- యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలి : పీడీఎస్యూ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్..
ప్రైవేట్ వర్సిటీ పేరుతో విద్యార్థులను చేర్చుకుని, నేటికి ప్రభుత్వ నుంచి గుర్తింపు లేక విద్యా సంవత్సరం కొనసాగించలేక విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న శ్రీనిధి, గురునానక్ ప్రైవేటు వర్సిటీ యజమానులపై కఠిన చర్యలు తీసుకోని విద్యార్థుల జీవితాలను కాపాడలని ప్రభుత్వాన్ని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది..
2022-23 విద్యా సంవత్సరం పేరుతో విద్యార్థుల నుంచి లక్షల రూపాల్లో వసూలు చేసి, అడ్మిషన్లు చేసినా.. నేటికి వర్సిటీ ఏర్పాటుకు ఎటువంటి అనుమతి లేదు.. ఇదేమిటి అని విద్యార్థులు అడిగితే వారికీ సమాధానం చెప్పడం చేతకాక.. పోలీసులు బెదిరింపులు, అక్రమంగా అరెస్టులు వర్సిటీ ప్రాంగణంలో పీకెటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థులను భయబ్రాంతులకు గురి చేయటం సరికాదు.. ప్రభుత్వ నిబంధన ఉల్లంఘించి అడ్మిషన్లు నిర్వహించిన శ్రీనిధి, గురునానక్ యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోకుండా కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం.. సుమారు 5000 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోని, వారికి న్యాయం చేయకుంటే.. విద్యార్థుల తరపున పెద్ద ఎత్తున అందోళన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని రాష్ట్ర అధ్యక్షులు, మామిడి కాయల పరశురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇడంపాక విజయ్ కన్నాలు హెచ్చరించారు..