Saturday, December 2, 2023

ఊకచెట్టు వాగుపై బ్రిడ్జి నిర్మాణంతో తొలగిన అడ్డంకులు

తప్పక చదవండి
  • నూతన బ్రిడ్జి పై వేలాదిగా తరలివెళ్తున్న కురుమూర్తి స్వామి భక్తులు
  • ఎన్నో ఏళ్ల కలను నిజం చేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
  • ఎమ్మెల్యే ఆలన్నకు రుణపడి ఉన్నామంటున్న ప్రజలు
  • దేవరకద్ర నియోజకవర్గం గొప్పగా అభివృద్ధి చేశా..
  • మరోమారు గులాబీ జెండాను ఎగురవేసేందుకు ప్రజలు సిద్ధం
  • మళ్ళీ కేసీఆర్ ను గెలిపించుకుందాం : ఆల వెంకటేశ్వర్ రెడ్డి

చిన్న చింతకుంట : మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని అమ్మాపూర్ కొండల్లో కొలువుదీరిన కురుమూర్తి స్వామిని దర్శించుకునేందుకు,ప్రతి ఏటా జరిగే జాతర ఉత్సవాలకు, తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి రావడం తెలిసిందే. కానీ, చిన్న చింతకుంట పరిసర గ్రామాల ప్రజలు స్వామి వారికి కూతవేటు దూరంలో ఉన్నపటికీ ఆయన దర్శనానికి వెళ్లాలంటే, తీవ్ర ఇబ్బందులు ఎదురుకునేవారు. వాగులో వరద నీరు ప్రవహిస్తున్న క్రమంలో, అటువైపు వెళ్లాలంటే కాలినడకన కూడా సాధ్యమయ్యేది కాదు. అలాంటి దుస్థిని గమనించిన మన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, సీఎం కేసీఆర్ తో మాట్లాడి, రూ.41 కోట్ల నిధులతో ఒకే సంవత్సరంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం గర్వించదగ్గ విషయం. నేడు జరిగే స్వామివారి ఉద్దాల ఉత్సవానికి ఎద్దుల బండ్లు, బైక్ లు, కార్లల్లో భక్తులు కేరింతలు కొడుతూ, బ్రిడ్జి పై ప్రయాణించడం చూస్తే వారి ఆనందానికి అవధులు
లేకుండా పోయాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఆల మాట్లాడుతూ అజ్జకొలు గ్రామంలో రూ. 35 కోట్లతో 58 లక్షల నిధులతో గ్రామంలో అభివృద్ధి సంక్షేమం జరిగింది అని అన్నారు. గ్రామంలో మన ఊరు మన బడి పాఠశాల మరియు సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుకున్నాం. మళ్లీ కేసీఆరే సీఎంగా కావాలి. అప్పుడే అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో, దేవరకద్ర నియోజకవర్గం గొప్పగా అభివృద్ధి చేశామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పనులు చేశాము. ప్రతి ఇంటికీ తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రజలు ఓటుతో ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దేవరకద్ర లో మరోమారు గులాబీ జెండాను ఎగురవేసేందుకు ప్రజలు సిద్ధం కావాలని కోరారు. తెలంగాణకు సీఎం కేసీఆర్‌ శ్రీరామరక్ష అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆల ప్రతి ఒక్కరిని కలిసి ఆప్యాయంగా పలకరించారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు