నిర్మాణం నాణ్యత లభిదారుల సమస్యలు పరిష్కారాలు పరిశీలించాలి. ఓటు వేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి అభివృధ్దికి పాటుపడే వారికి ఓటు వెయ్యాలి. ఏ పార్టీ, మన దేశాన్ని, మన ధర్మాన్ని రక్షించడానికి కట్టుబడి ఉంది? ఏ పార్టీ లంచగొండితనంతో కూరుకుపోయి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది. అభివృధ్ది సంక్షేమం పేరున అమలౌతున్న పథకాల ప్రయోజనాలు అధికారంలో ఉన్న వారి కుటుంబానికి లబ్ది చేకూరుస్తున్నాయనే అంశాల మీద ఓటర్లు అవగాహన కలిగి వుండాలి . సహజ వనరులు మానవ వనరుల అభివృద్ధికి ఉపయోగపడే దీర్ఘ కాలిక ప్రయోజనాలకు పెద్ద పీట వేసి పేదరికం నిరుద్యోగం తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే సరైన పార్టీకి ఓటు వేసి ప్రగతి శీల సమాజ స్థాపనకు చేయూత నివ్వాలి. మన ఓటుతోనే ప్రభుత్వాలు ఏర్పడతాయి! మనం ఓటు వేసేది ఎవరికో అధికారం ఇవ్వటానికి కాదు. మన జాతి తల రాతను మార్చి ఉజ్జ్వల భవిష్యత్తు కోసం ఓటరు ఓటు వేసే ముందు పార్టీల మేనిఫెస్టో అంశాలు నిర్ణీత పదవీ కాలంలో అమలు అవుతాయా? లేదా? తెలుసుకోవాలి . రాజకీయాల పట్లఎన్నికల పట్ల ఎన్నుకునే ప్రతి పౌరుడు ఆసక్తి అవగాహన కలిగి వుండాలి. మనం రాజకీయం చేయక పోయినా రాజకీయాలు తెలుసు కోవటం నేటి తక్షణ అవసరం. ఓటు నిశ్శబ్ద విప్లవం.. దేశ రాజకీయాలకు వెగటు పుట్టిస్తున్న ధన’ రౌడీ రాజకీయాలతో పరువు మాస్తున్న ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయడానికి తమ ఓటు హక్కు వినియోగం ద్వారా అవినీతి అక్రమాల చెర లోంచి జనస్వామ్యానికి స్వేచ్ఛ ప్రసాదించే ప్రజా ఉద్యమానికి విజ్ఞత గల ఓటర్లు నేతృత్వం వహించాలి. ఓటు బుల్లెట్‌ కంటే బలమైంది.ఓటు ఒక నిషబ్ధ విప్లవం ఓటే మన ఆయుధం! దానితోనే మనం పోరాడాలి. మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి! మన బతుకులు మనం చక్కపరచుకోవాలి! ఎన్నికల్లో ప్రతి ఓటరు క్రియా శీలక బాగస్వామి కావాలి .ఓటింగులో తప్పని సరిగా పాల్గొనాలి ఇతర ఓటర్లను యువతను తమ ఓటు హక్కు వినియోగించుకొని తమ తల రాతను మార్చే పార్టీలకు అభ్యర్థులకు ఓటు.వెయ్యాలి. పోటీ చేసే అభ్యర్థుల గున గణాలు వారి సామాజిక సేవా అంశాల మీధ విరివిగా చర్చించాలి. నోటుకు ఓటు అమ్ముకో వద్దు.. ఓటు వేసే ముందు విజ్ఞత ఓటరు రాజకీయ పార్టీల హామీల ఓట్ల వేలం పాటల హోరులో హైరానా పడి నోటుకు ఓటు అమ్ముకోవద్దు. మన ఓటు తెలంగాణ అభివృద్ధికి మన కులం వాడని, మన జిల్లా వాడని, మన ప్రాంతం వాడని భావించ కుండ కుల మతాలకు అతీతంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కలిగించే వారిని ఎన్నుకోవాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఏపార్టీ వాడని చూడకు ఏ పాటి అభివృద్ధికి పాటుపడే వాడో ఆలోచించు.మనంవేసే ఓటు ప్రజాస్వామ్యాన్ని పది కాలాల పాటు ఉద్దరించ గలగాలి. ఓటుకు ఒక ప్రత్యేక త వుంది .దాని ప్రాధాన్యం ఎంత చెప్పిన తక్కువే . చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా ముందే జాగ్రత్త పడాలి .నీతి నిజాయితీగా పనిచేసే వాడికి, రాష్ట్ర భవిష్యత్తు అభివృధ్దికి సంక్షేమానికి ప్రజా రక్షణలో క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా అండగా నిలబడే పార్టీకి/ అభ్యర్థికి ఓటు వెయ్యాలి రాష్ట్ర ప్రజల ఉజ్జ్వల భవిష్యత్తుకు పాటు పడే పార్టీ/ అభ్యర్థులకు ఓటు.. పేద బడుగు బలహీన వర్గాల జీవితాలలో జీవన ప్రమాణాలు మెరుగుపరిచి సామాన్య పేద ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించే వ్యక్తికి /అభ్యర్థికి ఓటు వేస్తే తెలంగాణా ప్రజల ఉజ్జ్వల భవిష్యత్తుకు సుఖమయ జీవితానికి దోహదపడే నూతన అభివృధ్ది వ్యూహా లతో ముందుకు వచ్చే పార్టీకి/ అభ్యర్థులకు ఓటు వేయండి.ప్రజా సంక్షేమానికి పాటు పడని నేతలను ఓటు ద్వారా నిగ్గ తీయండి. ప్రజా ఆకాంక్షలు తీర్చని వారిని శంకర గిరి మాన్యాలు పట్టించే శక్తిని సమకూర్చేది ఓటు హక్కేనని విజ్ఞత గల ఓటర్లు.గుర్తించాలి. ఓటర్లు జాతి తల రాతను మార్చి రాసేవిధాలుగా అవతరించాలి. ఓటర్లు నిర్లక్ష్యాన్ని నిర్లిప్తత ను సోమరితనం విడనాడి ఓటింగులో చురుకుగా పాల్గొనాలి. తమ ఓటు ద్వారా ప్రభుత్వ నిర్మాణం జరుగుతుంద నినే వాస్తవాన్ని మరువద్దు. ప్రజాస్వామ్య రక్షణ ప్రతి ఓటరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి. ప్రజాస్వామ్యాన్ని జనస్వామ్యం గా మార్చే ప్రక్రియలో ఓటర్లదే తుది తీర్పు .ఓటు పదునైన ఆయుధం. దీన్ని ఏవిధంగా సందిస్తే మన జీవితాలు మారుతా యనేది ఆలోచించాలి.ఎది ఏమైనా మనం వేసే ‘‘ఓటు కోహినూర్‌’’ వజ్రం కంటే అత్యంత విలువైనది.ఓటు ఓ గొప్ప మార్పుకు సంకేతం. ఓటు ప్రగతికి మేలుకొలుపులాఉండాలి.మనం తోడుకున్న గోతిలో మనం పడకూడదు. ఓటరా మేలుకో ప్రజాస్వా మ్యాన్ని రక్షించుకో
` నేదునూరి కనకయ్య 9440245771.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు