Tuesday, October 3, 2023

పవన్‌కల్యాణ్‌ సంచనల ప్రకటన

తప్పక చదవండి
  • వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన కలిసి పనిచేస్తాయి
  • జగన్‌ అరాచకాలను డీజీపీ, చీప్‌ సెక్రటరీ, అధికారులు దృష్టిలో పెట్టుకోవాలని సూచన : పవన్‌కల్యాణ్‌

రాజమండ్రి : రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో ములాఖత్‌ అనంతరం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంచలన ప్రకటన చేశారు. ‘‘ ఈ రోజే నిర్ణయం తీసుకున్నాను. వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి వెళ్తాయి’’ అని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ,జనసేన కలిసి వెళ్ళాలనేది తన కోరికని పవన్‌ అన్నారు. వైసీపీ అరాచకాలను అడ్డుకోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే కుదరదన్నారు. 151 సీట్లు దౌర్జన్యం చేసే ఆర్థిక నేరస్థుడైన జగన్‌కి ఇచ్చామని అన్నారు. వైసీపీకి అనుకూలంగా ఉండే క్రిమినల్స్‌ను హెచ్చరిస్తున్నానని, వైసీపీ క్రిమినల్స్‌ను వదలబోమన్నారు. జగన్‌ అరాచకాలను డీజీపీ, చీప్‌ సెక్రటరీ, అధికారులు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రికే ఈ పరిస్థితి వస్తే అధికారుల పరిస్థితి తెలుసుకొండని హితబోధ చేశారు. ‘‘ జగన్‌ నీకు ఆరు నెలలే. యుద్దమే కావాలంటే యుద్దమే ఇస్తాం. ఖచ్చితంగా ఏ ఒక్కర్ని వదలం. మాజీ ముఖ్యమంత్రినే కూర్చోబెడితే విూ పరిస్థితే అర్థం చేసుకోండి’’ అని పవన్‌ హెచ్చారు. ‘‘ అరాచక పాలన చూస్తున్నాం. పాలసీలు పరంగా భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. 2014 లో జనసేన ప్రారంభించినప్పుడు మోదీకి నేను మద్దతు తెలిపాను. నేను మోదికి మద్దతు తెలిపినప్పుడు నన్ను చాలా మంది తిట్టారు’’ అని పవన్‌ గుర్తుచేసుకున్నారు. ములాఖత్‌ అనంతరం పవన్‌ కల్యాణ్‌ విూడియాతో మాట్లాడారు. చట్టవిరుద్ధంగా కేసులు పెట్టి చంద్రబాబును రిమాండ్‌కు పంపించడం చాలా బాధకరమని వ్యాఖ్యానించారు. అందుకే సంఫీుభావం ప్రకటించడానికి జైలుకు వచ్చానని పవన్‌ అన్నారు. జగన్‌ చేసేవి అన్నీ రాజ్యాంగ ఉల్లంఘన పనులేనని విమర్శించారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని, అందులో భాగమే చంద్రబాబు అరెస్ట్‌ అని పవన్‌ వ్యాఖ్యానించారు. లక్షలాది టర్నోవర్‌ను తీసుకొచ్చే హైటెక్‌ సిటీని చంద్రబాబు తెచ్చారని గుర్తుచేశారు. 2020 విజన్‌తో చంద్రబాబు ముందుకెళ్లారని అన్నారు. చంద్రబాబు శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు. చంద్రబాబుతో అభిప్రాయ బేధాలు పాలసీ పరమైనవని, స్పెషల్‌ స్టేటస్‌ తీసుకురాలేదనే చంద్రబాబుతో విభేదించానని అన్నారు. అవినీతి బురదలో కూరుకుపోయిన వైసీపీ ప్రభుత్వం ఆ బుదరను అందరిపైనా చల్లాలని ప్రయత్నిస్తోందని వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. ఈడీ విచారణ లేకుండా చంద్రబాబుని జైలులో ఎలా కూర్చోబెడతారని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. చంద్రబాబుని జైలులో కూర్చోబెట్టడం రాష్ట్రానికి మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక నేరాల్లో కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి జగన్‌ అని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. ఇచ్చిన హావిూలను నెరవేర్చకుండా అడ్డగోలుగా జగన్‌ దోచుకుంటున్నాడని ధ్వజమెత్తారు. తనలాంటోడీతీ సరిహద్దులు దాటకుండా ఆపేస్తారా? అని నిలదీశారు. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వబోనని పునరుద్ఘాటించారు. వివేక హత్య కేసులో అన్ని వేళ్ళు విూవైపు చూపిస్తున్నాయని అన్నారు. గుజరాత్‌లో పట్టుబడిన హెరాయిన్‌ కేసుపై ఏపీలో మూలాలున్నా పోలీసులు ఎవర్ని పట్టుకోలేదని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. చంద్రబాబుపై కేసు రాజకీయ ప్రతీకారమన్నారు. ఈ ములాఖత్‌ చాలా కీలకమైనదన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు