Tuesday, October 15, 2024
spot_img

బెంగళూరు టీసీఎస్‌ కార్యాలయానికి బెదిరింపు కాల్‌..

తప్పక చదవండి

దేశంలోని ఐటీ దిగ్గజం టీసీఎస్‌ బెంగ ళూరు కార్యాలయానికి ‘బెదిరింపు ఫోన్‌’ కాల్‌ వచ్చింది. ఈ వార్త తెలియగానే టీసీ ఎస్‌ ఆఫీసులో పని చేస్తున్న ఉద్యోగులు భయాందోళనతో బయటకు పరుగులు తీశా రు. మంగళవారం ఉదయం ఈసంగతి తెలి యగానే సెక్యూరిటీ అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేసి, ఆఫీసు నుంచి బయటకు తరలించారు. బెంగళూ రులోని టీసీఎస్‌ ఆఫీసులో ‘బీ’ బ్లాక్‌ను లక్ష్యంగా చేసుకుని ఆగంతకులు బెదిరింపు కాల్‌ చేసినట్లు తెలు స్తోంది. ఈ సమాచారం తెలియగానే టీసీఎస్‌ భద్రతా అధికారులు.. పరప్పన అగ్రహారం పోలీసు లకు సమా చారం ఇచ్చారు. బాంబు డిస్పోజల్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ తోపాటు భారీగా పోలీసులు టీసీఎస్‌ కార్యా లయానికి తరలి వచ్చి అణువణువూ గాలించారు. టీసీఎస్‌ భవనంలో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదని బాంబు స్క్వాడ్‌ పేర్కొంది. హుబ్లీ కేంద్రంగా పని చేసిన ఒక మాజీ మహిళా ఉద్యోగి ఈ బెదిరింపు కాల్‌ చేసినట్లు పోలీసు అధికారుల దర్యాప్తులో తేలింది. ఆరు నెలల్లో టీసీఎస్‌ క్యాంపస్‌కు బెదిరింపు కాల్‌ రావడం రెండోసారి కావడం గమనార్హం. గత మే నెలలో హైదరాబాద్‌ లోని కొండాపూర్‌ ఆఫీసుకు సంస్థ మాజీ ఉద్యోగి బెదిరింపు ఫోన్‌ కాల్‌ చేశారని వార్తలొచ్చాయి. దాంతో దాదాపు 1500 మంది ఉద్యోగులను క్యాంపస్‌ నుంచి బయటకు తరలించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు