- త్వరలోనే ప్రకటన చేయనున్న ఇరు పార్టీలు..
- తెలంగాణలో కెసిఆర్‌ను గగద్దె దించడమే లక్ష్యం..
- విూడియా సమావేశంలో తెగేసి చెప్పిన వై.ఎస్. షర్మిల..
హైదరాబాద్: కాంగ్రెస్‌లో విలీనంపై వైస్సార్టీపీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు లోటస్ పాండులో విూడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తా. కేసీఆర్‌ను గద్దె దించడమే మా లక్ష్యం. కార్యకర్తలంతా బాగుండాలన్నదే నా ప్రయత్నం. సోనియాతో జరిగిన చర్చలను బయటపెట్టడం సరికాదు.పార్టీతో ఎలా కలిసి పనిచేయాలనే విషయంపై సోనియాతో చర్చించాం. వైఎస్సార్ అంటే కాంగ్రెస్‌కు అపారమైన గౌరవం ఉందని షర్మిల పేర్కొన్నారు. పార్టీ విలీనంపై కాంగ్రెస్‌తో చర్చలు తుది దశకు వచ్చాయని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల తెలిపారు. రాజశేఖరరెడ్డిని అపారంగా గౌరవిస్తున్నారు కాబట్టే.. సోనియా, రాహుల్‌తో చర్చలు వరకూ వెళ్ళానన్నారు. వైఎస్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చటం సోనియాకు తెలియక చేసిన పొరపాటే కానీ.. తెలిసి చేసిన తప్పు కాదని షర్మిల పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని సోనియా, రాహుల్ తనతో అన్నారన్నారు. కేసీఆర్ అవినీతి పాలను అంతమెందిచటానికే సోనియాతో చర్చలు జరిపినట్టు వెల్లడించారు.. కేసీఆర్‌ను గద్దె దించే అంశంపై సోనియా, రాహుల్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టు వెల్లడిరచారు. తమ క్యాడర్, లీడర్స్‌తో మాట్లాడాక విలీనంపై విూడియాకు చెప్తానన్నారు. తెలంగాణలో తాను 3,800 కి.విూ పాదయాత్ర చేశానని షర్మిల పేర్కొన్నారు. కేసీఆర్ పాలన పోతేనే తెలంగాణకు మంచి జరుగుతోందన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు కలసి రావాలన్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళకు చెబుతున్నానని.. రాజకీయాలంటే వండినట్లు.. తిన్నట్లు కాదన్నారు. తనతో నడిచిన వారిని తనతో పాటు నిలబెడుతానని షర్మిల పేర్కొన్నారు.