Wednesday, September 11, 2024
spot_img

వైభవోపేత పుణ్యక్షేత్రం – యతితపోస్తల దత్తక్షేత్రం..

తప్పక చదవండి
  • నాగార్జునసాగర్ ఎత్తిపోతల వద్ద దట్టమైన అడవుల్లో వెలసిన
    మధుమతి సమేత ఏకముఖి శ్రీ దత్తాత్రేయ స్వామి.
  • నిత్యం యతిలు తపస్సు చేసుకునే స్థలం యతితపోస్తలం..
    ఇప్పుడు ఎత్తిపోతల గా ప్రసిద్ధం.
  • ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ పట్టించుకుంటే, భక్తులకు కావలసిన
    కనీస అవసరాలు ఏర్పడతాయి.
  • ఇక్కడి భక్తుల్లో దాదాపు 95 శాతం పైగా బంజారా భక్తులే..
    వారి అత్యంత నిష్ఠ భక్తితో స్వామివారిని ప్రసన్నం చేసుకుంటున్నారు.

అమరావతి :
ప్రధానమైన 5 దత్త క్షేత్రాల్లో ఒకటి ఎత్తిపోతల ఏకముఖి దత్తక్షేత్రం. నాగార్జునసాగర్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఒక దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది ఈ ఆలయం.

ఉపాలయాలు :
ఇక్కడ క్షేత్ర రక్షకురాలు శ్రీ చౌడేశ్వరి మాత. అడవిలోకి అడుగుపెట్టి ప్రధాన ఆలయం చేరుకుంటుండగా మనకు అతి పెద్ద నాగుల పుట్ట దర్శనమిస్తుంది. గుట్ట కింద ఉన్న ఇక్కడి రంగనాయక స్వామి ఆలయానికి ఒకప్పుడు పలనాటి బ్రహ్మనాయుడు 30 ఎకరాల మాన్యం తన ప్రభుత్వం తరఫున రాసిచ్చినట్టు ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. ఈ గుడితో పాటు దత్త గురు ఆలయం, మధుమతి మాత ఆలయం ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నాయి.

- Advertisement -

మధుమతి మాత :
మధుమతి మాత ఆలయాలు మనకు భారత దేశం లో రెండు చోట్ల ఉన్నాయి. ఒకటి జమ్మూలో కాగా మరొకటి ఇక్కడ. స్వామి వారి హృదయంపై వెలిసిన మధుమతి అమ్మవారిని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ పర్యావరణం, ప్రాంతం, క్షేత్రం యొక్క ప్రతి అణువు శ్రీ మధుమతి తల్లి శక్తితో నిండి ఉన్నది. కృతయుగం లోని ఈ మధుమతి అమ్మవారే, కలియుగం లో అనఘా దేవి.

దత్త శిల:
దత్తుడు కూర్చొని తపస్సు చేసుకున్న ప్రదేశమే దత్త శిల. ఆ శిల పై స్వామివారి జడలు, మానవాకారాలు, ముద్రలు మనం నేటికీ చూడవచ్చు. కానీ కొన్ని భద్రత కారణాల వల్ల ఇక్కడికి చేరుకోవం అత్యంత సాహసం మరియు ప్రమాదం అని ఇక్కడి భక్తులు చెబుతున్నారు.

మూడు వాగుల సంగమం :
ఇక్కడ ప్రవహించే సరస్సులో మూడు వాగులు కలుస్తాయి. అవి చంద్రవంక, సూర్యవంక (నక్కల వాగు), తుమ్మ వాగు. ఇది ఉత్తరం నుండి దక్షిణం వైపు ప్రవహించే అతి పెద్ద వాగు. స్వామి వారి పుణ్యక్షేత్రం గుండా ప్రవహించి కృష్ణ నదిలో కలుస్తుంది. ఎంతటి అనావృష్టి సంభవించినా ఈ వాగు మాత్రం నిత్యం జీవనదిగా ఉండడం విశేషం. బ్రాహ్మీ ముహూర్తంలో ఈ వాగులో స్నానం చేయడం ద్వారా పాప కర్మలు నిర్మూలితమవుతాయి. శ్రీరామచంద్రుడు తాటకిని సంహరించినప్పుడు ఆ రాక్షసి ప్రాణాలు వదిలింది ఈ చంద్రవంక వాగు పైనే. ఈ వాగులో స్నానం చేయడం ద్వారా ఎటువంటి గ్రహ పీడనుండైనా సరే విముక్తి లభిస్తుంది. ఈ క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని చిత్తశుద్ధిగా కొలిచి ఎందరో ధన్యులు అయ్యారు. వారి వారి ధర్మబద్ధమైన కోరికలను నెరవేర్చుకుంటున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు