Saturday, December 2, 2023

వైవిధ్య భరితం… వామనావతారం

తప్పక చదవండి

“సంభవామి యుగే యుగే…. ధర్మ సంస్థాపనకోసం అవసరమైన సందర్భాల్లో అవతరిస్తూనే ఉంటానని శ్రీమహావిష్ణువు అభయ ప్రదానం చేశాడు. ఆ పరంపరలో ఆవిష్కారమైనది… వామనుడు లేదా త్రివిక్రముడు, హిందూ పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు | యొక్క దశావతారాలలో ఐదవ అవతారం. భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు అదితి, కశ్యపుల కుమారుడిగా శ్రీహరి వామన మూర్తిగా అవతరించాడు. దీన్ని వామన ద్వాదశిగా, విజయ ద్వాదశిగా వ్యవహరిస్తారు. సృష్టిలోని జీవావరణంలో జీవులు సూక్ష్మ రూపం నుంచి మహా భారీకాయం వరకు వైవిధ్య భరితంగా గోచరమవుతాయి. ఈ అణుత్వం, మహారూపాలు పరస్పర విరుద్ధమైనవి. కానీ, ఆ వైవిధ్యం ఆత్మ, పరమాత్మల విషయంలో లేదని వేదోక్తి, ఆత్మ అణువు కంటే సూక్ష్మమైనది. మహత్తరమైనది. అది ఎంత సూక్ష్మమైనదో, అంత స్థూల మైనదని కఠోపనిషత్తు ప్రకటించింది. వామనావతార నేపథ్యం ఇదే! దేవాసుర యుద్ధంలో ఇంద్రునితో ఓడి పోయిన బలి, రాక్షస గురువైన శుక్రాచార్యుల దయ వలన బ్రతికి, గురూపదేశంతో విశ్వజిత్యాగం చేసి బంగారు రథము, మహా శక్తివంతమైన ధనుస్సు, అక్షయ తూణీరములు, కవచము, శంఖములు పొందుతాడు. బలగర్వితుడై ఇంద్రుని మదమణి చేందుకు, రాక్షసులు సందరినీ ఒకచోట చేర్చి, యుద్ధమునకు సంసిద్ధం చేసి అమరావతిపై దండెత్తుతాడు. ఆ దుర్భర దానవ శంఖా విర్భూత ధ్వనులు నిండి. విభురేంద్ర. వధూగర్భములు పగిలి, లోపలి శిశువులు ఆవురని ఆక్రోశిం చుచుండ, దేవతలు బృహస్పతి వచనములు విని అమరావతి వీడి పారిపోయారు. దేవతల దుస్థితిని చూసి, సుర మాత అదితి, తన భర్తయైన కశ్యప బ్రహ్మను వేడుకున్నది. అంతట కశ్యపుడు అదితికి పయోభక్షణ వ్రతాన్ని ఉపదేశిస్తాడు. ఆమె ఫాల్గుణ మాసం, శు క్లపక్ష పాడ్యమి నుంచి 12 రోజులు హరి సమర్పణంగా వ్రతం చేసి భర్తను చేరగా, భగవ దంశతో, శ్రవణ ద్వాదశి (శ్రవణ నక్షత్రంతో కూడిన భాద్రపద బహుళ ద్వాదశిని శ్రవణ ద్వాదశి అంటారు), ఆనాడు శ్రోణ అభిజిత్ సంజ్ఞాత లగ్నంలో, రవి మధ్యాహ్నమున చరించు నప్పుడు, గ్రహ తారా చంద్ర భద్రస్థితిలో వామనుడు జన్మించాడు. వామనుడు పుట్టినప్పుడు శంఖ, చక్ర, గదా కమల కలిత, చతుర్భుజునిగా, విశంగ వర్ణ వస్త్రాలతో, మకర కుండల మండిత గండ భాగుడై, శ్రీ విరాజిత లో లంబ, కదంబ వనమాలిగా సమస్త అలంకారాలతో, నిఖిల జన మనోహరుడిగా అవతరించాడు. రూపాంతరంబున తన దివ్య – హరించుకొని కపట పటుని వలె ఉపనయ.. వయస్కుండై వామన బాలకుడయ్యాడు. బృహస్పతి యజ్ఞోపవీతాన్ని ఇచ్చాడు. కశ్యప మహర్షి మొలత్రాడు ప్రసాదించాడు. తల్లి అదితి కౌపీనాన్ని, భూమాత నల్లజింక చర్మాన్నీ, చంద్రుడు దండాన్నీ, గగనాధిష్ట దేవత ఛత్రాన్నీ, బ్రహ్మ కమండలువునూ, సరస్వతి అక్షమాలికనూ (జపం చేసే సమయాన జప సంఖ్యను లెక్కపెట్టుకోవడానికి సప్తర్షులు పవిత్రలను (కుశలను /దర్భలు ) వామన మూర్తికి బహూకరించారు. స్వయంగా సూర్య భగవానుడే గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించాడు. వామనుని చూసి జనులు గుజగుజలు పోవుచూ, గజిబిజి పడుచూ, కలకలములై ఎవరీ పొట్టి బాలుడు? శివుడా? హరియా? బ్రహ్మయా? సూర్యుడా? అగ్నియా? ఈ బ్రహ్మచారి ఎవరు? అని విస్మయం చెందారు. కొందరితో చర్చించుచూ కొందరితో జటలు చెప్పుచూ, గోష్ఠిలో పాల్గొనుచూ, తర్కించుచు, ముచ్చటలాడుచు. నవ్వుచూ అనేక విధంబుల అందరికీ అన్ని రూపులై వినోదించుచూ, వెడవెడ నడకలు నడుచుచూ, బుడి బుడి నొడుపులు నొడుచుచు, జిడిముడి తడబడగ, పడుగు రాజును సమీపించి “స్వస్తి ! జాగత్రయీ భావన శాసన కర్తకు! హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు, ఉదారపద వ్యవహర్తకు, మునీంద్ర స్తుత మంగళాధ్వ విధాన విహర్తకు, దానవ లోక భర్తకు స్వస్తి అని దీవించెను. బలి అతనికి సముచితాదరమిచ్చి గౌరవించి… వడుగా ! ఎవ్వరి వాడవు? నీకేమి కావలయును కోరుకొమ్మన్నాడు. “ఒంటి వాడను నేను. నాకు ఒకటి, రెండడుగుల మేర యిమ్ము.. అయినను అడుగ మంటివి కనుక అడిగితిని, దాత పెంపు సొంపు తలపవలెను గదా! కావున నాకు మూడడుగుల నేలనిమ్ము, చాలు | అని మాయా వడుగు పలికెను. ఆ వామనుడిని విష్ణువుగా గుర్తించిన శుక్రుడు బలి చక్రవర్తిని వారించెను. అది పాపము కాదు. అని శుక్రాచార్యుడు వివరించెను. దానికి బలి చక్రవర్తి. … కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతిం బొందరే వారేరీ? సిరి మూట గట్టుకొని పోవంజాలిరే? భూమిపై పేరైనదే! శిబి లాంటి దాతల పేరు ఈనాటికీ స్థిరములైనవి. కదా! భార్గవా! అని పలుకుతూ తన మాట ను తోసి పుచ్చిన రాజును పదభ్రష్టునివి గమ్మని శుక్రాచార్యుడు శపించాడు. అయినను బలిచక్రవర్తి హరి చరణ ములు కడిగి, “త్రిపాద ధరిణిం దాస్యామి” అనుచు నీటిధార విడిచాడు. ఆ కలశములో సూక్ష్మకీటక రూపమున చేరి శుక్రాచార్యుడు నీటిధారను ఆప బోయాడు. అప్పుడు హరి కుశాగ్రముతో కలశ రంధ్రమును పొడువగా కన్ను పోటుకొని శుక్రాచార్యుడు ఏక వేతుడయ్యెను
“”పట్టి నేర్చుకునెనో, పుట్టక నేర్చెనో.. ఈ పొట్టి పడుగునకీ చిట్టి బుద్ధులెట్లబ్బెనో, ఈతని పొట్టనిండా అన్నీ భూములే… అని నవ్వుతూ మూడడుగుల నేలను బలి పడుగుకు దానమిచ్చెను. ఒక పాదంబులో భూమిని కప్పి, దేవ లోకమును రెండవ పాదమున నిరోధించి, జగములెల్ల దాటి చనిన త్రివిక్రముడు మరల వామనుడై బలి నవలోకించి నా మూడవ పాదమునకు స్థలము జూపమన్నాడు. అప్పుడు బలి వినయముతో నీ తృతీయ పాదమును నా శిరమున ఉంచమని వేడుకొనగా సమ్మతించిన హరి బలిని ఆశీర్వదించి, ప్రహ్లాదునితో సుతల లోకమునకు పంపి, తానే ఆలోకమునకు ద్వారపాలకు డాయెను. బలి నడిగి సంపాదించిన లోకములను తన సోదరుడైన ఇంద్రున కిచ్చి సంతోషపరిచాడు శ్రీహరి. “ఛలయని విక్రమణే బలి మద్భుత వామన పదనఖ నీరజ నతజన పావన కేశవ ధృత వామన రూప జయ జగదీశ హరే” జయదేవుని దశావతార స్తోత్రము ఈ శ్రీ వామన వతార గాథను విన్న వారు, చదివిన వారు సకల శు భాలను పొందుతారు. దైవారాధన సమయంలో ఎవరైతే త్రివిక్రమ పరాక్రమాన్ని స్మరించు కుంటారో వారికి నిత్య సౌఖ్యాలు. కలుగు తాయని ప్రతీతి. వామన కంచిలో అద్భుతమైన వామన అవతారం గుడి ఉంది. మిత్రానంద పురము వామన మూర్తి దేవాలయం, చెరుపు, త్రిస్సూర్, కేరళ త్రికక్కర (ఫ్రికక్కర ఆలయం) కొచ్చిన్, కేరళ కాంచీపురం సమీపంలోని కామాక్షి ఆలయం, ఖజురహోూ, మధ్యప్రదేశ్, ఉలగ లంఠ పెరుమాళ్ దేవాలయం తిరుకొయిలూర్, విల్లుపురము జిల్లా, తమిళనాడు లలో ఆలయాలు ఉన్నాయి.
రామకిష్టయ్య సంగనభట్ల

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు