Friday, July 19, 2024

తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాలి

తప్పక చదవండి
  • అసెంబ్లీలో సీఎంను కోరిన ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌
    వికారాబాద్‌ : వికారాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలు, తండాలను గ్రామ పంచాయితీలు చేయాలని తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశంలో భాగంగా డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ సీఎం కేసీఆర్‌ ను కోరారు.అందులో బాగంగా బంట్వారం మండలం రొంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మంగ్రాస్‌ పల్లి, కోట్‌ పల్లి మండలం పరిధిలోని కంకణాలపల్లి గ్రామపంచాయతీ నుండి కంకణాలపల్లి తండా, బార్వాద్‌ తాండ గ్రామపంచాయతి నుండి మద్గుల్‌ తాండా, నాగ్‌ సాన్‌ పల్లి గ్రామపంచాయతీ నుండి నాగ్‌ సాన్‌ పల్లి తండా, మోమిన్‌ పేట్‌ మండలం కోల్కుంద గ్రామపంచాయతీ నుండి రావులపల్లి,మర్పల్లి,మండల పరిధిలోని ఘనపూర్‌ గ్రామపంచాయతీ నుండి రాంపూర్‌, పెద్దాపూర్‌ గ్రామపంచాయతీ నుండి కూడుగుంటా, ధారూర్‌ మండలం పరిధిలోని ధారూర్‌ గ్రామపంచాయతీ నుండి లక్ష్మీ నగర్‌ తండా, తిమ్మనగర్‌, మైలారం గ్రామపంచాయతీ నుండి కొత్త తండా, స్టేషన్‌ ధారూర్‌ గ్రామపంచాయతి నుండి డీకే తండా, కేరెల్లి గ్రామపంచాయతీ నుండి కొండాపూర్‌ కుర్దు గ్రామాలను అదేవిధంగా తండాలను గ్రామపంచాయతీలుగా చేయాలని, అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ని ఎమ్మెల్యే ఆనంద్‌ కోరారు. మా గ్రామాలను పంచాయతీలు చేయాలని ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించడం హర్షనీయమని ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు