Wednesday, July 24, 2024

రోటరీ క్లబ్‌ దుర్మార్గానికి బలౌతున్న ఫిల్మ్‌ నగర్‌ పాఠశాల

తప్పక చదవండి
  • విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారం చేస్తున్న అవినీతి రాక్షసులు..
  • ఫిల్మ్‌ నగర్‌ ఉన్నత పాఠశాలపై కన్నేసిన రోటరీ క్లబ్‌ యాజమాన్యం..
  • స్కూల్‌ని అడ్డుపెట్టుకుని విదేశీ నిధులు కొల్లగొట్టాలనే ఆలోచన..
  • షిఫ్ట్‌ సిస్టంలో నడిచే స్కూల్‌ని జనరల్‌ సిస్టంగా మార్చిన దౌర్భాగ్యం..
  • అధికారులను మభ్యపెట్టి అరాచకం సృష్టిస్తున్న వైనం..
  • ప్రమాదభరితంగా మారిన పాఠశాల పరిసరాలు..
  • విద్యాకుసుమాలను నలిపేస్తున్న దుర్మార్గులు..
  • రాష్ట్రంలోనే మూడో అతిపెద్ద ఉన్నత పాఠశాలకు పట్టిన దుర్గతి..
  • తల్లి లాంటి విద్యాశాఖ మంత్రి సబిత దృష్టిపెట్టి కన్నబిడ్డల్లాంటి స్టూడెంట్స్‌ని కాపాడాలని స్థానికుల వేడుకోలు..

హైదరాబాద్‌ : సరస్వతి నిలయానికి మారుపేరుగా చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్రం.. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల మనుగడకు ప్రశ్నార్థకంగా మారింది.. రాష్ట్రంలో మూడో అతిపెద్ద ఉన్నత పాఠశాలగా ఖ్యాతి గడిరచి, 10వ తరగతి పరీక్షలతో అధిక ఉత్తీర్ణతను సాధిస్తూ.. అందరి మెప్పు పొందుతూ.. ఎందరో నిరుపేద విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం లో తన వంతు కృషిచేస్తూ 1800 మంది విద్యార్థులతో (ఉన్నత పాఠశాల 1200, ప్రాథమిక పాఠశాల 600) దిగ్విజయంగా నడుస్తున్న పాఠశాల హైదరాబాద్‌ నగరంలో ప్రఖ్యాతి గాంచిన ఫిలిం నగర్‌ లో నెలకొని ఉన్న ‘‘ ఫిలింనగర్‌ ఉన్నత పాఠశాల ‘‘ ఈ స్కూల్‌ ని ‘‘ రౌండ్‌ టేబుల్‌ స్కూల్‌ ‘‘ అంటూ స్థానికులు ఎంతో ప్రేమగా, గౌరవంగా పిలుచుకుంటారు.. స్థానికుల విన్నపం మేరకు 2007లో ఈ పాఠశాలను షిఫ్ట్‌ సిస్టమ్‌ లో ఉదయం 7:40 ని.ల నుండి మధ్యాహ్నం 12:30 ని.ల వరకు ప్రాథమిక పాఠశాల.. మధ్యాహ్నం 12:30 ని.ల నుండి సాయంత్రం 5:00 ల వరకు ఉన్నత పాఠశాలను నడిపిస్తున్నారు.. కాగా అప్పటి కలెక్టర్‌ పరిస్థితులను అవగతము చేసుకొని స్థలం కొరత, సరిjైున భవనాలు అందుబాటులో లేనందువ, క్రీడా ప్రాంగణం లభ్యతలో లేని కారణంగా ఈ షిఫ్ట్‌ విధానాన్ని శాస్త్రీయబద్ధంగా ప్రారంభించారు. స్థానికుల అవసరాల దృష్ట్యా ఈ ప్రక్రియ దిగ్విజయం అయ్యింది. ఇలాంటి విజయవంతమైన బంగారు బాతు లాంటి పాఠశాలపై.. స్థానిక రోటరీ క్లబ్‌ వారి కన్ను పడిరది. ఇలాంటి ఉన్నతమైన పాఠశాలపై స్థానిక రోటరీ క్లబ్‌ వారు ఎలాగైనా ఆధిపత్యం సాధించి, విదేశీ నిధులు కొల్ల గొట్టాలనే దురుద్దేశ్యంతో పాఠశాల కార్యవర్గం, నిజాయితీపరులైన ఉపాధ్యాయు లపై బురద చల్లడం ప్రారంభించింది. అధికారులను మభ్యపెట్టి పెడత్రోవ పట్టించింది. తమకు అడ్డుపడుతున్న ఉపాధ్యాయులను ఈ పాఠశాల నుండి తరిమివేయాలనే ఉద్దేశ్యంతో.. అధికారులపై ఒత్తిడి తెచ్చి షిఫ్ట్‌ సిస్టమ్‌ నుండి జనరల్‌ సిస్టంగా మార్చి ఉపాధ్యాయులను, విద్యార్థులను కష్టాలలోకి నెట్టింది. పాఠశాల ఆవరణలో నిత్యం మురుగు నీటి దుర్గంధం వెదజల్లుతూ ఉంటుంది.. ఒక మోస్తరు వాన పడితే పాఠశాలలో మొదటి భవన సముదాయం నీటితో నిండిపోతుంది. ఇంతలో అధికారుల కళ్ళు కప్పడానికి మూడవ ఫ్లోర్‌ నిర్మాణాన్ని రోటరీక్లబ్‌ వారు ప్రారంభించారు. గత నెలలో ఒక కూలి మూడవ అంతస్తు నుండి జారిపడి మరణించాడు. ఇటీవల ఒక అమ్మాయి కనురెప్ప పాటులో ఇనుప రాడ్డు ప్రమాదం నుండి తప్పించుకొని బయట పడిరది. ఇరుకైన ఆవరణలో మురుగు నీటితో నిండి ఉన్న పెద్ద పెద్ద గోతులు, అందులో ఇనుపు రాడ్లు, టాయిలెట్‌ కు వెళ్లే మార్గంలో కూడా ఇనుప గజాలు , దారి కనబడని పరిస్థితి. 1800 పిల్లల రాకపోకలకు ఒకటే ద్వారం ఉండటం గమనార్హం.. అసెంబ్లీ ఉపసంహరణకు సుమారుగా 45ని.లు, బ్రేక్స్‌.. సుమారు 30 ని.లు.. మధ్యాహ్నం భోజనానికి 1:30 నిమిషాలు.. స్కూల్‌ ముగింపుకు 30 నిమిషాలు. దరిదాపుగా పాఠశాల పిల్లలు సర్దుకుపోవడానికి సరిపోతుంది. ఇక మిగిలిన నాలుగు గంటలలో విపరీతమైన ధ్వని కాలుష్యం. పిల్లల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయులు లేకపోవడం మరో సమస్య.. విద్యార్థుల అల్లరి.. కాగా ధ్వని కాలుష్యం కారణంగా ఉపాధ్యాయులు సరిగా పాఠాలు చెప్పలేక నిస్సహాయంగా ఉన్నారు. దీర్ఘకాలిక రోగాలకు కొందరు ఉపాధ్యాయులు గురి అవుతున్నారు. ప్రమాదకరమైన, అస్తవ్య స్థంగా ఉన్న పరిస్థితుల కారణంగా పడిపో తామో..? లేక ఏ ఇనుపరాడ్డు కు బలి అయిపోతామో..? లేక ఇరుకైన మార్గంలో పడి నలిగిపోతామేమో..? అన్న భయం తో టీచర్లు భయాందోళనకు గురి అవుతు న్నారు. విజయవంతంగా నడుస్తు న్న పాఠశాల రోటరీ క్లబ్‌ వారి స్వార్థానికి బలై నిస్సహాయ స్థితిలో.. విద్యార్థులకు విద్యా ప్రమాణాలు అందించలేక ఉపాధ్యాయులు ఆవేదనకు గురి అవుతున్నా రు. ఫిల్మ్‌ నగర్‌ పాఠశాల విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ వికృత ఆనందం పొందుతున్న రోటరీ క్లబ్‌ వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసి, పేద విద్యార్థులను, ఉపాధ్యాయులకు.. ముఖ్యంగా గవర్నమెంట్‌ వ్యవస్థను, పాఠశాల విద్యాశాఖ గౌరవాన్ని కాపాడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రిని ఫిల్మ్‌ నగర్‌ బస్తివాసులు, విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీళ్లతో ప్రాధేయపడుతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు