Friday, July 12, 2024

కొనగాసుతున్న సొరంగ సహాయక చర్యలు

తప్పక చదవండి

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో సొరంగం కూలిపోయింది. అందులో చిక్కు కున్న 40 మంది కార్మికులను రక్షించేందుకు ఆరు రోజుల నుంచి సహాయక చర్యలు కొనసాగుతు న్నాయి. ఈ నెల 12న సమీపంలోని కొండచరియలు సొరంగంపై పడటంతో అది కూలిపోయింది. దీంతో సొరంగంలో పనిచేస్తున్న 40 మంది కార్మికులు అందులోనే చిక్కుకున్నారు. అనంతరం కార్మి కులకు ఆక్సిజన్‌ సరఫరా కూడా నిలిచిపోయింది. సిల్క్యారా నుంచి సొరంగం వైపు 200 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. 60 మీటర్ల మేర పేరుకుపోయి న శిథిలాలలో పైపును ఏర్పాటు చేయడానికి శుక్రవారం మధ్యాహ్నం నాటికి 24 మీటర్ల వరకు త వ్వారు సహాయక సిబ్బంది. సొరంగంలోని శిథిలాలను తవ్వి పైపును అమర్చి, దాని గుండా కార్మికు లు బయటకు రావాలనేది ప్లాన్‌. .60 మీటర్ల మేర శిథిలాలను తొలగించి, పైపులు వేయడానికి డ్రిల్‌ వేయాల్సి వచ్చింది. మంగళవారం లేదా బుధవారం రాత్రికి రెస్క్యూ ఆపరేషన్‌ పూర్తవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే, కొన్ని అడ్డంకుల కారణంగా డ్రిల్లింగ్‌ పనుల్లో వేగం ఆశించినంతగా జరగడం లేదని, దీంతో వారిని చేరుకొనే పక్రియ క్లిష్టతరం అవుతోందని ఉత్త రాఖండ్‌ పోలీసు చీఫ్‌ అశోక్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం రాత్రి సైనిక విమానం ద్వారా కొన్ని కొత్త పరికరాలను తీసుకువచ్చారు.

ఈ డ్రిల్‌ మెషీన్‌ మూడు భాగాలుగా ఉంది. వాటిని ప్రమాద స్థలంలో అమర్చారు. కొత్త డ్రిల్‌ పరికరం రెస్క్యూ పక్రియను వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు. మెటల్‌ పైపు (900 మి.మీ. వ్యాసం) అమర్చడానికి తగినంత వెడల్పుతో కార్మికులు రంధ్రాన్ని డ్రిల్లింగ్‌ చే స్తున్నారు. చిక్కుకున్న మనుషులు పాకుతూ రావడానికి దానిని ఏర్పాటు చేస్తున్నారు. రెస్క్యూ ఆ పరేషన్‌కు అంతరాయం లేకుండా బ్యాకప్‌గా శనివారం మధ్యప్రదేశ్‌ నుంచి మరొక యంత్రాన్ని తీ సుకురానున్నారు. సొరంగం లోపల చాలా స్థలం ఉంది. దాని గోడలు 400 మీటర్ల వెడల్పుతో చాలా మందంగా ఉన్నాయి. లోపల రెండు కిలోమీటర్ల వరకు చాలా పెద్ద లైట్లు ఉన్నాయి, గాలి కూడా ఉంది. కాబట్టి సొరంగం లోపల ఏ సమస్యా ఉండదు, వారికి తగినంత గాలిని పంపుతున్నారు. ఇక, సొ రంగంలో చిక్కుకున్న వారిలో ఎక్కువ మంది వలస కార్మికులే. 40 మందిలో 15 మంది జార్ఖం డ్‌, 8 మంది ఉత్తరప్రదేశ్‌, ఐదుగురు ఒడిశా, నలుగురు బిహార్‌, ముగ్గురు బెంగాల్‌, ఇద్దరు అస్సాం, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ల నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు అధికారులు తెలిపారు .రెస్క్యూ సి బ్బందికి సహాయం చేసేందుకు జార్ఖండ్‌ ప్రభుత్వం ముగ్గురు సభ్యుల బృందాన్ని పంపింది. ఆదివా రం ఉదయం సొరంగం పైకప్పు నుంచి శిథిలాలు పడటం గమనించిన కొద్దిమంది కార్మికులలో 21 ఏళ్ల శర్మన్‌ బాత్రా ఒకరు.ఆయనతో పాటు ఆనంద్‌ తుడు (24), సంతోష్‌ పండిట్‌ (40), పెమ్‌ యాదవ్‌ (29)లు సొరంగం కూలిపోవడానికి ముందే తప్పించుకోగలిగారు. వారిప్పుడు తమ సహచరుల కోసం బయట వేచి ఉన్నారు. చిక్కుకున్న వ్యక్తులతో ఆదివారం రాత్రి వాకీటాకీల ద్వారా కనెక్టివిటీ ఏర్పాటు చేశారు. టన్నెల్‌లో నీటి సరఫరాకు గతంలోనే పైప్‌లైన్‌ వేశారు. ఇపుడు సొరం గంలో చిక్కుకున్న వారికి ఆక్సిజన్‌, ఆహారం (డ్రై ఫ్రూట్స్‌, బాదం) నీరు దీని ద్వారానే సరఫరా చేస్తున్నారు. ఆహార పదార్థాలు వారికి తగినంత కేలరీలను అందిస్తున్నాయి, ఇది వారికి 9 రోజుల వరకు సహాయపడుతుంది. కార్మికులకు జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులకు సంబంధించిన మందు లను కూడా పైపుల ద్వారా పంపినట్లు అధికారులు చెబుతున్నారు. కొంతమంది కార్మికుల కుటుంబ సభ్యులు తమ వారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు.అయితే టన్నెల్‌ సమీపంలో ఆరు పడకల వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు, సమీపంలోని ఆసుపత్రులు కూడా సిద్ధమైనట్లు రిపోర్టులు ఉన్నాయి. ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా, దండల్‌గావ్‌లను కలుపుతూ ఈ సొరంగం నిర్మిస్తున్నారు. ఉత్తరా ఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కనెక్టివిటీని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 12 వేల కోట్లతో చేపట్టిన హైవే ప్రాజెక్ట్‌లో ఉత్తరకాశీ జిల్లాలోని సొరంగం భాగం ఒకటి. ఈ ప్రాంతం హిందు వుల పవిత్ర స్థలాలకు ప్రసిద్ధి, హిమాలయ శిఖరాలు, హిమానీ నదాలు ఉన్న రాష్ట్రం. ఈ 4.5 కి.మీ. సొరంగం హిమాలయాల్లోని యమునోత్రికి కనెక్టివిటీని అందించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఉత్తరకాశీ, యమునోత్రి పట్టణాల మధ్య ప్రయాణ దూరాన్ని 26 కి.మీ (16 మైళ్లు) మేర తగ్గించనుం ది. బద్రీనాథ్‌ ఆలయానికి చేరుకోవడానికి గంగోత్రి, కేదార్‌నాథ్‌ గుండా సాగే చార్‌ధామ్‌ యాత్రకు యమునోత్రి ప్రారంభ స్థానం కావడంతో ప్రతి సంవత్సరం వేలాదిమంది భక్తులు అక్కడికి చేరుకుంటారు.సొరంగం నిర్మాణానికి 2018లో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. అయితే పర్యావరణ నిపుణులు దాని నిర్మాణాన్ని వ్యతిరేకించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు