Wednesday, September 11, 2024
spot_img

రానున్న ఎన్నికల్లో మాదిగలు, బీసీలు బీజేపీ గెలుపుకోసం పనిచేయాలి : మంద కృష్ణ మాదిగ

తప్పక చదవండి

హైదరాబాద్‌ : ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలను మభ్యపె డుతూన్న కాంగ్రెస్‌, బిఅర్‌ఏస్‌ పార్టీలను జరగబోయే ఎన్నికల్లో విస్మరించి, బీసీ సీఎం నినాదానికి సమ్మతం తెలిపిన బిజెపికి మద్దతనిచ్చి ఆ పార్టీ గెలుపునకు కృషి చేయాలని మందకృష్ణ మాదిగ పిలుపు నిచ్చారు. ఈ మేరకు సోమవారం ప్రెస్స్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంద కృష్ణ మాట్లాడుతూ.. వర్గీకరణ విషయంలో బి.అర్‌.ఏస్‌, కాంగ్రెస్‌ పార్టీలు తమను ఏళ్ల తరబడి మోసం చేశాయని అందుకే స్పష్టమైన హామీ యిచ్చిన మోడీ అధ్వర్యం లోని బిజెపి పార్టీకి మద్దతు నివ్వాలని మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే భారతదేశ ప్రధాని ఎన్నో విషయాల్లో సాహ సోపేతమైన నిర్ణయాలతో దేశ ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారని అందుకే మాదిగలు దేశ ప్రధాని మా టలు విశ్వసిస్తూ తమ మద్దతును ఈ ఎన్నికలలో బిజెపి ప్రభుత్వానికి ఓటు వేసి తెలపాలని నిర్ణ యించుకున్నామని అన్నారు. బీసీని ముఖ్యమంత్రిగా చూడాలనేది బీసీలు అందరితోపాటు దశా బ్దాల కాలంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక కులానికి నాయకత్వం వహిస్తున్న నా స్వప్నం అని మందకృష్ణ మాదిగ. వ్యాఖ్యానించారు. రాష్ట్ర బిజెపి సీనియర్‌ నాయకుడు కిషన్‌ రెడ్డి ఇప్పటి వర కు మాదిగలు చేసిన ప్రతి పోరాటంలో అత్యంత నమ్మకంగా మాదిగల వైపు నిలబడ్డారు.బిజెపి తన మేని ఫెస్టోలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించింది. తెలంగాణ బీసీ బిడ్డలంతా ఈ విష యం గమ నించి తమకు రాజ్యాధికారం కావాలో లేక దొరల పాలన కావాలో తేల్చుకొని 30వ తారీ కున తమ ఓటు ను వినియోగించు కోవాలని కోరారు. నిన్నటి వరకు బీసీలకు రాజ్యాధికారం అంటూ రోడ్ల మీద కి వచ్చిన బీసీలందరూ తమకు రాజ్యాధికారం కావాలనుకుంటే బిజెపికి ఓటు వేసి బీసీని ముఖ్య మం త్రిగా తెచ్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. లేకపోతే చరిత్ర బీసీలను క్షమిం చదు అని బీసీలు తమకు తామే అన్యాయం చేసుకున్న వారు అవుతారు కాబట్టి మోసం చేసే వారికి కాకుండా మాట నిలబెట్టుకునే ప్రభుత్వాన్ని తెలంగాణలో తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు