- యాచించే స్థాయి కాదు శాసించే స్థాయికి ఎదగాలి
- బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేద్దాం
- బహుజనుల ఆశాజ్యోతి కాన్షిరామ్ ఆశయాలను బ్రతికిద్దాం
- ధర్మ సమాజ్ పార్టీని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలి
- పాదయాత్ర ద్వారా ఆలోచింపజేసిన విశారదన్ మహరాజ్
హైదరాబాద్ : ప్రజా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా ఆయా సామాజిక వర్గాలు ఎంత శాతం ఉంటే వాళ్లకు అంతమేరా చట్ట సభల్లో ప్రాతినిధ్యం దక్కాలి, అప్పుడే వాళ్లు యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి ఎదుగుతారు అదే నిజమైన సామాజిక న్యాయం. కానీ తెలంగాణలో బహుజనులకు నిజమైన సామాజిక న్యాయం అందడం లేదు స్వపరి పాలన అంటే ఒక ఆధిపత్య వర్గం పోయి ఇంకో ఆధిపత్య వర్గం రావడం కాదు దీనికి విరుద్ధంగా రాష్ట్రంలో సుమారు 90% మంది ఉన్న బహుజనులంతా ఏకమై బహుజన సమాజం కోసం ధర్మ సమాజ్ పార్టీని బలపరచాలని అన్నారు. భారతదేశ జనాభాలో 90 శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం దక్కాలనే కాన్సిరాం ఆశయాలకు అనుగుణంగా మనం పని చేయాలని డాక్టర్ విశారదన్ అన్నారు. రాష్ట్రం వస్తే స్వరాష్ట్రంలో మనకు గౌరవం దక్కుతుందని చిన్న చిన్న సామాజిక వర్గాలు కూడా ఏకమై జేఏసీలుగా ఏర్పడి ఉద్యమించాయి. కానీ స్వరాష్ట్రంలో వారికి పాలనలో వాట దక్కడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా బహుజన సామాజిక వర్గం 90 శాతం ఉంది ఈ లెక్కన మన ఓటు మనం వేసుకుంటే మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం ఆదిశగా ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని రాష్ట్రాన్ని దోచుకుంటున్న దొంగలను తరిమికొట్టాలంటే ధర్మ సమాజ్ పార్టీ అవసరం తెలంగాణ రాష్ట్రానికి ఉన్నదని. దానికి బహుజనులంతా సహకరించాలని పిలుపునిచ్చారు.
బహుజనులకు రాజ్యాధికారం లక్ష్యంగా పని చేద్దాం
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాన్సిరాం పోరాట మార్గాన్ని ఎంచుకొని సామాజిక సాంస్కృతిక ఉద్యమాన్ని చేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ లకు రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజనుల రాజ్య స్థాపన దిశగా విశారదన్ మహారాజు ధర్మ సమాజ్ పార్టీ ద్వారా పోరాటం చేస్తున్నారు. పదివేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్క బహుజన బిడ్డను ఆలోచింపజేశాడు మహారాజ్ అంటే ఏలన చేయడం కాదు ప్రతి ఒక్క బహుజన బిడ్డ కూడా మహారాజ అంటూ కులాల వారిగా ఆయన తెలియజేశారు. పేరు పక్కన ఉన్నత స్థానాన్ని పెట్టుకోవాలంటూ సూచించారు. సాపలు, అల్లేవారు (పిచ్చకుంట్ల కులం) వంశరాజులని, చేపలు పట్టేది ముదిరాజులని, గొల్లవారు, యాదవ రాజులని, ముస్లిం దూదేకుల, కులం నవాబులని, అడవుల్లో జీవించే కోయవారు, కోయరాజులని బటులు ఉండేవారు, బట్టురాజులని లంబాడ బిడ్డలు నాయక్ (నాయకులని) బహుజన బిడ్డలు రాజులమని పెట్టుకోవద్దు రాజుగా ఎదగొద్దు అనే అగ్రవర్గాల అహంకారానికి దీటుగా సమాధానం ఓటు ద్వారానే అని బహుజన కులాలను ఆలోచింపజేశారు. (హమారా ఓటు అమరా సర్కార్) మన ఓటు మన ప్రభుత్వం అనే నినాదంతో పాదయాత్ర లో ఆయన ప్రజలకు తెలియజేశారు. అణగారిన కులాల కోసం 20 ఏండ్లు ఎన్నో ఉద్యమాలు చేసి బహుజన వర్గాలకు రాజ్యాధికారం ఎలా రావాలో దానికి ఏం చేయాలో నేర్పిన గురువు కాన్షిరామ్ అని ఆయన శిష్యరికం అలవర్చుకున్న విశారదన్ మహారాజ్ నేడు ఆయన స్ఫూర్తిగా గత 13 ఏళ్లుగా బహుజన, సాంస్కృతిక ఉద్యమాలను చేస్తూ బహుజన వర్గాల పక్షపాతిగా రాజ్యాధికారమే లక్ష్యంగా కొనసాగుతున్నామని అందుకు ప్రతి ఒక్క బహుజన బిడ్డ పోరాటంలో మాకు అండగా నిలవాలని ఆయన కోరారు.
ధర్మసమాజ్ పార్టీని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాల్సింది బహుజనులే
తెలంగాణ ఎన్నికల రణరంగంలో 119 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 18 మంది అభ్యర్థులు స్క్రూట్‌నిలో అనర్హులుగా ప్రకటించగా మిగిలిన 101 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగారు. ధర్మ సమాజ్ పార్టీ టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు. రాష్ట్రంలో 90 శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల ఆత్మగౌరవానికి 10 శాతం ఉన్న అగ్రవర్గాల ఆధిపత్యానికి జరుగుతున్న యుద్ధంలో బహుజన బిడ్డలను ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో విజయం సాధించి సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృ తిక, పరంగా విప్లవాత్మక, గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాను. బహుజనుల కు రాజ్యాధికారాన్ని దగ్గర చేయాలనేదే నా ఆకాంక్ష అని అన్నారు. బహుజనులారా ఇంకెన్నాళ్లు పాలితు లుగా ఉందాం కాన్సిరాం స్ఫూర్తితో రాజ్యాధికారాన్ని సాధించుకుందాం! అంటూ పిలుపునిచ్చారు.