న్యూయార్క్ : అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. న్యూ హంప్‌షైర్ లోని కాంకర్డ్ నగరంలో ఉన్న సైకియాట్రిక్ ఆసుపత్రిలోకి ఓ దుండగుడు ప్రవేశించి కాల్పులకు తెగబడ్డాడు. అక్కడి కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగింటికి ఈ ఘటన చోటుచే సుకుంది. ఈ దాడిలో పలువురికి బుల్లెట్ గాయాలు అయినట్లు సమాచారం. పోలీసుల కాల్పుల్లో అనుమానిత వ్యక్తి మృతిచెందినట్లు అధికారులు వెల్లడిరచారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ ధ్రువీకరించారు. కాల్పులు జరిగిన ఆసుపత్రిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎంత మం ది బాధితులున్నారో, వారి ఆరోగ్య స్థితి ఎలా ఉందో సరైన సమాచారం తెలియడం లేదని పోలీసులు చెప్పారు. ఆసుపత్రికి సమీపంలో దుండగుడు వినియోగించిన అనుమానిత వాహనం గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు.