Wednesday, September 11, 2024
spot_img

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారికి ప్రత్యేక పూజలు..

తప్పక చదవండి
  • త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి

యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి దర్శించుకున్నారు. సోమవారం ఉదయం కుటుంబ సమేతంగా యాదాద్రికి చేరుకున్న ఇంద్రసేనారెడ్డి.. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వారిని వేదపండితులు ఆశీర్వదించగా, ఆలయ ఈవో గీతా.. తీర్థప్రసాదాలు అందజేశారు.బీజేపీ సీనియర్‌ నేత అయిన ఇంద్రసేనా రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీ నుంచి 1983, 1985, 1999లో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అక్టోబర్‌ 18న త్రిపుర గవర్నర్‌గా నియమితులయ్యారు. అదే నెల 26న గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు