Saturday, December 2, 2023

నిరుద్యోగమే నామినేషన్‌ వేయించింది…!

తప్పక చదవండి

తెలంగాణలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో రోజు రోజుకి బాగా హీట్‌ పెరుగుతుంది, నువ్వా నేనా అన్నట్టు ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి, వివిధ రాజకీయ పార్టీలు వారి వారి బలాలు నిరూపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, అయితే ఈ సారి ఎన్నికల్లో ఒక నిరుద్యోగ యువతీ తన నిరు ద్యోగం వల్ల, నోటిఫికేషన్లు రావటం లేదని, నిరుద్యోగుల తరపున నిలబడాలని నిర్ణయించుకుంది, ఆమె నాగర్‌ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మర్రికెల్‌ గ్రామానికి చెందిన కర్నే శిరీష (బర్రె లక్క) కొల్లాపూర్‌ నియోజకవర్గం లో పోటి చేయటానికి నామినేషన్‌ వేసింది. సోషల్‌ మీడియాలో ఫేమ్‌: కర్నె శిరీష అలియాస్‌ బర్రె లక్క గత రెండు ఏళ్ళ క్రింద సోషల్‌ మీడియాలో ఒక వీడియో చేసింది, అది ‘‘ హాయ్‌ ఫ్రెండ్స్‌ బర్లను కాయడానికి వచ్చాను ఫ్రెండ్స్‌,ఎంత చదివినా డిగ్రీలు మేమోలు వస్తున్నాయి తప్ప ఉద్యోగాలు వస్థలేవ్‌ ఇగో మా అమ్మని అడిగి నాలుగు బర్లు కన్న రోజుకు అరు లీటర్లు పాలు వస్తాయి మూడు వందలు ఎక్కడ పోవు ఫ్రెండ్స్‌’’ అని విడియో చేస్తే అది కాస్త వైరల్‌ అయ్యి, పోలీస్‌ అధికారులు వీడియో చూసి సుమోటో గా తీసుకొని ఆమె పైన కేసు నమోదు చేశారు, అయిన కొంత మంది లీడర్స్‌ వల్ల కేసు లో పోరాడుతుంది. అప్పట్నించీ ఆమె సోషల్‌ మీడియాలో చాలా పెద్ద ఫేమ్‌ సంపాదించుకుంది. నిరుద్యోగుల తరపున పోటీ: శిరీష హైదరాబాద్‌లో ఉంటూ వివిధ పోటి పరీక్షలకు సిద్ధం అవుతుంది, నిరుద్యోగుల పడే బాధని కళ్ళారా చూసింది, ఖర్చులు వెళ్ళాక పనికి వెళ్తూ కష్టపడి చదువుతుంది,అయిన నోటిఫికేషన్‌ లు రద్దు అవ్వటం తో రాష్ట్రం లో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్తుంది, ప్రతి ఏడాది ఉద్యోగాలు ఇవ్వాలి అనీ తన గళం తో సోషల్‌ మీడియాలో దుమ్ము లేపుతుంది, సోషల్‌ మీడియాలో కూడా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆమెకి మద్దతు తెలుపుతున్నారు.
కొల్లాపూర్‌లో ఎవరెవరు పోటీ: కొల్లాపూర్‌లో అధికార పార్టీ నుండి బిరం హర్ష వర్ధన్‌ రెడ్డి, కాంగ్రెస్స్‌ నుండి సీనియర్‌ నాయకుడు జూపల్లి కృష్ణారావు, బీజేపీ నుండి ఎల్లేని సుధాకర్‌ రావు లు పోటీలో ఉన్నారు, వాళ్లంతా అధికారం, డబ్బు, ఖర్చులు పెట్టే పెద్ద రాజకీయ పార్టీల నాయకులు, వాళ్ళని డికొట్టే ప్రయత్నం మాత్రమే చేస్తున్న అని శిరీష చెప్తుంది, అక్కడ ఉన్న ప్రధాన సమస్యలు పై పోరాటం చేస్తున్న అని, తన మాటల్లో చెప్తుంది, తనకు ఎలాంటి మీడియా కానీ, ఆర్దికంగా కూడా చాలా నిరుపేద కుటుంబంలో పుట్టిన శిరీష ఒక ముందడుగు వేయడం అనెది గొప్ప విషయం గా భావించవచ్చు, ఎది ఏమైనా కొంత మేర ప్రభావం, పై రాజకీయ పార్టీల నాయకులకు ప్రభావం చూపుతుంది అని చెప్పుకోవచ్చు, మరీ కొల్లాపూర్‌ ప్రజలు ఎటు వైపు ఉం టారో చూడాలి. ఇలాంటి చదువుకున్న యువతీ యువ కులు రాజకీయం లోకి రావాలి, చాలా మంది యువ కులు మనకెందుకు లే రాజకీయాలు, అని వదిలేస్తున్నారు, కడు పేదరికంలో ఉన్న అమ్మాయి ఒక ఎమ్మెల్యే గా పోటీకి సిద్ధం అయ్యింది అంటే ప్రతి ఒక్కరూ ఇది ఓ నాందిగా చూడాలి, రాబోయే స్థానిక ఎన్నికల్లో మరియు ఎంపీ, ఎంపీటీసీ జడ్పీటీసీ లలో విస్తృతంగా యువత పోటి చేయాలని కోరుకుం దాం, భావి భారత పౌరులు గా దేశాన్ని నడిపించే బాధ్యత ఇప్పుడు యువత లోనే ఉన్నదని ప్రతి ఒక్కరికీ తెలుసు, అన్ని రాజకీయ పార్టీలు డబ్బు ఉన్న వ్యక్తులే పోటి చేయాలని ఏమి లేదు, ఆ డబ్బు పంచే పాడు సంస్కృతి నీ తరిమి కొట్టే ప్రయత్నంమే ఈ నిరుద్యోగ పోటీ, అని చెప్పవచ్చు, కాబట్టి గెలుపు ఓటమి అనేది పక్కన పెడితే ముంద డుగు అనేది చూసుకోవాలి, కాబట్టి ఎది ఏమైనా కొంత మేర యువతులకు ఈ నిరుద్యోగి చాలా ఆదర్శం అని చెప్పవచ్చు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు