Wednesday, July 24, 2024

రైతుబంధు కోసం కాంగ్రెస్ మీద మండి పడ్డ మంత్రి కేటీఆర్…

తప్పక చదవండి

కామారెడ్డి : రైతుబంధు ఇవ్వాల‌న్న ఆలోచ‌న కాంగ్రెస్ రాబందుల‌కు ఎప్పుడైనా వ‌చ్చిందా..? అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప‌ది సార్లు ఓట్లేస్తే.. 50 ఏండ్లు కాంగ్రెస్ ఏలింది. క‌రెంట్ ఎప్పుడ‌న్న స‌క్క‌గ‌ ఇచ్చిందా..? మూడు గంట‌ల క‌రెంట్ చాల‌ని రేవంత్ రెడ్డి అమెరికా సాక్షిగా బ‌య‌ట‌పెట్టిండు. ఈ విష‌యాన్ని ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలోని రైత‌న్న ఆలోచించాలి అని కేటీఆర్ సూచించారు. ఎల్లారెడ్డిలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.తెలంగాణ రాక‌ముందు క‌రెంట్ ఎట్ల‌ ఉండే.. ఇప్పుడెలా ఉందో ఆలోచించాల‌న్నారు కేటీఆర్. ఎరువులు పంచే తెలివిలేదు. విత్త‌నాలు ఇచ్చే ముఖం లేదు. ఆఖ‌రికి పోలీసు స్టేష‌న్ల‌లో విత్త‌నాలు పంచిన దౌర్భాగ్య‌పు పాల‌న కాంగ్రెస్‌ది. నాడు పేలిపోయే ట్రాన్స్‌పార్మ‌ర్లు, కాలిపోయే మోటార్లు.. నెర్రెలు బారిన నేలలు.. నెత్తురు కారిన నేల‌లు.. నాడు తీవ్ర‌మైన దుర్భిక్షం. ఇవాళ ఎక్క‌డా చూసినా పంట‌ల‌తో తెలంగాణ‌ ప‌చ్చ‌గా క‌ళ‌క‌ళ‌లాడుతోంది. భూగ‌ర్భ జ‌లాలు పెరిగాయి. వ్య‌వ‌సాయానికి సాగునీరు, 24 గంట‌ల క‌రెంట్ అందుతుంది అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.ఎవ‌రు కావాలో ఆలోచించుకోండి.. ఆగం కాకండి..కేసీఆర్ మూడు పంట‌లకు నీళ్లు ఇస్తున్నా అంటుండు.. 24 గంట‌ల క‌రెంట్ ఉచితంగా ఇస్తున్నా అంటుండు. కాంగ్రెసోళ్లేమో మూడు గంట‌లు క‌రెంట్ అంటున్నారు. బీజేపోళ్లు హిందు, ముస్లిం అంటరు త‌ప్ప వారికి ఇంకో మాట రాదు అని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎవ‌రు కావాలి మీకు.. మూడు గంట‌ల క‌రెంట్ ఇస్తానంటున్న కాంగ్రెసా.. మూడు పంట‌లు ఇస్తానంటున్నా కేసీఆరా.. మ‌తం పేరిట మంట‌లు పెడుతానంటున్న బీజేపీనా.. ఎవ‌రు కావాలో ఆలోచించండి.. ఆగం కాకండి.. రాబందులు కావాల్నా.. రైతుబంధు కావాల్నా ఆలోచించుకోవాల‌ని కేటీఆర్ సూచించారు.కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే దిక్కుమాలిన ద‌ళారీల రాజ్యమే..కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ధ‌ర‌ణి, రైతు బంధు, ద‌ళిత బంధు, బీసీ బంధు ర‌ద్దు చేస్తార‌ని కేటీఆర్ పేర్కొన్నా. మ‌ళ్లా దిక్కుమాలిన ద‌ళారీల రాజ్యం, కుంభ‌కోణాల కుంభ‌మేళా తెరుస్తారు. గ‌తంలో క‌రెంట్ ఎట్ల ఉండే. మంచినీళ్ల స‌మ‌స్య ఎట్లుండే. సాగునీటికి ఎంత గోస ఉండే. కాంగ్రెస్ ప‌రిపాల‌న‌ను సినిమా రీల్ మాదిరిగా గుర్తుకు తెచ్చుకోండి అని కేటీఆర్ సూచించారు.ద‌మ్ముంటే.. ప్ర‌జ‌ల‌కు మీరేం చేశారో చెప్పి ఓట్లు అడ‌గాలి..50 ఏండ్లు అధికార‌మిచ్చినా కాంగ్రెస్ ఏం చేయ‌లేదు. ఇప్పుడు అధికారం ఇస్తే ఏం చేస్తారు..? 50 ఏండ్ల‌లో చేసింది ఏమీ లేదు.. కానీ గ‌డ‌ప గ‌డ‌ప‌కు కాంగ్రెస్ అంట‌. కాంగ్రెస్ మాట‌లు వింటుంటే విచిత్రం అనిసిస్తుంది అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. ష‌బ్బీర్ అలీ మంత్రి గా ఉన్న‌ప్పుడు మెడిక‌ల్ కాలేజీ రాలేదు. కానీ కేసీఆర్ నాయ‌క‌త్వంలో మెడిక‌ల్ కాలేజీ వ‌చ్చింది. 9 ఏండ్ల‌లో మేం ఏం చేశామో చెప్పాలంటే స‌మ‌యం స‌రిపోదు. రైతుబీమా కింద రూ. 5 ల‌క్ష‌ల చొప్పున మంజూరు చేస్తున్నాం. గ‌తంలో స‌ర్కార్ ద‌వఖానాల‌కు వెళ్లే ప‌రిస్థితి లేదు. ఇప్పుడు స‌ర్కార్ ద‌వ‌ఖానాల‌కు రోగుల సంఖ్య పెరిగింది. కంటి వెలుగు ద్వారా ఉచితంగా కండ్ల‌ద్దాలు అందించాం. ఈ ప్రోగ్రామ్ ద్వారా పెద్ద మ‌న‌షుల‌కు అండ‌గా నిల‌బ‌డ్డాం. ద‌మ్ముంటే మీరు ప్ర‌జ‌ల‌కు ఏం చేశారో చెప్పి ఓట్లు అడ‌గాలి. అన్ని వ‌ర్గాల‌కు కేసీఆర్ ద్వారా మేలు జ‌రిగింది. దేశ చ‌రిత్ర‌లోనే మొట్టమొద‌టిసారిగా బీడీ కార్మికుల‌కు, టేకేదార్ల‌కు పెన్ష‌న్లు ఇస్తున్నాం. సంక్రాంతికి గంగిరెద్దులు వ‌చ్చిన‌ట్లు ఎన్నిక‌లు రాగానే కాంగ్రెసోళ్లు మోపైత‌రు. వారు నోటికొచ్చిన‌ట్టు చెప్పే మాట‌ల‌ను న‌మ్మొద్దు అని కేటీఆర్ ప్ర‌జ‌ల‌కు సూచించారు.ఎల్లారెడ్డిలో బీజేపీ డిపాజిట్ గ‌ల్లంతు కావాలిన‌రేంద్ర మోదీ కూడా ప్ర‌జ‌ల‌కు చేసిందేమీ లేదు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. సిలిండ‌ర్ ధ‌ర‌లు పెరిగాయ‌ని మ‌న్మోహ‌న్ సింగ్‌ను తిట్టిండు. కానీ ఇవాళ సిలిండ‌ర్ ధ‌ర మాత్రం 1200 అయింది. నాడు గ్యాస్ బండ‌కు మొక్కి కాంగ్రెస్‌కు పిండం పెట్ట‌మ‌ని చెప్పిండో.. మ‌ళ్లీ మ‌నం అదేప‌ని బీజేపీకి చేయాలి. పిర‌ప‌మైన ప్ర‌ధానికి ఓటు ద్వారానే బుద్ది చెప్పాలి. బీజేపీకి ఎల్లారెడ్డిలో డిపాజిట్ గ‌ల్లంతు కావాలి. అడ్డ‌గోలుగా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెంచారు. దీంతో నిత్యావ‌స‌ర ధ‌ర‌లు పెరిగాయి. ప్ర‌ధాని మంత్రికి, బీజేపీకి బుద్ది చెబుతూ.. ఐదు ద‌శాబ్దాలు మ‌న‌ల్ని ఏడిపించిన కాంగ్రెస్‌ను తిప్పికొట్టాలి. మ‌న‌కున్నది ఒకే ఒక్క మార్గం.. రామ‌బాణం కేసీఆర్. మ‌న రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేది కేసీఆర్ మాత్ర‌మే. ఢిల్లీ బానిస‌ల‌తో ఏం కాదు. కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉంటే ఢిల్లీలో నిర్ణ‌యాలు జ‌రుగుతాయి. కానీ మ‌న‌మే అధికారంలో ఉంటే.. తెలంగాణ‌లోనే నిర్ణ‌యాలు జ‌రుగుతాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు