Saturday, December 2, 2023

ఓట్లు అడగడం కోసం వచ్చేరాజకీయ పార్టీలను మనమేం అడుగుదాం?

తప్పక చదవండి

రాష్ట్రం ఏర్పడి సుమారు 10 సంవత్సరాలు కావస్తున్న సంద ర్భంలో ఈ నెల 30వ తేదీన జరిగే ఎన్నికలు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకు మూడవ ఎన్నికలు ఈ ఎన్నికల్లో తనకే ఓటు వేయమని టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్ర శేఖర రావు కోరుతున్నారు. విచిత్రమైన విషయం ఏమిటంటే ఆయన పాల్గొంటున్న అనేక ఎన్నికల ప్రచార సభల్లో తాను ఏం చేశారో, తన పార్టీ ఏంచేసిందో చెప్పి ఓట్లడగటం లేదు. ఫలానా పార్టీకి ఓటు వేస్తే జరగబోయే నష్టం ఏమిటో చెప్పి ఓట్లు అడుగుతున్నారు. అంటే ఆయన నైతికంగా తన ఓటమి ని అంగీకరించినట్లే అయింది. తొమ్మిదేళ్ల పాలన తర్వాత తాను సాధించిన విజయాలు ఇవి అని చెప్పి మాట్లాడటం న్యాయంగా ఉండేది కానీ ఆ నైతిక బలం ఆయన దగ్గర ఉన్నట్టుగా లేదు. ఇక ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్‌, బిజెపి ఇతర చిన్న చితక పార్టీలను చూసినట్లయితే అవి తమకే ఓటు వేయమని చెప్పటానికి రకరకాల హామీలను తమ మేనిఫెస్టోల్లో గుప్పిం చాయి. ఆసక్తి గలవారు ఎవరైనా టిఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ, బిజెపి పార్టీల మేనిఫెస్టోలను పక్కపక్కనే పెట్టుకొని పరిశీ లించినట్ల యితే ఏ తేడా లేనట్టుగా సులభంగానే గ్రహించ వచ్చు. మూడు పార్టీల మేనిఫెస్టోలు జిరాక్స్‌ కాపీల్లా మనకు కనబడతాయి. వాళ్ళు హామీ ఇస్తున్న డబ్బుల పంపిణీలో నామ మాత్రపు హెచ్చుతగ్గులు తప్ప అన్ని పార్టీలదీ ఒకటే విధానం. తాము పంచే డబ్బు చూసో లేదా ఎన్నికైన తర్వాత వివిధ పథ కాల పేరుతో పంచబోయే డబ్బు చూసో మాకు ఓటు వేయ మని అడగటం తప్ప వాటి మేనిఫెస్టోల్లో ఏతేడా లేదని ఎవరైనా సులభంగానే గ్రహించవచ్చు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత, రాజ్యాంగం రాయబడి అమలైన మొదట్లో దేశ ప్రజలలో సింహ భాగానికి అక్షరజ్ఞానం లేకపోవడం, అలాగే సామాజిక చైతన్యం లేకపోవడం వల్ల రాజ్యాంగం ఆశించిన ప్రజాస్వామిక స్ఫూర్తి ప్రజల్లో కొరవడటం అప్పటికి సహజమే అనిపించొచ్చు. ఈ రకమైన రాజ్యాంగ స్ఫూర్తిని గాని ప్రజా స్వామిక స్ఫూర్తిని గాని ప్రజల్లో పెంచటానికి గాను రాజకీయ పార్టీలు చేసింది ఏమి లేదు. 75 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈ దేశంలో రాజకీయ పార్టీలలో ప్రజాస్వామిక స్ఫూర్తి లేకపోవడం పరిస్థితి యొక్క తీవ్రతను తెలియజేస్తూ ఉన్నది. ప్రజాస్వా మ్యానికి ఎన్నికల నిర్వహణ పునాది కావడం వల్ల ఆ ఎన్నికల వ్యవస్థను మొదట్లో ఇదే రాజకీయ పార్టీలు వివిధ అనైతిక పద్ధతులైన రిగ్గింగ్‌, బూత్‌ క్యాప్చరింగ్‌ చేయటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవారు. ఆ తరువాత ప్రజలకి మద్యం పంపిణీ చేయడం, ఇప్పుడైతే పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే ఎన్నికల ముందు డబ్బు పంచడమే కాకుండా ఆ తర్వాత కూడా వివిధ పథకాల పేరు మీద డబ్బు పంపిణీ చేస్తామని ఓట్లు అడగటం. ఇలా రకరకాల ప్రయ త్నాల ద్వారా ప్రజలను మభ్యపెట్టి, ప్రలోభ పెట్టి, ఓట్లను సం పాదించి తద్వారా అధికారాన్ని సంపాదించి మేము ప్రజాస్వా మ్య యుతంగా ఎన్నికయ్యాము అని దబాయిం చడమే ప్రజా స్వామ్యమా? ఓసారి ఓటు వేసిన తర్వాత ఇకమేము ఏ రకంగా పరిపాలన చేసిన అడిగే హక్కు లేదు, ప్రశ్నించే స్వేచ్ఛ లేదు అని చెప్పటమే ప్రజాస్వామ్యమా? ఇంత సొగసుగా సాగు తున్న ఎన్నికల ప్రహసనం ద్వారా అధికారాన్ని చేపట్టిన రాజకీయ పార్టీలకు సంక్రమించే అధికారం విచక్షణ లేనిదా? హద్దులు లేనిదా? ప్రజలు ఓటు వేసిన తరువాత వారికి ఏ హక్కులు ఉం డవా? రాజకీయ పార్టీలు అధికారం చేపట్టిన తర్వాత ప్రజా వ్యతిరేకమైన పనులు చేస్తే, వారి హక్కులకు భంగం కలిగిస్తే ప్రజలకు అడిగే స్వేచ్ఛలేదా?ఇంతకుఓట్లు అడగటానికి వస్తున్న రాజకీయ పార్టీలను మనం ఏంఅడగాలి? నీళ్లు,నిధులు, నియా మకాలు అన్న మూడు ఆకాంక్షలతోనే కాక ఇంకా ఇతరే తర అనేక ప్రజాస్వామిక ఆకాంక్షలుసాకారంచేసుకునేందుకు సుదీ ర్ఘంగా సాగిన తెలంగాణ పోరాటం 2014లో నిజమైన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి, ఎన్నో హామీలతో అధికారంచేపట్టింది.ఈప్రాంతం గురైన వివక్ష అది రాజకీయపరమైనది కావచ్చు, ఆర్థికపరమై నది కావచ్చు, అనేక క్షేత్రాలలో గురైన వివక్షలను శాశ్వతంగా సవరించి న్యా యం చేస్తాను అన్నహామీతో అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి. వచ్చిన అనతి కాలంలోనే ప్రజలు తమ ఆకాంక్ష లను తెలియజేసేందుకు చిరకాలంగా ఒక రాజకీయ వేదికగా ఉన్న ధర్నా చౌక్‌ను ఎత్తివేయడం ద్వారా ప్రజల ఆకాంక్షల పై ఒక పెద్ద దెబ్బ కొట్టింది ఈ ప్రభు త్వం. అది మొదలు అనేక ప్రజా వ్యతిరేక రాజకీయ నిర్ణయా లను అమలుపరిచింది. కమిషన్ల ప్రాతిపదికన అభివృద్ధిని నిర్వచించే అనేక ప్రాజెక్టుల ను నిర్మించడం కోసం సాధారణ రైతుల నుంచి వేలాది ఎకరాలను స్వాధీనం చేసుకున్నది. ఒక్క నీటి ప్రాజెక్టుల పేరు మీదనే కాదు పరిశ్రమల స్థాపన కోసం, రోడ్ల నిర్మాణం కోసం సైతం వేలాది ఎకరాలను బలవంతంగా రైతులు నుంచి లాక్కు న్నది. ఇంతా చేసి ఏ రైతులయితే ఈ భూములను ఇచ్చారో ఆ ప్రాజెక్టులు, పరిశ్రమలవల్ల వారు ఎవరూ లాభపడలేదు అన్నది జగమెరిగిన సత్యం. ఇలా లక్షలాది రైతు కుటుంబాలను భూమి లేని వారిని చేసి రోడ్డుకిడ్చి నడిబజార్లో నిలబెట్టే అధి కారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? రేపు అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీ అది ఏదైనా అభివృద్ధి పేరు మీద భూములు లాక్కోమని హామీ ఇస్తున్నదా? ఇదిమనం అడగవలసిన ప్రశ్నకాదా? ప్రజ లు ఏ ప్రభుత్వ విధానం పట్లనైనా తమ నిరసన తెలియ జేసే హక్కుపై రాబోయే ప్రభుత్వాలు నిర్భంధం అమలు చేయవా? అలాఅని ఏరాజకీయపార్టీ అయినాహామీఇచ్చిందా? ఇది కూడా మనం అడగవల సిన ప్రశ్న కదా! ఆర్టిసి కార్మికులు తమ న్యా యమైన డిమాండ్ల కోసం సుదీర్ఘంగా చేసిన సమ్మె పట్ల ప్రభు త్వం వ్యవహరించిన తీరు మనందరికీ గుర్తు ఉంది కదా మరి అదే హామీని ఎవరుఅడక్కుండానే ఆతర్వాత మనముఖ్య మంత్రి నెరవేర్చారు. అసలు సమస్య ఏమిటంటే కార్మికులు ముక్తకం ఠంతో తమ న్యాయమైన కోరికలను అడిగి దానికోసం సమ్మె చేసినప్పుడు అహంభావ ధోరణితో వ్యవహరించిన ప్రభుత్వం ఏకపక్షంగా ఎవరు అడక్కుండానే ఆ హామీని అందరూ మర్చి పోయాక నెరవేర్చటం ఏరకమైన పరిపాలన ధోరణికి నిదర్శనం
` టి.హరికృష్ణ రాష్ట్ర కార్యదర్శి, మానవ హక్కుల వేదిక

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు